యూట్యూబ్ ప్రీమియంలో సౌండ్ క్వాలిటీ అప్‌గ్రేడ్, 4x స్పీడ్‌తో వీడియోలు.. ఇక రచ్చ రచ్చే!
YouTube Premium: ప్రముఖ వీడియో షేరింగ్ దిగ్గజం యూట్యూబ్, తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి మరింత ప్రత్యేకమైన ఫీచర్లను పరిచయం చేస్తోంది. తాజాగా, యూట్యూబ్ ప్రీమియం యూజర్లు కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో హై-క్వాలిటీ ఆడియో, వీడియోలను చాలా ఫాస్ట్‌గా చూసే ఆప్షన్, ఇంకా iOS, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొన్ని స్పెషల్ టూల్స్ కూడా ఉన్నాయి. అవేవో చూద్దాం.
* iOS, ఆండ్రాయిడ్ ప్రీమియం యూజర్లకు ఫీచర్లు
సరికొత్త ఆడియో క్వాలిటీ ఫీచర్‌తో యూట్యూబ్ ప్రీమియం యూజర్లు మ్యూజిక్ వీడియోలను 256kbps ఆడియో క్వాలిటీతో వినొచ్చు. అంటే పాటలు మరింత స్పష్టంగా, సూపర్ క్లారిటీతో వినిపిస్తాయి. ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్‌కి ఇది నిజంగా యూజ్‌ఫుల్ ఫీచర్. యూట్యూబ్ ప్రీమియం ఫాస్టర్ ప్లేబ్యాక్ స్పీడ్స్ (Faster Playback Speeds) కూడా తీసుకొచ్చింది.

మొబైల్ యూజర్లు వీడియోలను ఏకంగా 4x స్పీడ్‌తో చూడొచ్చు. ఇంతకుముందు గరిష్టంగా 2x స్పీడ్ మాత్రమే ఉండేది. టైమ్ లేనప్పుడు, తొందరగా వీడియోలు చూడాలనుకున్నప్పుడు ఈ ఫీచర్ సూపర్ యూస్‌ఫుల్. వెబ్ యూజర్ల కోసం 'జంప్ ఎహెడ్’ (Jump Ahead) అనే కొత్త ఫీచర్ వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వీడియోల్లోని బెస్ట్ మూమెంట్స్ కు ఈజీగా స్కిప్ చేయొచ్చు.
యూట్యూబ్ స్పెషల్ అల్గారిథమ్స్ (Algorithms), యూజర్ల ఫీడ్‌బ్యాక్ (Feedback) ద్వారా వీడియోలో హైలైట్స్ ని గుర్తిస్తుంది. సినిమాల్లో, వీడియోల్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఎక్కడ ఉంటుందో ఆ పార్ట్స్ హైలెట్ చేస్తుంది. ఇంతకుముందు ఈ ఫీచర్ మొబైల్ యూజర్లకే ఉండేది, కానీ ఇప్పుడు వెబ్‌సైట్‌లో కూడా వచ్చేసింది.
* ఐఓఎస్ (iOS) యూజర్ల కోసం స్పెషల్ ఫీచర్లు
ఐఫోన్ (iPhone) యూజర్లకు యూట్యూబ్ ప్రీమియంలో పిక్చర్-ఇన్-పిక్చర్ (Picture-in-Picture) మోడ్ వచ్చేసింది. దీంతో మీరు షార్ట్స్ చూస్తూనే, ఇతర యాప్స్ కూడా వాడుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ చేసేవాళ్లకి ఇది నిజంగా బెస్ట్ ఫీచర్. అలాగే "స్మార్ట్ డౌన్‌లోడ్స్ ఫర్ షార్ట్స్" ఫీచర్ కూడా ఉంది. దీంతో ఇంట్రెస్ట్‌లకు తగ్గ షార్ట్స్‌ని యూట్యూబ్ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేస్తుంది.
నెట్ లేనప్పుడు, అంటే ఆఫ్‌లైన్‌లో కూడా ఈ షార్ట్స్‌ని హ్యాపీగా చూసేయొచ్చు. చివరగా కాన్వర్జేషనల్ ఏఐ (Conversational AI) ఫీచర్. ఐఓఎస్ యూజర్లు యూట్యూబ్‌ని వీడియోల గురించి క్వశ్చన్స్ అడగొచ్చు, లేదా పర్సనలైజ్డ్ రెకమెండేషన్స్ (Personalized recommendations) కూడా పొందొచ్చు. ఈ ఫీచర్ 2023లోనే మొదలైంది, ఇప్పుడు మరింత డెవలప్ చేశారు.
* ఆండ్రాయిడ్ యూజర్లకు స్పెషల్ ఫీచర్లు
ఆండ్రాయిడ్ యూజర్లకు యూకే, ఐర్లాండ్‌లో 'ఆస్క్ మ్యూజిక్’ అనే ఫీచర్ వచ్చింది. దీని ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు "రిలాక్సింగ్ జాజ్" (Relaxing Jazz) లేదా "అప్‌బీట్ వర్కౌట్ ట్రాక్స్" (Upbeat Workout Tracks) వంటి స్పెసిఫిక్ మ్యూజిక్ టైప్స్‌ని అడగవచ్చు. యూట్యూబ్ మ్యూజిక్ సంస్థ ఇంట్రెస్ట్స్‌కు తగ్గట్టు పర్సనలైజ్డ్ రేడియో స్టేషన్స్ క్రియేట్ చేస్తుంది.
* యూఎస్ (US) యూజర్లకు మరిన్ని లాభాలు
అమెరికాలో గూగుల్ వన్ ప్రీమియం (Google One Premium) ప్లాన్ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్స్ తీసుకునే వాళ్లకు యూట్యూబ్ ప్రీమియంలో డిస్కౌంట్స్ కూడా లభిస్తాయి. వీటిలో చాలా ఫీచర్లు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి కానీ, ఇండియాలో ఈ అప్‌డేట్స్ ఎప్పుడు వస్తాయనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.
అయితే ఇండియా యూట్యూబ్‌కి చాలా పెద్ద మార్కెట్ కాబట్టి, ఈ ఫీచర్లు త్వరలోనే ఇండియన్ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు. యూట్యూబ్ ప్రీమియం ఇప్పటికే యాడ్స్-ఫ్రీ వీడియోలు, బ్యాక్‌గ్రౌండ్ ప్లే, డౌన్‌లోడ్స్ వంటి ఫీచర్లను అందిస్తోంది. ఈ కొత్త ఫీచర్లు యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని మరింత బెటర్ చేయడానికి తీసుకొచ్చారు.


Click it and Unblock the Notifications








