youtubeలొ 90 లక్షల వీడియోలు, 40 లక్షల ఛానల్స్ అవుట్

By Gizbot Bureau
|

అత్యంత తక్కువ కాలంలో పాపులర్ కావడానికి యూట్యూబ్ అనేది చాలామందికి బెస్ట్ ఫ్లాట్ పాం.. అలాగే ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు కూడా ఇది ప్రధాన వనరుగా ఉంది. కేవలం మొబైల్ ఫోన్ ద్వారా వీడియోలు షూట్ చేసి యూట్యూబ్ లో అప్ డేట్ చేసి ఆదాయాన్ని పొందుతుంటారు చాలామంది. అయితే రూల్స్ తెలియకుండా యూట్యూబ్ లోకి దిగితే మీరు ఇబ్బందులు పాలు అయ్యే అవకాశం ఉంది. అలా రూల్స్ ఫాల్ అవ్వకుండా కంటెంట్ అప్ లోడ్ చేసిన ఛానల్స్ చాలావాటిని యూట్యూబ్ తొలగించింది. కారణాలు ఏంటో ఓ సారి చూద్దాం.

 పనికిమాలిన వీడియోలను

యూట్యూబ్ ఆంక్షలు మరింత కఠినతరం అవుతున్నాయి. లక్షల కొద్దీ వీడియోలు ప్రతి నిత్యం అప్‌లోడ్ అవుతున్న తరుణంలో యాజమాన్యం ఎప్పటికప్పుడూ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రతి మూడు నెలలకోసారి రివ్యూ చేస్తున్న యూట్యూబ్ నిర్వాహకులు పనికిమాలిన వీడియోలను డిలీట్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో యూట్యూబ్ ఛానళ్లను సైతం తొలగిస్తున్నారు.

 ఇతరుల మనోభావాలను కించ పరిచే విధంగా

ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు తన సైట్‌లో 1 లక్ష వీడియోలను తొలగించినట్లు యూట్యూబ్ ఒక ప్రకటనలో తెలిపింది. 17వేలకు పైగా చానల్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సదరు వీడియోలను తొలగించామని యూట్యూబ్ తెలిపింది. ఎక్కువగా ఇతరుల మనోభావాలను కించ పరిచే విధంగా ఆ వీడియోలు ఉన్నాయని, అందుకనే వాటిని తొలగించామని గూగుల్ తెలిపింది.

ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో
 

ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో మొత్తం 90 లక్షలకు పైగా వీడియోలను, 40 లక్షలకు పైగా యూట్యూబ్ అకౌంట్లను తొలగించామని సంస్థ తెలిపింది. వాటిలో చాలా వరకు స్పాం కేటగిరీకి చెందిన వీడియోలు ఉన్నాయని, అనేక వీడియోలు వీక్షకులను తప్పుదోవ పట్టించే స్కాం విభాగానికి చెందినవిగా కూడా ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. అందుకనే వాటిలో చాలా వరకు వీడియోలను ఒక్కరు కూడా వీక్షించకముందే యూట్యూబ్ నుంచి తొలగించామని ఆ సంస్థ తెలియజేసింది.

థంబ్ నెయిల్ ఒకటి, లోపల కంటెంట్ మరొకటి

థంబ్ నెయిల్ ఒకటి, లోపల కంటెంట్ మరొకటి ఉంటున్న వీడియోలపై యూట్యూబ్ సీరియస్‌గా ఉంటోంది. అలాగే అత్యాచారం కేసుల్లో మైనర్లను చూపించడం లాంటి విషయాల్లో కూడా ఆచితూచి స్పందిస్తోంది. నేర ప్రవృత్తి కలిగి ఉన్న వీడియోల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. వాస్తవానికి మైనర్లను, అత్యాచార బాధితులను నేరుగా చూపించకుండా ముఖానికి మాస్క్ వేసేలా బ్లర్ చేస్తూ చూపించడమనేది ఎలక్ట్రానిక్ మీడియా ఫాలో అవుతోంది. కానీ యూట్యూబ్ ఛానళ్ల విషయంలో మాత్రం అది కంట్రోల్ లేకుండా అవుతోంది. అందుకే ఇలాంటి వీడియోలను స్క్రూటినీ చేస్తూ వేలాది వీడియోలను తొలగించడమే గాకుండా ఆయా యూట్యూబ్ ఛానళ్లపై ఉక్కుపాదం మోపుతోంది గూగుల్.

పాలసీలు మరింత కఠినంగా అమలు

యూట్యూబ్‌లో మంచి కన్నా చెడు ఎక్కువ కనిపిస్తోందనే వాదనలు లేకపోలేదు. ఆ క్రమంలో సెన్సార్ కటింగ్ లాగా యూట్యూబ్ నిర్వాహకులే చెత్తను తొలగించే పనిలో పడ్డారు. ఇకపై కూడా తమ పాలసీలను మరింత కఠినంగా అమలు చేస్తామని, యూట్యూబ్‌లో యూజర్లు అప్‌లోడ్ చేసే వీడియోలను పరిశీలించేందుకు 10వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని గూగుల్ తెలిపింది. కాబట్టి యూట్యూబ్ బిజినెస్ లోకి దిగాలనుకున్న వారు కొంచెం రూల్స్ తెలుసుకుని దిగితే మంచిది.

Best Mobiles in India

English summary
India leads tally of users flagging inappropriate content on youtube

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X