Home
News

ముద్దులొలికే పర్సు రోబో 'మిరుమి'.. యుకై ఇంజనీరింగ్ అదిరిపోయే సృష్టి!

By Ram Kumar

టెక్నాలజీ ప్రపంచంలో వింతలూ, విశేషాలూ సృష్టించడంలో యుకై ఇంజనీరింగ్ (Yukai Engineering) ఎప్పుడూ ముందుంటుంది. ఈ సంస్థ పిల్లిలాంటి మెత్తటి దిండు 'కూబా', వేలును కొరికే 'అమాగామి హామ్ హామ్' వంటి వింత రోబోలతో ఇదివరకే అందరి దృష్టినీ ఆకర్షించింది. తాజాగా 'మిరుమి (Mirumi)' అనే సరికొత్త రోబోను CES 2025 వేదికపై ఆవిష్కరించింది.

గతంలో కంటే ఈసారి యుకై ఇంజనీరింగ్ మరింత వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. మిరుమి అంటే ఒక చిన్న, బొచ్చుతో ఉండే రోబో. దీన్ని పర్సుకు తగిలించుకోవచ్చు.

Yukai Engineering Unveils Mirumi  a Fuzzy Robot Designed to Delight at CES 2025

ఇది చూడటానికి చాలా ముద్దుగా ఉంటుంది. చిన్న పిల్లలు కొత్తవాళ్లను చూసినప్పుడు ఎలా అయితే ఆసక్తిగా చూస్తారో, అచ్చం అలాగే మిరుమి కూడా తలని అటూ ఇటూ తిప్పుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. ఎవరైనా దగ్గరికి రాగానే అది వారివైపు చూస్తుంది.

చిన్న పిల్లలు మనల్ని చూసి మురిసినప్పుడు మనకు కలిగే ఆనందాన్ని గుర్తుచేసేలా మిరుమి ప్రవర్తిస్తుంది. సరిగ్గా ఈ భావన నుంచే యుకై ఇంజనీరింగ్ మిరుమిని రూపొందించడానికి స్ఫూర్తి పొందింది. పిల్లలు తమ భావాలను వ్యక్తం చేసినట్టే, మిరుమి కూడా తన తల కదలికలతో కుతూహలం, సిగ్గు వంటి భావాలను తెలియజేస్తుంది.

* రూపొందించింది ఇక్కడే

ఈ మిరుమి రోబోని యుకై ఇంజనీరింగ్ సంస్థలో జరిగిన అంతర్గత 'మేక్-ఎ-థాన్ (Make-a-Thon)' అనే క్రియేటివ్ ఈవెంట్‌లో రూపొందించారు. జపాన్ జానపద కథల్లోని కొంటె దయ్యాలైన 'యోకై (Yokai)'ల స్ఫూర్తితో ఈ రోబోను తయారు చేశారు. ఈ రోబో చూడటానికి సరదాగా, ముద్దుగా ఉండాలనేది యుకై ఇంజనీరింగ్ లక్ష్యం.

* ఇలా పనిచేస్తుంది

మిరుమి తన చుట్టూ ఉన్న పరిసరాలను గుర్తించడానికి మోషన్ సెన్సార్లు, ప్రాక్సిమిటీ సెన్సార్లు, అది తగిలించిన పర్సు కదలికలను ఉపయోగిస్తుంది. ఇది వివిధ సందర్భాలలో వేర్వేరు భావోద్వేగాలను వ్యక్తం చేయడానికి కొన్ని ప్రత్యేకమైన రీతుల్లో ప్రవర్తిస్తుంది. అవి ఏంటంటే,

* కుతూహలం: పర్సు కదలడం మొదలుపెడితే, మిరుమి చుట్టూ చూస్తూ ఆసక్తిని కనబరుస్తుంది.

* ప్రశ్నించడం: ఎవరైనా మనిషి లేదా వస్తువు దగ్గరలో ఉంటే, వారివైపు తల తిప్పి కుతూహలంగా చూస్తుంది.

* సిగ్గు, జాగ్రత్త: ఎవరైనా హఠాత్తుగా దగ్గరికి వస్తే లేదా పర్సును తడిమితే, మిరుమి సిగ్గుపడుతూనో, భయపడుతూనో తల దించుకుంటుంది.

* తిరస్కారం: ఒకవేళ పర్సును గట్టిగా ఊపితే, మిరుమి "వద్దు" అన్నట్లుగా తల ఊపుతుంది.

* సౌకర్యం: కొంతసేపు ఎవరూ డిస్టర్బ్ చేయకపోతే, మిరుమి మళ్లీ తల తిప్పి చుట్టూ చూస్తుంది, అంటే అది సౌకర్యంగా ఉందని చూపిస్తుంది.

యుకై ఇంజనీరింగ్ రూపొందించిన ఈ మిరుమి రోబో ఒక సరదా అనుభూతిని అందిస్తుంది. దీని అల్లరి చేష్టలు ఒక రకమైన ఆనందాన్ని, కుతూహలాన్ని నింపుతాయి. ప్రత్యేకమైన, వినోదాత్మకమైన టెక్నాలజీని ఇష్టపడేవారికి మిరుమి ఒక చక్కని తోడుగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ రోబో ఎలా పని చేస్తుందో చూపించే వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Yukai Engineering's Mirumi, a furry robot unveiled at CES 2025, mimics baby-like emotions through head movements. Attached to a purse, it delights bystanders with its curiosity, shyness, and playful behavior.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X