Home
News

యూజర్లకు YouTube గుడ్‌న్యూస్‌.. 3 నెలలపాటు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం..!

వినియోగదారులకు ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ యాప్‌ యూట్యూబ్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రస్తుతం యూట్యూబ్‌ ప్రీమియం మెంబర్‌షిప్‌లో ఉచితంగా అనేక రకాల కంటెంట్‌ను అందిస్తోంది. మరియు బ్యా‌గ్రౌండ్‌లో వీడియోలు, ఆడియోను ప్లే చేసుకోవచ్చు. దాంతోపాటు మరెన్నో అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను మూడు నెలలపాటు ఉచితంగా వినియోగించుకొనే అవకాశం ఇస్తున్నట్లు తాజాగా వెల్లడించింది.

ప్రస్తుతం భారత్‌లో యూట్యూబ్‌ ప్రీమియం మెంబర్‌షిప్‌ కోసం నెలకు రూ.139 మరియు మూడు నెలలకు రూ.399 చెల్లించాల్సి ఉంటుంది. యూట్యూబ్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో మూడు నెలలపాటు ఉచితంగా ప్రీమియం సేవలను పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ ఎప్పటి వరకు ఉంటుందో యూట్యూబ్‌ వెల్లడించలేదు.

YouTube premium subscription

సులభంగానే వినియోగదారులు యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఇప్పటి వరకు కొనుగోలు చేయని వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అందుకోసం ఈ కింది చెప్పిన విధంగా చేయండి. మూడు నెలలపాటు ఆఫర్‌ను ఉచితంగా పొందండి.

ఇందుకోసం యూట్యూబ్‌ యాప్‌ను ఓపెన్‌ చేయండి. ఫ్రొఫైల్‌ ఐకాన్‌పైన క్లిక్ చేయండి. అనంతరం యూట్యూబ్‌ ప్రీమియం ఆప్షన్‌ను ఎంచుకోండి. తర్వాత ఉచిత ఆఫర్‌పైన క్లిక్‌ చేయండి. అనంతరం బ్యాంకు కార్డు వివరాలను ఎంటర్‌ చేయండి. అప్పటి నుంచి మూడు నెలలపాటు యూట్యూబ్‌ ప్రీమియం ప్లాన్‌ ప్రయోజనాలను ఉచితంగా పొందవచ్చు.

YouTube premium subscription

3 నెలల ఉచిత ఆఫర్ ముగిసిన తర్వాత.. యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లోనే కొనసాగేందుకు నెలవారీ రూ.129 చెల్లించాల్సి ఉంటుంది. అయితే మూడు నెలల తర్వాత యూట్యూబ్‌ ప్రీమియం ప్లాన్‌ తనకు అవసరం లేదనుకొనే వినియోగదారులు.. ఆఫర్‌ గడువు ముగిసే లోపల ప్రీమియం ఖాతాను డియాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఆఫర్‌ను యాక్టివేట్‌ చేసుకున్న సమయంలో ఇచ్చిన బ్యాంకు కార్డు నుంచి నగదు ఉపసంహరించబడుతుంది.

యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో అనేక ప్రయోజనాలుంటాయి. ఇతర స్ట్రీమింగ్‌ యాప్‌ల కంటే ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. యూట్యూబ్‌ మ్యూజిక్‌ సహా ఎటువంటి యాడ్‌లు లేకుండా కంటెంట్‌ను వీక్షించవచ్చు. యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్‌ను పాటలు, వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రధానంగా 80 మిలియన్ల కంటే ఎక్కువ పాటలు, అన్‌లిమిటెడ్‌ కంటెంట్‌, యాడ్స్‌ లేకుండా కంటెంట్‌ యాక్సెస్‌ ఉంటుంది.

యూట్యూబ్‌ ప్రీమియం వినియోగదారులకు పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ మోడ్‌ సపోర్టును కలిగి ఉంటుంది. ఫలితంగా యాప్‌ను తాత్కాలికంగా మూసి వేసినా కూడా పాటలు, వీడియోలను ఆశ్వాదించగలుగుతాము. ప్రస్తుతం భారతదేశంలో యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ నెలవారీ ధర రూ.129గా ఉంది. అదే మూడు నెలల కాలానికి రూ.399 చెల్లించాలి. 12 నెలల ప్లాన్‌ ధర రూ.1290 చెల్లించాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
YouTube premium subscription can be used upto three months for free
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X