Youtube Family Center యూట్యూబ్ కీలక ఫీచర్.. చిన్నారులు ఏం చేసినా తల్లిదండ్రులకు తెలిసిపోతుంది..!
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ఇటీవల కాలంలో అనేక ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా కీలక ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్ చిన్నారుల యూట్యూబ్ పర్యవేక్షణ వారి తల్లిదండ్రుల చేతుల్లో ఉండేలా అప్‌గ్రేడ్ ఫీచర్‌లను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎక్కువ మంది చిన్నారులు ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంను వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫీచర్‌ను ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. తన బ్లాగ్‌లో ఈ ఫీచర్ గురించి వెల్లడించింది.
యూట్యూబ్ ఫ్యామిలీ సెంటర్ పేరుతో (Youtube Family Center) ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. చిన్నారుల యూట్యూబ్ నియంత్రణ పూర్తిగా వారి తల్లిదండ్రుల చేతుల్లోనే ఉండనుంది. వారు అప్‌లోడ్ చేసే వీడియోలు, చూసే వీడియోలు, కామెంట్‌లపైన తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుంది. ఇందుకు చిన్నారుల యూట్యూబ్ అకౌంట్లను వారి తల్లిదండ్రులు తమ ఖాతాలకు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.

చిన్నారుల ఖాతాలను తమ యూట్యూబ్ అకౌంట్లకు లింక్ చేసిన వెంటనే.. చిన్నారులు తమ అకౌంట్లలో వీడియోలు అప్‌లోడ్ చేసినా లేదా లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించినా.. ఈమెయిల్ నోటిఫికేషన్ రూపంలో తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఫలితంగా ఎటువంటి తప్పులు జరిగే అవకాశం లేకుండా ఉంటుంది. తప్పుదోవ పట్టించే కంటెంట్‌కు చిన్నారులు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది.
ఇందుకోసం తల్లిదండ్రులు వారి యూట్యూబ్ యాప్ లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫ్యామిలీ సెంటర్ పేజీలోకి వెళ్లాలి. అనంతరం ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవాలి. ఈ వారంలో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ లోనూ ఈ ఫీచర్ వినియోగించుకోవచ్చు.
* ఇటీవలే యూట్యూబ్ తమ ప్రీమియం ప్లాన్ల ధరలను సవరించింది. individual, ఫ్యామిలీ, స్టూడెంట్ ప్లాన్ ధరలను పెంచింది. యూట్యూబ్‌లో యూడ్స్ లేకుండా కంటెంట్‌ను వీక్షించేందుకు ఈ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు వీడియోలు, మ్యూజిక్‌ను యాప్ బ్యాగ్రౌండ్‌లో ప్లే చేసేందుకు వీలుంటుంది. మరియు పిక్చర్ ఇన్ పిచ్చర్ (PiP) మోడ్, అధిక నాణ్యత కలిగిన వీడియోలను చూసేందుకు అవకాశం ఉంటుంది.
Individual ప్లాన్ నెలవారీ ధర రూ.129 ఉండగా.. ధరల పెంపుతో రూ.149 గా మారింది. ఫ్యామిలీ ప్లాన్ గతంలో రూ.189 ఉండగా.. ప్రస్తుతం రూ.299 గా మారింది. యూట్యూబ్ ప్రీమియం స్టూడెంట్ ప్లాన్ రూ.79 ఉండగా.. ధరల పెంపు అనంతరం రూ.89 గా ఉంది. కొత్త ధరలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి.
ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ల ధరల పెంపుపై యూట్యూబ్ తన స్పందన తెలియజేసింది. మెరుగైన సేవలు సహా కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించేందుకు ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు యూట్యూబ్ ఇండియా వెల్లడించింది. వీటితోపాటు వ్యక్తిగత ప్లాన్ ల ధరల్లోనూ మార్పులు చేసింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications