క్యాన్సర్‌తో యువరాజ్ ‘ఢీ’!

ఓ వైపు ప్రాణాలను హిరించే క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతూ మరో వైపు చెక్కుచెదరని ఆత్మస్థైర్యంతో కూడిన క్రీడాస్పూర్తిని ప్రదర్శించి భారతావనికి ప్రపంచ కప్‌ను అందించటంలో కీలక పాత్ర పోషించిన డేరింగ్ డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాల పై దృష్టిసారించారు. లండన్‌లో సుధీర్ఘ చికిత్స అనంతరం క్యాన్సర్‌ను జయించిన ఈ స్టైలిష్ స్ట్రోక్ మేకర్ తాజాగా విండోస్‌తో జతకట్టి ఆవిష్కరించిన ‘యూవీకెన్ ఫైట్ క్యాన్సర్’ (YouWeCan Fight Cancer)మొబైల్ అప్లికేషన్‌కు అన్నివర్గాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.
విండోస్ ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను విండోస్ ఫోన్ మార్కెట్ ప్లేస్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెయిడ్ వర్షన్ కూడా అందుబాటులో ఉంది. పెయిడ్ వర్షన్ అప్లికేషన్‌ను రూ.565 చెల్లించి డౌన్ చేసుకోవల్సి ఉంది. యూజర్ చెల్లించిన మొత్తంలో అధిక శాతం యువరాజ్ సింగ్ ఫౌండేషన్‌కు చేరుతుంది. ఈ మొత్తాన్ని క్యాన్సర్ డిటెక్షన్ చెకప్‌లకు ఉపయోగిస్తారు.
ఈ అప్లికేషన్ ద్వారా యువరాజ్ సింగ్ బాల్య జీవితం అదేవిధంగా క్రీడా జీవితానికి సంబంధించిన పూర్తి విశేషాలను తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వివిధ రకాల క్యాన్సర్‌లకు సంబంధించిన కీలక అంశాలను ఫోటోలు, కంటెంట్ రూపంలో అప్లికేషన్‌లో నిక్షిప్తం చేశారు. ఔత్సాహికులు, ప్రత్యేకంగా డిజైన్ చేసిన టీ-షర్ట్‌లతో పాటు టోపీలను కొనుగోలు చేసి క్యాన్సర్ నిర్మూలనకై యువీ చేస్తున్న పోరుకు చేయూతనివచ్చు.


Click it and Unblock the Notifications