ఇంట్లోనే పూర్తి నిడివి గల సినిమా చూసేయండి..

Posted By: Super

ఇంట్లోనే పూర్తి నిడివి గల సినిమా చూసేయండి..

లండన్: ప్రపంచంలో కెల్లా పాపులర్ వీడియో షేరింగ్ వెబ్ సైట్ అయిన యూట్యూబ్ కొత్తగా యూజర్స్ కొసం కొత్త డీల్‌ని సెట్ చేయడం జరిగింది. హాలీవుడ్ ప్రముఖ స్టూడియోస్ అయిన వార్నర్ బ్రదర్స్, యూనివర్సిల్‌లతో చర్చించి లండన్ ప్యాన్స్ కొసం పూర్తి సినిమాలను యూట్యూబ్‌లో వీక్షించేందుకు గాను కేవలం 2.49 పౌండ్లను చెల్లించే విధంగా ఈ డీల్‌లో మాట్లాడడం జరిగింది.

ఈ డీల్‌తో వార్నర్ బ్రదర్స్, యూనివర్సిల్ స్టూడియోలకు చెందిన సినిమాలతో పాటు, ఇతర సినిమాలు మొత్తంగా యూట్యూబ్‌లో 1,000 వరకు యూజర్స్‌కు అందుబాటులోకి రానున్నాయి. యూట్యూబ్‌ని ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. యూట్యూబ్ ప్రతినిధి మాట్లాడుతూ ఇప్పటి వరకు యూట్యూబ్ అభిమానులకు వీడియోల రూపంలో ఎంటర్టెన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈరోజు నుండి అభిమానులకు సినిమాల రూపంలో కొత్త ఎంటర్టెన్మెంట్‌ అందిస్తున్నామని తెలియజేశారు.

లండన్‌లో ఉన్న సినీ అభిమానుల కొసం ప్రస్తుతం పూర్తి నిడివి కలిగిన సినిమాలను యూట్యూబ్‌లో ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు. గతంలో యూట్యూబ్‌లో మే 2011లో ఈ పూర్తి నిడివి కలిగిన సినిమాలను అమెరికాలో విడుదల చేయడం జరిగింది. అక్కడ సక్సెస్ సాధించడంతో సెప్టెంబర్ 2011న కెనడాలో విడుదల చేయగా, చివరకు ఇప్పుడు లండన్‌లో ఈ సినిమా స్కీమ్‌ని విడుదల చేస్తున్నామని తెలియజేశారు.

ఈ సినిమాలను యూజర్స్ కొసం 30 రోజులకు అద్దెకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒక సారి యూజర్ గనుక సినిమాని మొదలుపెడితే అది పూర్తి అవడానికి 48 గంటలు సమయం పడుతుందని అన్నారు. ఒక్కో సినిమాని గాను 2.49 పౌండ్లు వసూలు చేయనున్నట్లు యూట్యూబ్ యాజమాన్యం తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot