యూట్యూబ్‌లో 1,500 సినిమాలు, ఇక రచ్చ రచ్చే..

Posted By: Staff

యూట్యూబ్‌లో 1,500 సినిమాలు, ఇక రచ్చ రచ్చే..

గూగుల్ ఇండియా బ్లాగు వెల్లడించిన ప్రకారం గూగుల్‌కి అనుసంధానమైన వీడియో షేరింగ్ వెబ్‌సైట్‌ యూట్యూబ్ ఇండియన్ సినిమాలను గూగుల్ అభిమానులకు ఓ పెద్ద మూవీ కలెక్షన్‌గా అందించనున్నారు. ఇండియా మొత్తం మీద పెద్ద బాక్సీఫీసు సృష్టించిన సినిమాలను అన్ని భాషలలో కలిపి సుమారు 1,500 వరకు యూజర్స్‌కు అందించనున్నట్లు తెలిపారు.

ఇండియన్ సినిమాల కొసం గూగుల్ ప్రత్యేకంగా ఓ పేజిని రూపొదించడం జరిగింది. ఎవరైతే యూజర్స్ ఇండియాలో నివసించడం లేదో వారు ఈ క్రింది లింక్ ద్వారా యూట్యూబ్ సినిమాలను చూడొచ్చు. ఇలా గూగుల్ కొత్త సినిమా పేజీని రూపొందించడానికి కారణం ఇండియిన్ సినిమా అభిమానులకు ఉత్తమమైన, నాణ్యమైన సినిమాలను అందించడమే కాకుండా, పైరసీని అరికట్టే మార్గంలో ఓ భాగంగా తెలిపింది.

గూగుల్ కొత్త యూట్యూబ్ సినిమా పేజి ని చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ సినిమా పేజీని గనుక యూజర్స్ గమనించినట్లేతే ఇండియాలో ఉన్న అన్నిభాషలకు సంబంధించిన సినిమాలతో పాటు, రాబోయే కాలంలో యూట్యూబ్‌లోకి రానున్న సినిమాల విషయాలను కూడా తెలియజేస్తుంది. యూట్యూబ్ విడుదల చేసిన ఈ పేజీకి షారుఖ్ అభిమానుల నుండి మంచి స్పందన వస్తుంది. అంతేకాకుండా షారుఖ్ నటించిన టాప్ బాలీవుడ్ క్లాసిక్ సినిమాలు మొదటి ఐదు స్లాట్స్‌లలో ఉండడం విశేషం. ఇక్కడ అభిమానులు గమనించాల్సిన విషయం ఏమిటంటే షారుఖ్ ఖాన్ గూగుల్ భాగస్వామ్యంతో కలసి ఇటీవల కొత్తగా రూపొందించిన రా వన్ సినిమాని గూగుల్ ప్లస్‌లో కూడా ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ సంవత్సరం జూన్‌లో కొత్తగా యూట్యూబ్ బాక్సాఫీసు ఛానల్‌లో రాబోయే కాలంలో వచ్చేటటువంటి రెండు సినిమాలను ముందుగానే ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot