Home
News

ఏం ఐడియా బాస్... Zomato కొత్త ఫీచర్‌కు హ్యాట్సప్‌ చెప్పాల్సిందే.. అందరికీ లాభమే..!

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. లక్షలాది మందికి తక్కువ సమయంలో ఆహారం అందిస్తూ.. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న జొమాటో తాజాగా సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఆహారం వృథా కాకుండా చూడడమే ఈ కొత్త ఫీచర్‌ ముఖ్య ఉద్దేశమని సంస్థ వెల్లడించింది. అయితే దీంతోపాటు జొమాటో యూజర్‌లకు తక్కువ ధరకే ఆహారం లభిస్తుంది. అది కూడా కొన్ని నిమిషాల్లో బుక్‌ చేసుకుంటేనే.. ఆ అవకాశం దక్కుతుంది.

ప్రస్తుతం జొమాటోలో నెలకు సగటున 4 లక్షల ఫుడ్‌ ఆర్డర్‌ను క్యాన్సిల్‌ అవుతున్నాయి. దీంతో భారీ స్థాయిలో ఆహారం వృధా అయ్యే అవకాశం ఉంది. ఆహారం వృథాను అరికట్టేందుకు "ఫుడ్‌ రెస్క్యూ" పేరుతో సూపర్‌ ఫీచర్‌ను (Zomato launched Food Rescue Feature) తీసుకొచ్చింది. ఫుడ్‌ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేయడం వల్ల అనేక సందర్భాల్లో ఫుడ్‌ వేస్టేజ్‌ అవుతుందని సంస్థ తెలిపింది.

Zomato launched Food rescue feature

జొమాటో ఫుడ్‌ రెస్క్యూ ఫీచర్‌ (Zomato Food rescue) ఈ సమస్యకు చెక్‌ పెడుతుందని భావిస్తున్నట్లు జొమాటో సంస్థ సహ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ దీపిందర్‌ గోయల్‌ ప్రకటన చేశారు. X (ట్విట్టర్‌) ద్వారా ఈ ఫీచర్‌ గురించి వెల్లడించారు. ఈ ఫుడ్‌ రెస్క్యూ ఫీచర్‌ పనితీరును వివరించారు. ఈ ప్రకటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

జోమాటోలో ఆర్డర్‌ క్యాన్సిలేషన్‌ను తాము ప్రోత్సహించమని దీపిందర్‌ గోయల్‌ తెలిపారు. ఇది భారీ స్థాయిలో ఆహారం వృధా అయ్యేందుకు కారణమవుతుందని చెప్పారు. క్యాన్సిలేషన్‌ కోసం నో రిఫండ్‌ పాలసీ, కఠినమైన నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ ప్రతినెల వివిధ కారణాలతో 4 లక్షలకు పైగా ఆర్డర్‌లు క్యాన్సిల్ అవుతున్నాయని X ద్వారా గోయల్‌ వెల్లడించారు.

జొమాటో ఫుడ్‌ రెస్క్యూ ఫీచర్‌ ఎలా పనిచేస్తుంది ?
ఎవరైనా కస్టమర్‌ ఫుడ్‌ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేస్తే, ఆ ఆర్డర్‌ను తీసుకెళ్తున్న డెలివరీ పార్టనర్‌కు 3 కిలోమీటర్ల పరిధిలోని ఇతర కస్టమర్‌లకు నోటిఫికేషన్‌ కనిపిస్తుంది. తక్కువ ధరకు ఆహారం అందుబాటులో ఉందనే విషయాన్ని వారి యాప్‌లో అలెర్ట్‌ రూపంలో కనిపిస్తుంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు ఈ ఆర్డర్‌ బుకింగ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.

ఈ ఆప్షన్‌ కొన్ని నిమిషాలపాటు మాత్రమే ఉంటుందని గోయల్‌ తెలిపారు. దీంతోపాటు ఈ ఆర్డర్‌ను తక్కువ సమయంలోనే కొత్త కస్టమర్‌కు డెలివరీ చేయనున్నారు. ఈ ఆర్డర్‌ పైన వచ్చిన మొత్తాన్ని పాత కస్టమర్‌ సహా రెస్టారెంట్ పార్టనర్‌కు చెల్లిస్తామని గోయల్‌ తెలిపారు. ఇందులో జొమాటో ఎటువంటి ఛార్జీలు వసూలు చేయదని చెప్పారు.

ఐస్‌ క్రీం, షేక్స్‌, స్మూతీలకు సహా మరికొన్నింటికి ఈ ఆఫర్‌ వర్తించదన్నారు. అదే విధంగా డెలివరీ పార్టనర్‌కు ఆర్డర్‌ పికప్‌ నుంచి చివరి డెలివరీ వరకు మొత్తం దూరానికి నగదు అందిస్తామని చెప్పారు. ఈ ఫుడ్‌ రెస్క్యూ ఫీచర్‌ ఆహారం వృథా కాకుండా చూస్తుందని గోయల్‌ చెప్పారు. ఈ ఫీచర్‌పై సోషల్‌ మీడియా వేదికగా సూచనలు చేసిన వ్యక్తితో కలిసి పనిచేసేందుకు గోయల్ ఆసక్తి వ్యక్తం చేశారు.

ఫుడ్‌ రెస్క్యూ ఫీచర్‌ను క్యాష్‌ ఆన్ డెలివరీకి అనుమతించకూడదని X యూజర్‌ సూచించారు. క్యాన్సిలేషన్‌ కోసం నెలవారీ పరిమితులు విధించాలన్నారు. డెలివరీ అడ్రస్‌కు 500 మీటర్‌ల దూరంలో ఆర్డర్ ఉంటే.. క్యాన్సిలేషన్‌కు అనుమతించకూడదు అంటూ సూచించారు. దీనిపై స్పందించిన జొమాటో సహ వ్యవస్థాపకుడు గోయల్‌ ఆ వ్యక్తి వివరాలు తెలుసుకున్నారు. కలిసి పనిచేద్దామంటూ సూపర్ ఆఫర్‌ ఇచ్చారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Zomato launched Food rescue feature to reduce food wastage how this works
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X