Zomato Gold సభ్యులకు తీపి కబురు!!! ఏమిటో ఓ లుక్ వేయండి...
ఇండియాలో ఫుడ్-డెలివరీ ప్లాట్‌ఫామ్ లలో జోమాటో సంస్థ తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నది. ఇండియా అంతటా జోమాటో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది అలాగే ఎక్కువ మంది దీని నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం మొదలుపెట్టారు.

జోమాటో గోల్డ్ To జోమాటో ప్రో
జోమాటో సంస్థ మరింత ఎక్కువ మందిని ఆకట్టుకోవడానికి రకరకాల ఆఫర్లను కూడా మొదలు పెట్టింది. అందులో ఒకటి జోమాటో గోల్డ్ ఆఫర్. కానీ సంస్థ ఈ జోమాటో గోల్డ్‌ను జోమాటో ప్రోగా మార్పులు చేస్తున్నట్లు జోమాటో CEO దీపిందర్ గోయల్ తన ట్విట్టర్ అకౌంట్లో ప్రకటించారు. జోమాటో గోల్డ్ యొక్క ప్లాట్‌ఫాం నుండి మీరు కొనుగోలు చేసే రకరకాల ఆఫర్లలో 1 + 1 ఫ్రీ ఫుడ్ మరియు 2 + 1 ఫ్రీ డ్రింక్స్ వంటివి అధికంగా ఉంటాయి.

జోమాటో గోల్డ్ ఫీచర్స్
జోమాటో గోల్డ్ ఫీచర్ ను ఇండియాలో మొదట ప్రారంభించినప్పుడు జోమాటో గోల్డ్ సభ్యులు ఈ సంస్థతో భాగస్వామి అయిన రెస్టారెంట్ల నుండి అద్భుతమైన ఆఫర్లను పొందారు. కాలక్రమేణా జోమాటో సంస్థ జోమాటో గోల్డ్ ప్రోత్సాహకాలను ఫుడ్ డెలివరీలకు కూడా విస్తరించింది. ఇందులో భాగంగా వినియోగదారులు జోమాటో గోల్డ్ యొక్క భాగస్వామి రెస్టారెంట్ల నుండి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు అదనంగా కొన్ని ప్రోత్సాహకాలను కూడా ఉచితంగా పొందేవారు.

జోమాటో CEO గోయల్ ట్వీట్
జోమాటో CEO గోయల్ ఈ రోజు వరుసగా ట్వీట్లను పోస్ట్ చేశాడు. ట్వీట్ చేసిన సమాచారం ప్రకారం జోమాటో ప్రో అనేది జోమాటో గోల్డ్ కంటే పెద్దదిగా ఉంటుంది. ఇది జోమాటో గోల్డ్ కంటే అధిక ప్రోత్సాహకాలను అందిస్తుంది. జోమాటో పనిచేస్తున్న 10 దేశాలలోని గోల్డ్ సభ్యులందరూ ఆటోమ్యాటిక్ గా ఆగస్టు 1 నుండి జోమాటో ప్రోకు అప్‌గ్రేడ్ అవుతారని కూడా తెలిపారు.

జోమాటో ప్రో ఫీచర్స్
జోమాటో గోల్డ్‌తో పోలిస్తే జోమాటో ప్రోలో ఇప్పుడు ఉన్న దాని కంటే 50% ఎక్కువ రెస్టారెంట్లతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయని ఆయన అన్నారు. ప్రో సభ్యులు సాధారణ జోమాటో వినియోగదారులతో పోలిస్తే అందుబాటులో ఉన్న అన్ని ఇతర ఒప్పందాలతో పాటుగా ప్రత్యేకమైన డెలివరీ ఆఫర్లకు కూడా అర్హులు అవుతారు.

జోమాటో ప్రో డెలివరీ
జోమాటో ప్రో సభ్యులకు డెలివరీ ప్రాధాన్యత అదనంగా లభిస్తుంది. ప్రో సభ్యుడు ఏదైనా ఒక ఆర్డర్‌ను ఉంచినట్లయితే ప్లాట్‌ఫారమ్ ఆర్డర్‌లను అందించడానికి జోమాటో వాలెట్ కోసం వెతుకుతున్నప్పుడు రియల్ టైమ్ క్యూ వేగంగా లభిస్తుంది. ఇది ప్రో సభ్యులకు డిన్నర్ సమయాల్లో సాధారణ ఆర్డర్‌ల కంటే 15-20% వేగంగా డెలివరీ చేయడానికి ఉపయోగపడుతుంది అని గోయల్ చెప్పారు.

జోమాటో సబ్స్క్రిప్షన్ ధరల వివరాలు
జోమాటో గోల్డ్ సభ్యత్వం సంవత్సరానికి రూ.1,800 మరియు ఆరు నెలలకు రూ.9 999. ప్రస్తుతం జోమాటో యొక్క ఈ సబ్స్క్రిప్షన్ ను తగ్గింపు ధరకు అందిస్తున్నది. అది సంవత్సరానికి రూ.1,620 ధర వద్ద సభ్యత్వాన్ని అందిస్తున్నది. అలాగే జోమాటో ప్రో అనేది మనీ - బ్యాక్ హామీతో కూడా వస్తుంది. అది ఎలాగంటే మీరు సబ్స్క్రిప్షన్ వ్యవధిలో జోమాటో ప్రో యొక్క 2x సబ్స్క్రిప్షన్ రుసుమును సేవ్ చేయకపోతే మీ చందా యొక్క మొత్తం సంవత్సరం చివరిలో స్వయంచాలకంగా తిరిగి చెల్లించబడుతుంది.


Click it and Unblock the Notifications








