ZEE5 Hypershots: టిక్‌టాక్‌కు పోటీగా కొత్త యాప్

|

ZEE ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ నుండి వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ZEE5 టిక్ టోక్ తో పోటీ పడటానికి సిద్ధంగా ఉంది. గత రెండు సంవత్సరాల్లో 100 కంటే ఎక్కువ ఒరిజినల్ షోలను నిర్మించిన తరువాత ZEE5 హైపర్ లోకల్ కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లను నిర్మించాలనుకుంటున్నది.

ZEE హైపర్‌షాట్‌ యాప్

ZEE హైపర్‌షాట్‌ యాప్

ఈ ఏడాది చివర్లో హైపర్‌షాట్‌ యాప్ ను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. ZEE సంస్థ నుండి వస్తున్న ఈ కొత్త యాప్ టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో పోటీ పడనుంది. ZEE5 యొక్క కొత్త యాప్ ను సాధారణ వ్యక్తుల నుండి ప్రముఖుల వరకు ఎవరైనా సరే 90 సెకన్ల వీడియో కంటెంట్ ను సృష్టించడానికి అవకాశం ఉంటుంది. హైపర్‌షాట్‌లతో ZEE5 సూపర్ యాప్ మోడల్‌ను కూడా అన్వేషిస్తోంది.

 

 

Airtel Wi-Fi Callingతో ఫోన్ కాల్ డ్రాప్‌లకు చెక్...Airtel Wi-Fi Callingతో ఫోన్ కాల్ డ్రాప్‌లకు చెక్...

ZEE5 సూపర్ యాప్

ZEE5 సూపర్ యాప్

వినోదం కోసం నిర్మించిన సూపర్ యాప్ ద్వారా డిజిటల్ వీడియోల కోసం వన్-స్టాప్ డెస్టినేషన్ ను నిర్మించాలనుకుంటున్నాము అని ZEE5 ఇండియా యొక్క CEO తరుణ్ కాటియల్ పత్రిక సమావేశంలో తెలిపారు. వినియోగదారులు లాంగ్-ఫార్మ్ వీడియో కోసం మాత్రమే మా వద్దకు రావాలని మరియు స్మాల్-ఫార్మ్ కోసం వేరే చోటికి వెళ్లాలని మేము కోరుకోము. డిజిటల్ పర్యావరణ వ్యవస్థ వినియోగదారులను మరింత స్వేచ్ఛను అందిస్తున్నది. ZEE5 తో వారి యొక్క అలవాటు మరింత మెరుగుపడుతుంది అని అన్నారాయన. మద్దతు ఉన్న కంటెంట్ తో హైపర్‌షాట్‌ల ద్వారా వీడియోను ఒక వేదిక వద్ద రూపొందించబడుతుంది. అయితే చివరికి దీనిని చందా ప్లాట్‌ఫారమ్‌గా మార్చాలని ZEE5 యోచిస్తోంది.

 

 

FASTag కొనుగోలుకు ఇదే సరైన సమయం... ఉచితంగా!!!!FASTag కొనుగోలుకు ఇదే సరైన సమయం... ఉచితంగా!!!!

ఇండియాలో టిక్‌టాక్‌కు పోటీగా ZEE5

ఇండియాలో టిక్‌టాక్‌కు పోటీగా ZEE5

డైరెక్ట్-టు-డిజిటల్ చిత్రాలలో పెట్టుబడులలో భాగంగా సంవత్సరానికి కనీసం 15 నుండి 20 చిత్రాలను ప్రారంభించాలని ZEE5 యోచిస్తోంది. ఏషియానెట్, సువర్ణ, టివి 9 మరియు రిపబ్లిక్ వంటి జాతీయ మరియు ప్రాంతీయ వార్తా ఛానెళ్ల ప్రత్యక్ష ఫీడ్‌లను అందించే ప్రయత్నాలలో ఈ పుష్ చేరనుంది. ZEE5 ఇప్పటికే 14 భాషలలో కంటెంట్‌ను అందిస్తున్నది. మరియు త్వరలో అస్సామీలో కూడా ZEE తన కంటెంట్‌ను అందివ్వనున్నది అని కాటియల్ విలేఖరులకు చెప్పారు. ZEE5 టెక్నాలజీలో తన పెట్టుబడులను కూడా విస్తరిస్తోంది. అయితే ఇది కంటెంట్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేస్తూనే ఉంది.

 

 

OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్

ZEE కంటెంట్‌

ZEE కంటెంట్‌

వినియోగదారు డేటా ప్లాట్‌ఫామ్‌లోని పెట్టుబడులు చిన్న చిన్న సమన్వయాలను మరియు విభాగాలను నిర్మించటానికి వీలు కల్పిస్తుంది. ఎవరో ఒకరు టీవీ షో ప్రేమికుడిగా ఉంటారు కానీ ఎక్కువ మంది థ్రిల్లర్లను చూడటం ఆనందిస్తారు. మహిళలు ఎక్కువగా సీరియల్స్ చూడటానికి ఇష్టపడతారు. ఇందులో భాషా ప్రాధాన్యతలు కూడా ఉన్నాయి. అలాగే వాడుక యొక్క ఫ్రీక్వెన్సీ కూడా ఉంది. ఈ అన్ని పారామితుల ఆధారంగా వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన నోటిఫికేషన్‌లను పంపగలుగుతున్నారు. ఇప్పుడు 1,200 మంది వినియోగదారులతో కలసి పనిచేస్తున్నాము అని కాటియల్ తెలిపారు.

 

 

Samsung Galaxy A20s,S10 Series ఫోన్‌ల మీద భారీ తగ్గింపుSamsung Galaxy A20s,S10 Series ఫోన్‌ల మీద భారీ తగ్గింపు

ZEE5 మొబైల్ అప్లికేషన్‌

ZEE5 మొబైల్ అప్లికేషన్‌

ZEE5 ఇటీవల Android మరియు iOS వినియోగదారుల కోసం కొత్త అప్లికేషన్‌ను కూడా ప్రారంభించింది. అలాగే ఇది వెబ్ యాప్ ను కూడా ప్రవేశపెట్టింది. ZEE5 సంస్థ ఈ ఏడాది 80 నుంచి 100 ఒరిజినల్ షోలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ సంవత్సరం 15 మిలియన్ల రోజువారీ యూజర్ మార్క్ మరియు 100 మిలియన్ నెలవారీ యాక్టివ్ మార్క్‌ను దాటాలని యాప్ లక్ష్యంగా పెట్టుకుందని కాటియల్ వివరించారు. సంస్థ తన ప్రకటనదారులకు యాడ్ ఫ్రీ అనుభవాన్ని అందించడానికి తన అడ్టెక్‌ను కూడా బలోపేతం చేసింది. ఇది గూగుల్ మరియు ఫేస్బుక్ ఆఫర్లకు మించి మెరుగైన లక్ష్యాన్ని అనుమతిస్తుంది అని కాటియల్ తెలిపారు.

Best Mobiles in India

English summary
ZEE5 Hypershots App Coming Soon Against Tik Tok and Instagram

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X