ఇయర్‌ఫోన్స్ కోసం జీబ్రానిక్స్ ZEB-BE380T వైర్‌లెస్ మాడ్యుల్

ప్రముఖ ఐటీ ఇంకా ఆడియో ఉపకరణాల తయారీ కంపెనీ జీబ్రానిక్స్, ఇయర్‌ఫోన్స్‌ను కనెక్ట్ చేసకునే విధంగా సరికొత్త బ్లుటూత్ మాడ్యుల్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ZEB-BE380T పేరుతో అందుబాటులో ఉండే ఈ మాడ్యుల్ ద్వారా ఇయర్‌ఫోన్స్ అలానే హెడ్‌ఫోన్‌లను వైర్‌లెస్‌గా మార్చేసుకోవచ్చు. ఈ మాడ్యుల్‌లో నిక్షిప్తం చేసిన 3.5mm జాక్, ఎటువంటి ఇయర్‌ఫోన్ లేదా హెడ్‌ఫోన్‌‌ను అయినా వైర్‌లెస్‌గా మార్చేస్తుంది.

ఇయర్‌ఫోన్స్ కోసం జీబ్రానిక్స్ ZEB-BE380T వైర్‌లెస్ మాడ్యుల్

Read More : ఇంట్లో Wi-Fi పెట్టిస్తున్నారా..?

ZEB-BE380T మాడ్యుల్‌లో ఆడియో జాక్‌తో పాటు వాల్యుమ్ కంట్రోల్ బటన్స్, మీడియా కంట్రోల్ బటన్స్ ఎంబెడ్ అయి ఉంటాయి. MP3 ప్లేబ్యాక్ కోసం ఓ మైక్రోఎస్డీ స్లాట్‌ను కూడా ఈ మాడ్యుల్‌లో ఎంబెడ్ చేయటం జరిగింది. ఈ మాడ్యుల్ తో పాటుగా బండిల్డ్ ప్యాక్ క్రింద వచ్చే ఇయర్‌ఫోన్స్ ఇన్-ఇయర్ టైప్ మోడల్‌లో ఉంటాయి. మెటాలిక్ డిజైనిడ్ బ్యాక్ ఫినిష్‌తో వచ్చే ఈ ఇయర్ ఫోన్స్‌లో ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ విత్ ఇయర్ కప్స్ సౌకర్యం కూడా ఉంది.

ఇయర్‌ఫోన్స్ కోసం జీబ్రానిక్స్ ZEB-BE380T వైర్‌లెస్ మాడ్యుల్

Read More : నోకియా 3లో అంత దమ్ముందా...

క్లిప్ డిజైన్‌తో వచ్చే ఈ మాడ్యుల్‌ను ఎటువంటి దుస్తుకైనా సులువగా పిన్ చేసుకునే వీలుంటుంది. జాగింగ్ చేసే సమయంలో, రన్నింగ్ చేసే సమయంలో, ట్రావెలింగ్ సమయంలో మ్యూజిక్‌ను ఆస్వాదించేందుకు ఈ మాడ్యుల్ పర్‌ఫెక్ట్ ఛాయిస్. ZEB-BE380T మాడ్యుల్‌లో ఏర్పాటు చేసిన బ్లుటూత్ వ్యవస్థ అంతరాయం అనేదే లేకుండా 10 మీటర్ల రేంజ్ వరకు కవర్ చేయగలుగుతుంది. బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్ లలో ఈ మాడ్యుల్ అందుబాటులో ఉంటుంది. అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో ఈ డివైస్ లభ్యమవుతుంది.

English summary
Zebronics launches ZEB-BE380T wireless module for headphones earphones. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot