జీబ్రానిక్స్ నుంచి కొత్త పవర్‌బ్యాంక్ వచ్చేసింది

ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్, అండర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, ఓవర్ లోడ్ ప్రొటెక్షన్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ పవర్‌బ్యాంక్‌లో ఉన్నాయి.

|

జీబ్రానిక్స్ బ్రాండ్ నుంచి సరికొత్త పవర్‌బ్యాంక్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ZEB-MC15000D పేరుతో ఈ పవర్‌బ్యాంక్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.2999. ఈ పవర్‌బ్యాంక్ శక్తివంతమైన 15000mAh Li-ion బ్యాటరీని కలిగి ఉంటుంది. 328 గ్రాములు బరువుతో వచ్చే ఈ పవర్‌బ్యాంక్ చుట్టుకొలత 160 x 69.1 x 23.2 మిల్లీ మీటర్లు. ఎల్ఈడి టార్చ్ ఫీచర్ ఈ పవర్‌బ్యాంక్‌కు మరో ప్రధానమైన ఆకర్షణ. ఈ టార్చ్‌ను చీకటి వాతావరణంలో ఉపయోగించుకోవచ్చు.

జీబ్రానిక్స్ నుంచి కొత్త పవర్‌బ్యాంక్ వచ్చేసింది

ఈ పవర్‌బ్యాంక్‌లో రెండు యూఎస్బీ పోర్ట్స్ ఉంటాయి. వీటిలో మొదటిది 1A అవుట్‌పుట్‌ను కలిగి ఉంటే, రెండవ పోర్ట్ 2A అవుట్‌పుట్‌ను కలిగి ఉంటుంది. 2A పోర్ట్ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్‌ను యూజర్ పొందవచ్చు. ఈ పవర్ బ్యాంక్ పూర్తిగా ఛార్జ్ అవటానికి 8 నుంచి 9 గంటల సమయం తీసుకుంటుంది. యూఎస్బీ కేబుల్ ద్వారా పవర్‌బ్యాంక్‌ను ఛార్జ్ చేసుకోవల్సి ఉంటుంది. పవర్ బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ ఎల్ఈడి డిస్‌ప్లే ద్వారా ఛార్జింగ్ శాతాన్ని తెలుసుకోవచ్చు. ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్, అండర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ పవర్ బ్యాంక్‌లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ స్టోర్‌లలో ఈ పవర్ బ్యాంక్ సంవత్సరం వారంటీతో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Zebronics ZEB-MC15000D Powerbank launched. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X