Home
News

'ఇదో ప్రత్యేక సందర్భం.. ఎక్కువ కాలం ఉండదు..' అరట్టై పరిస్థితిపై జోహో వ్యవస్థాపకుడు..!

మేడ్‌ ఇన్‌ ఇండియా యాప్‌ అరట్టై (Arattai App) ఇటీవల ఒక్కసారిగా ట్రెండింగ్‌ లో నిలిచిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రులు ఈ యాప్‌ గురించి ప్రమోట్‌ చేయడం సహా ఇతర కారణాలతో ఒక్కసారిగా టాప్‌ లో నిలిచింది. ఒక్కసారిగా యాక్టివ్‌ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం వాయిస్‌, వీడియో కాల్స్‌ కోసం మాత్రమే ఎండ్‌ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌ ఉండగా.. చాట్‌కు కూడా ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

కొన్ని రోజుల్లోనే :
అయితే ఇటీవల ఒక్కసారిగా టాప్‌ ర్యాంకింగ్‌ జాబితా నుంచి అరట్టై యాప్‌ తొలగించారు. గూగుల్‌ ప్లే స్టోర్‌, ఆపిల్‌ యాప్‌ స్టోర్‌ టాప్‌ 100 యాప్‌ల జాబితా నుంచి అరట్టై యాప్‌ కిందకు పడిపోయింది. సెప్టెంబర్‌ చివరి నాటికి సైన్‌ అప్‌లు సుమారు 100 రెట్లు పెరిగాయి. అయితే గత కొన్ని రోజులుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

Zoho founder responds on made in india app arattai droped from top rating

నవంబర్‌ 4 నాటికి గూగుల్‌ ప్లే స్టోర్‌లో 105 వ స్థానానికి పడిపోయింది. అదే ఆపిల్ యాప్‌ స్టోర్‌లో ఏకంగా 123 వ స్థానానికి పడిపోయింది. అయితే దీనిపై మిశ్రమ స్పందన వచ్చింది. ఈ పరిస్థితిపై జోహో కార్పొరేషన్‌ వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు స్పందించారు.

టైం వేస్ట్‌! :
ANI సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ పరిస్థితిపై స్పందించారు. టాప్‌ రేటింగ్‌ నుంచి కిందకు పడిపోవడంపై స్పందించారు. దీనిపై వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. దీనిపై విమర్శలు చేస్తూ ఇతరులు సమయం వృథా చేసుకుంటున్నారన్నారు.

హెచ్చు తగ్గులు ఉంటాయని.. :
అరట్టై యాప్‌ విషయంలో తప్పు ఏమీ జరగలేదని.. ఇదో సాధారణ అంశమని చెప్పారు. ఏదీ నేరుగా చంద్రుని వద్దకు వెళ్లదని, హెచ్చు తగ్గుల ద్వారానే వెళ్లాల్సి ఉంటుందన్నారు. యాప్‌ స్థిరత్వంపై తమ దూరదృష్టి ఉందని చెప్పారు. నంబర్ వన్ గా నిలవడం పెద్ద విషయమని తాను అనుకోవడం లేదని అన్నారు.

ఎక్కువ కాలం ఉండదు :
ప్రస్తుత పరిస్థితిని ఉద్యోగులకు వివరించినట్లు చెప్పారు. ఇదో ప్రత్యేకమైన సందర్భం.. అని ఎక్కువ కాలం ఉండదని ఉద్యోగులతో చెప్పినట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని ఎగతాళి చేస్తూ, కొందరు సమయం వృథా చేసుకుంటున్నారన్నారు. అయితే తాము సమయం వృథా చేయడం లేదని, ఇందుకు సంబంధించిన అంశాలపై దృష్టిపెడుతున్నట్లు చెప్పారు.

ఇదో దీర్ఘకాలిక ప్రాజెక్ట్‌ :
జోహో సంస్థ అర్టటై యాప్‌ను స్వల్పకాలిక ప్రాజెక్టుగా చూడడం లేదని, దీర్ఘకాలిక ప్రాజెక్టుగా చూస్తున్నట్లు శ్రీధర్‌ వెంబు తెలిపారు. జోహో గత 10 సంవత్సరాలుగా మెసేజింగ్‌ టెక్నాలజీపై పనిచేస్తోందని, అందువల్ల యాప్‌ స్టోర్‌లో ర్యాంకింగ్‌ తగ్గుదల తమపై ప్రభావం చూపదన్నారు.

దీంతోపాటు మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు నిజంగా బలమైన యాప్‌ ఉందని, క్రమంగా బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అరట్టై యాప్‌ను మరింత మెరుగుపరిచేందుకు వీలుగా అనేక అప్‌డేట్స్‌ను ప్లాన్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో ఎండ్ టు ఎండ్‌ ఫీచర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఉండే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Zoho founder responds on made in india app arattai droped from top rating
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X