ఆగిపోయిన యూట్యూబ్‌... గగ్గోలు పెట్టిన యూజర్లు

వీడియో స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్‌ యూట్యూబ్‌ ఆకస్మత్తుగా నిలిచిపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు కాసేపు ఇబ్బంది పడ్డారు. బుధవారం ఉదయం యూట్యూబ్ డెస్క్‌టాప్ వర్షన్ పనిచేయడం ఆగిపోయింది.

|

వీడియో స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్‌ యూట్యూబ్‌ ఆకస్మత్తుగా నిలిచిపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు కాసేపు ఇబ్బంది పడ్డారు. బుధవారం ఉదయం యూట్యూబ్ డెస్క్‌టాప్ వర్షన్ పనిచేయడం ఆగిపోయింది. యాప్ బాగానే పనిచేస్తున్నప్పటికీ డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ రావడం లేదని కొంత యూజర్లు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు. మరికొంత మందికి యాప్‌లో కూడా యూట్యూబ్ ఇబ్బంది పెట్టింది. డెస్క్‌టాప్‌లో యూట్యూబ్‌ను ఓపెన్ చేస్తే ఇంటర్నల్ ఎర్రర్ మెసేజ్ వస్తోందని చాలా మంది స్క్రీన్ షాట్లు పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిర్యాదుల మీద ఫిర్యాదులు రావడంతో గూగుల్ స్పందించింది. సమస్యను పరిష్కరించింది.

 

సమస్యను తెలియజేసినందుకు వినియోగదారులకు యూట్యూబ్ కృతజ్ఞతలు తెలిపింది....

సమస్యను గుర్తించి వెంటనే తమకు తెలియజేసినందుకు వినియోగదారులకు యూట్యూబ్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఒక ట్వీట్ చేసింది. ‘యూట్యూబ్, యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ మ్యూజిక్ యాక్సెస్‌లో తలెత్తిన సమస్యల గురించి ఫిర్యాదు చేసినందు ధన్యవాదాలు. సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. సమస్య పరిష్కారం అయినవెంటనే మీకు తెలియజేస్తాం. మీకు అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు చెబుతున్నాం' అని యూట్యూబ్ తన ట్వీట్‌లో పేర్కొంది.

యూట్యూబ్‌ కంటెంట్‌ చూడాలని వెబ్‌సైట్‌లోకి వెళ్తే....

యూట్యూబ్‌ కంటెంట్‌ చూడాలని వెబ్‌సైట్‌లోకి వెళ్తే....

యూట్యూబ్‌ కంటెంట్‌ చూడాలని వెబ్‌సైట్‌లోకి వెళ్తే 500 ఇంటర్నల్‌ సర్వర్‌ ఎర్రర్‌, 503 నెట్‌వర్క్‌ ఎర్రర్‌ అని వస్తుందని నెటిజన్లు వాటికి సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను షేర్‌ చేశారు . అలాగే యూజర్స్‌కు వెబ్‌సైట్‌ లాగిన్‌ కావడం లేదని పేర్కొన్నారు. మొత్తానికి సమస్య తలెత్తిన కొన్ని గంటల్లో యూట్యూబ్ పరిష్కరించింది. ప్రస్తుతం డెస్క్‌టాప్ వర్షన్ బాగానే పనిచేస్తోంది.

గత నెలలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ క్రాష్‌ అయ్యాయి....
 

గత నెలలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ క్రాష్‌ అయ్యాయి....

గత నెలలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ప్రదేశాల్లో ఇలాగే క్రాష్‌ అయ్యాయి

 

 

Best Mobiles in India

English summary
YouTube was down but now it’s back.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X