ప్రధాని ఎవరో చెప్పండి,అదిరిపోయే ఆఫర్లను సొంతం చేసుకోండి

|

ఎన్నికలు అయిపోయాయి. ఇక మిగిలింది రిజల్ట్స్. మే 23వ తేదీన డిల్లీ గద్దెనెక్కేదెవరన్న విషయం తేలిపోయతుంది.అయితే దానికి ముందు చాలామంది ఎవరికి వారు పీఎం లెక్కలేసుకుంటున్నారు. దేశంలో హాట్ టాఫిక్ గా మారిన దేశ ప్రధాని అంశాన్ని అందరూ క్యాష్ చేసుకుంటున్నారు.

ప్రధాని ఎవరో చెప్పండి,అదిరిపోయే ఆఫర్లను సొంతం చేసుకోండి

 

ఇందులో పుడ్ డెలివరీ సంస్థ జొమాటో కూడా చేరింది. తర్వాతి పీఎం ఎవరు అనే థీమ్‌తో ఈ కంపెనీ పెట్టిన గేమ్‌లో తర్వాత దేశ ప్రధాని ఎవరో చెబితే.. 30 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తామంటోంది జొమాటో. అదెలాగో చూద్దాం.

 ZEL

ZEL

ఫన్ గేమ్ జెఈఎల్(ZEL) పేరుతో జొమాటో ఎలక్షన్ లీగ్ అని దీనికి నామకరణం చేశారు. ఇందులో మన దేశ తర్వాతి ప్రధాని ఎవరో కరెక్ట్‌గా ఊహించిన వారికి 30 శాతం క్యాష్ బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. అంటే మీ అంచనా నిజమైతే.. ఆ తర్వాత మీరు ఆర్డర్ చేసే ఫుడ్‌లో 30 శాతాన్ని క్యాష్ బ్యాక్ రూపంలో మీరు పొందొచ్చు. ఈ నెల 22వ తేదీలోపు మీరు ఆర్డర్ చేసిన ఫుడ్‌తో పాటు ఈ గేమ్ ఆడొచ్చు. గెలిస్తే.. 23వ తేదీ తర్వాత ఎప్పుడైనా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వాడుకోవచ్చు. ఇది ఇప్పటికే కొన్ని రెస్టారెంట్లలో ఇస్తున్న 40 శాతం డిస్కౌంట్‌కు అదనంగా ఇస్తామని జొమాటో ప్రకటించింది.

  జెపిఎల్ సక్సెస్

జెపిఎల్ సక్సెస్

ప్రెడిక్షన్‌తో కస్టమర్లకు ఆఫర్లు ఇవ్వడం ఇదే కొత్త కాదు. ఐపీఎల్ సీజన్‌లో ఇలాంటి ఆఫర్ అందించింది. ఈ మధ్యకాలంలో ఐపీఎల్ జరిగినప్పుడు ప్రతీ రోజూ ఈ ప్రెడిక్షన్ గేమ్‌ను నిర్వహించింది జొమాటో. అప్పుడు తమ కస్టమర్ల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చిందని కంపెనీ చెబ్తోంది. మొత్తం 224 నగరాల నుంచి 1.4 కోట్ల మంది ఈ ఆటలో పాల్గొన్నారు. డిస్కౌంట్ల రూపంలో సుమారు రూ.15 కోట్ల వరకూ ప్రయోజనం పొందారని బిజినెస్ ఇన్‌సైడర్ అనే సంస్థ వెల్లడించింది.

జొమాటో
 

జొమాటో

ఇప్పుడు కూడా అలాంటి తరహా స్పందనే వస్తుందని జొమాటో కాన్ఫిడెంట్‌గా ఉంది. దీని వల్ల తమ బిజినెస్ పెరగడంతోపాటు కస్టమర్లకు కూడా మంచి క్యాష్ బ్యాక్స్ వస్తాయని చెబ్తోంది. ఈ యాప్‌లో నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీతో పాటు మరొకరు అని ఆప్షన్ ఉన్నాయి. ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఈ గేమ్‌లో పాల్గొని ఈ ముగ్గురిలో ఎవరు ప్రధాని అవుతారో ఊహించాలి. మీ సమాధానం కరెక్ట్ అయితే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దాన్ని తర్వాతి ఆర్డర్లకు వినియోగించుకోవచ్చు.

పలు రెస్టారెంట్లపై 40 శాతం డిస్కౌంట్

పలు రెస్టారెంట్లపై 40 శాతం డిస్కౌంట్

జొమాటో ఇప్పటికే పలు రెస్టారెంట్లపై 40 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌కు అదనంగా కాబోయే ప్రధాని క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. కస్టమర్లు ఆర్డర్ ఇచ్చిన తర్వాత యాప్‌లోనే ప్రధాని ఎవరో ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది. మోదీ, రాహుల్ గాంధీ, ఇతరులు అనే మూడు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ విలువ

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ విలువ

ఇప్పుడు దేశీయ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ ఒకటిన్నర బిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.10500 కోట్ల వరకూ ఉంటుంది. ఇది రాబోయే రెండేళ్లలో 2.5 -3.5 బిలియన్ డాలర్లకు చేరే ఆస్కారం ఉంది అని రెడ్‌సీర్ అనే కన్సల్టింగ్ కంపెనీ అంచనా వేస్తోంది. ఈ లెక్కన ఇండియాలో ఈ ఆన్ లైన్ ఫుడ్ మార్కెట్ రూ.15 వేల నుంచి 25 వేల కోట్లకు విస్తరించేట్టు కనిపిస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
zomato offers discounts if you correctly predict next pm

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X