తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్నమొబైల్ కావాలని అనుకుంటున్నారా..

Posted By: Super

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్నమొబైల్  కావాలని అనుకుంటున్నారా..

హైదరాబాద్‌: సెల్‌ వినియోగదారుల కోసం సరికొత్త మొబైల్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం జెన్‌ మొబైల్‌ ఎక్స్‌ 414 పేరుతో సరికొత్త మొబైల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. పెద్ద స్క్రీన్‌, అధికమైన ఎంటర్‌టైన్‌మెంట్‌, పెద్ద బ్యాటరీ ఎక్స్‌414 జెన్‌ మొబైల్‌లో ఉన్నాయి. ఈ మొబైల్‌ రూ.1799కే మార్కెట్లో అందుబాటులో ఉందని జెన్‌ మొబైల్‌ ఎండి దీపేష్‌ గుప్తా తెలిపారు.

ముందెన్నడూ లేని విధంగా ఈ స్క్రీన్‌ సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుందని, జెన్‌ ఆర్‌ అండ్‌ డి, టెక్నాలజీ విభాగాలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఇందులో 1800ఎంఎహెచ్‌ బ్యాటరీ ఎక్కువ కాలం పని చేస్తుందన్నారు. ఇది మాత్రమే కాకుండా ఇందులో అన్ని మల్టీమీడియా ఫీచర్స్ ఉన్నాయని అన్నారు. యమ్‌పి3, యమ్‌పి4 ప్లేయర్స్ తోపాటు యఫ్ యమ్ రేడియో, పవర్ పుల్ ఎల్ఈడి టార్చి, యుఎస్‌బి2.0 కనక్టర్ ఇలా అత్యాధునికమైన ఫీచర్స్ ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా ఇందులో ఆకర్షించే విషయం ఏమిటంటే నలభై రోజులు పాటు(stand-by mode) నిర్విరామంగా బ్యాటరీ ఇస్తుందని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot