Home
News

యూట్యూబ్ క్రియేటర్లకు కమ్యూనిటీస్ ఫీచర్.. ఫ్యాన్స్‌తో డైరెక్ట్ టచ్‌లో ఉండండిలా!

YouTube Communities feature: ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తన క్రియేటర్ల కోసం అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. దాని పేరు "కమ్యూనిటీస్". "మేడ్ ఆన్ యూట్యూబ్ 2024" ఈవెంట్‌లో దీన్ని మొదట పరిచయం చేశారు. ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు, వాళ్లని ఫాలో అయ్యే వ్యూయర్లతో చాలా ఈజీగా కనెక్ట్ అవ్వొచ్చు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, అప్‌డేట్స్ షేర్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

* కమ్యూనిటీస్ అంటే..

కమ్యూనిటీస్ అనేది యూట్యూబ్ ఛానెల్‌లో క్రియేటర్లకు ఒక స్పెషల్ ప్లేస్ లాంటిది. ఇక్కడ క్రియేటర్లు తమ అప్‌డేట్స్ పోస్ట్ చేయొచ్చు, ఏదైనా టాపిక్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేయొచ్చు. వ్యూయర్లు కూడా కామెంట్స్ ద్వారా, రిప్లైస్ ద్వారా ఆ డిస్కషన్స్‌లో పాల్గొనవచ్చు. క్రియేటర్లకు, ఫ్యాన్స్‌కి మధ్య మంచి కనెక్షన్ ఏర్పడటానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

YouTube Rolls Out Communities Feature to More Creators  Here s What You Need to Know

* మొబైల్ యూజర్ల కోసమే..

ఈ కమ్యూనిటీస్ ఫీచర్ ప్రస్తుతానికి మొబైల్ యూజర్ల కోసమే డిజైన్ చేశారు. క్రియేటర్లు టెక్స్ట్ మెసేజ్‌లు, ఇమేజ్‌లు, జిఫ్‌లు, ఇంకా పోల్స్ కూడా పోస్ట్ చేయొచ్చు. అంటే, రకరకాల ఫార్మాట్స్‌లో ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. చూడటానికి ఇది చాలా ఆకర్షణీయంగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంది.

* కంట్రోల్ మీ చేతుల్లోనే..

క్రియేటర్లకు మోడరేషన్ టూల్స్ కూడా ఇచ్చారు. అంటే, కమ్యూనిటీలో ఎవరు పోస్ట్ చేయొచ్చు, డిస్కషన్స్‌ని ఎలా మేనేజ్ చేయాలి అనే కంట్రోల్ మొత్తం క్రియేటర్ల చేతుల్లోనే ఉంటుంది. దీంతో క్రియేటర్లు తమ కమ్యూనిటీని నీట్‌గా, సురక్షితంగా ఉంచుకోవచ్చు. దీనివల్ల వారి ఛానెలా ఒక గందరగోళంగా మారదు.

* క్రియేటర్లు ఎలా యాక్సెస్ చేయాలి..

యూట్యూబ్ ఈ ఫీచర్‌ని అందరికీ రిలీజ్ చేస్తున్నా, ఇంకా అందరు క్రియేటర్లకి ఇది అందుబాటులో లేదు. ప్రస్తుతానికి ఇన్వైట్ ఉన్నవాళ్లకి మాత్రమే యాక్సెస్ ఇస్తున్నారు. అర్హత ఉన్న క్రియేటర్లకు యూట్యూబ్ వాళ్లే ఈమెయిల్ పంపిస్తారు లేదా ఛానెల్ పేజీలో బ్యానర్ చూపిస్తారు.

అందులో ఈ ఫీచర్ ఎలా యూజ్ చేయాలో సూచనలు ఉంటాయి. ఇన్వైట్ వచ్చిన క్రియేటర్లు ఛానెల్ పేజీలో "గో టు కమ్యూనిటీ" ఆప్షన్ ద్వారా ఈ ఫీచర్‌ని చూడొచ్చు. కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, లేకపోతే యూట్యూబ్ హెల్ప్ సెంటర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి టర్న్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు.

* వ్యూయర్లు కమ్యూనిటీస్‌ని ఎలా చూడాలి.

వ్యూయర్లు ఒక క్రియేటర్ కమ్యూనిటీస్ ఫీచర్ ఎనేబుల్ చేశారా లేదా అని తెలుసుకోవడానికి, ఆ ఛానెల్‌కి వెళ్లాలి. ఫీచర్ ఉంటే, బ్యానర్‌తో పాటు బీటా ట్యాగ్ కనిపిస్తుంది. బ్యానర్ లేకపోతే, ఛానెల్ క్యారౌసెల్ ద్వారా స్వైప్ చేయాలి. అక్కడ "పోస్ట్స్" లేదా "గో టు కమ్యూనిటీ" ఆప్షన్స్ కనిపిస్తే, క్రియేటర్ ఫీచర్ ఎనేబుల్ చేసినట్టు లెక్క.

కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి, కమ్యూనిటీ ట్యాబ్‌ని "పోస్ట్స్" అని పేరు మార్చారు. పోస్ట్స్ ట్యాబ్ పాతలాగే పనిచేస్తుంది. క్రియేటర్లు అప్‌డేట్స్ షేర్ చేసుకోవచ్చు, యూట్యూబ్ యూజర్లు లైక్, కామెంట్, రిప్లై ఇవ్వొచ్చు. ఆసక్తి ఉన్నవారు దీన్ని ఇప్పుడే ట్రై చేయవచ్చు.

* యూట్యూబ్ ప్లాన్స్

దీన్ని విస్తృతంగా అందరికీ అందుబాటులోకి తేవడానికి ముందు, యూట్యూబ్ కొంతమంది క్రియేటర్లతో ఈ ఫీచర్‌ని టెస్ట్ చేసింది. రెస్పాన్స్ బాగా రావడంతో, ఇప్పుడు ఎక్కువ మందికి అందుబాటులోకి తెస్తున్నారు. క్రియేటర్లు, ఫ్యాన్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ పెంచడమే యూట్యూబ్ మెయిన్ టార్గెట్ అని స్పష్టంగా తెలుస్తోంది.

ఇంటరాక్షన్స్ అంటే మాట్లాడుకోవడం మరింత డైరెక్ట్ గా, పర్సనల్ గా, ఎంగేజింగ్‌గా ఉండాలని యూట్యూబ్ భావిస్తోంది. మున్ముందు ఈ ఫీచర్‌ని ఇంకా ఎక్కువ మంది క్రియేటర్లకు తీసుకొచ్చే అవకాశం ఉంది. మీరు క్రియేటర్ అయితే, అప్‌డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. అందుబాటులోకి వచ్చాక దీని ద్వారా ప్రయోజనం పొందొచ్చు.

Best Mobiles in India

English summary
YouTube launched Communities, a feature enabling creators to post updates, polls, and engage with viewers through comments. It aims to boost creator-fan interaction and is accessible on mobile.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X