Home
News

ZEE5 సబ్‌స్క్రిప్షన్‌ కొత్త వార్షిక ప్లాన్!!! డిస్నీ + హాట్‌స్టార్ VIP కంటే తక్కువ ధరకే..

ఇండియాలోని OTT కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన ZEE5 స్ట్రీమింగ్ వేదికలలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ + హాట్‌స్టార్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి OTT కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ ZEE5 తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను ఏర్పర్చుకున్నది.

Zee5 క్లబ్ సబ్‌స్క్రిప్షన్

Zee5 క్లబ్ సబ్‌స్క్రిప్షన్

ఈ OTT దిగ్గజం భారతీయ స్ట్రీమర్ల అవసరాలను తీర్చడంలో ఎక్కువ దృష్టి సారించినందున వారికి ‘హిందీ' ఆధారిత కంటెంట్‌ను అందిస్తోంది. ఇప్పుడు వినియోగదారుల కోసం కొత్తగా మరొక ప్లాన్‌ను ‘Zee 5 క్లబ్' ను ప్రారంభించింది. ఇది ఒక సంవత్సరం చెల్లుబాటుతో రూ.365 ధర వద్ద లభిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ZEE క్లబ్ సబ్స్క్రిప్షన్ పూర్తి వివరాలు

ZEE క్లబ్ సబ్స్క్రిప్షన్ పూర్తి వివరాలు

OTT కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన ZEE5 యొక్క కొత్త ప్రీమియం ప్లాన్ ZEE5 క్లబ్ సబ్స్క్రిప్షన్ తో వినియోగదారులు ZEE5 ప్రీమియంను ఒక సంవత్సరం పాటు యాక్సిస్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. ఈ చందా మొత్తంగా 12 భాషలలో కంటెంట్‌ను ఉచితంగా చూడడానికి అనుమతిని ఇస్తుంది. ఈ చందా యొక్క మరొక గొప్ప ప్రయోజనం ఏమిటంటే మీకు నచ్చిన ‘కుంకుమ్ భాగ్య' వంటి ప్రముఖ టెలివిజన్ షోలను టీవీలో ప్రసారం కాకముందే చూడవచ్చు.

 

ZEE5 ప్రీమియం Vs ZEE5 క్లబ్

ZEE5 ప్రీమియం Vs ZEE5 క్లబ్

ZEE5 ప్రీమియం సభ్యత్వంతో అందించే 4,500+ సినిమాలతో పోలిస్తే ZEE5 క్లబ్ సభ్యత్వంలో 1,000 కంటే ఎక్కువ సినిమాలు ఉన్నాయి. ఈ కొత్త ప్రీమియం ప్లాన్ ZEE5 సర్వీస్ యొక్క 90+ లైవ్ టీవీ ఛానెల్‌లను కూడా అదనముగా చూడడానికి వినియోగదారులకు అనుమతిని ఇస్తుంది.

ZEE5 క్లబ్ యాక్సిస్

ZEE5 క్లబ్ యాక్సిస్

ZEE5 ప్రీమియం సభ్యత్వంతో వినియోగదారులు ఒకే సారి 5 స్క్రీన్‌లలో కంటెంట్‌లను ప్లే చేయడానికి అనుమతి లభిస్తుంది. కానీ ZEE5 క్లబ్ సభ్యత్వంతో యూజర్లు కంటెంట్ ను ఒకేసారి గరిష్టంగా 2 స్క్రీన్‌లలో మాత్రమే ప్లే చేయవచ్చు. ఒకవేళ వినియోగదారులు ZEE5 క్లబ్ నుండి ZEE5 ప్రీమియం సభ్యత్వానికి అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఆ రెండు సభ్యత్వాల మధ్య గల వ్యత్యాసాన్ని చెల్లించి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

ZEE5 ఇతర సబ్స్క్రిప్షన్ ప్లాన్లు

ZEE5 ఇతర సబ్స్క్రిప్షన్ ప్లాన్లు

ZEE5 కంటెంట్‌లను ఆస్వాదించడానికి ఇప్పుడు ZEE5 కస్టమర్లు ఎంచుకోవడానికి ఐదు వేర్వేరు ప్లాన్లను కలిగి ఉన్నారు. ఈ 5 ప్లాన్‌లలో 4 ప్లాన్‌లు Zee5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో లభిస్తాయి. ఇందులో రూ.99 ప్లాన్ ఒక నెల చెల్లుబాటుతో, రూ.299 ధర గల ప్లాన్ 3 నెలల చెల్లుబాటుతో, రూ.599 ధర గల ప్లాన్ 6 నెలల చెల్లుబాటుతో మరియు రూ.999 ధర గల వార్షిక ప్లాన్ ఒక సంవత్సరం చెల్లబాటుతో లభిస్తుంది. చివరిది 365 రోజుల చెల్లుబాటుతో కొత్తగా విడుదలైన ZEE5 క్లబ్ ప్లాన్. ఇది రూ.365 ధర వద్ద లభిస్తుంది.

డిస్నీ + హాట్‌స్టార్ VIP సబ్స్క్రిప్షన్ Vs ZEE క్లబ్ సబ్స్క్రిప్షన్

డిస్నీ + హాట్‌స్టార్ VIP సబ్స్క్రిప్షన్ Vs ZEE క్లబ్ సబ్స్క్రిప్షన్

ZEE5 స్ట్రీమింగ్ యాప్ కొత్తగా విడుదల చేసిన ZEE5 క్లబ్ ప్లాన్‌ యొక్క ధర 365 రూపాయలు. డిస్నీ + హాట్‌స్టార్ VIP ప్లాన్‌తో పోలిస్తే దీని యొక్క ధర రూ.34 లకు తక్కువకు వస్తుంది. డిస్నీ + హాట్‌స్టార్ VIP ప్లాన్ యొక్క సంవత్సరం చందా 399 రూపాయలు. ZEE5 క్లబ్ మరియు డిస్నీ + హాట్‌స్టార్ VIP చందాలు రెండూ దాదాపు ఒకే ధర వద్ద వార్షిక చందాను అద్భుతమైన ప్రయోజనాలతో అందిస్తున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
ZEE5 Rs.365 Yearly Premium Subscription Plan Launched
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X