Home
News

హ్యాకర్లకు రూ. 70 లక్షలు చెల్లించిన జొమాటో

By Gizbot Bureau

ప్రముఖ పెడ్ డెలివరీ యాప్ జొమాటో పెద్ద సాహసమే చేసింది. ఇప్పటివరకు దాదాపు రూ. 75 లక్షల రూపాయలను హ్యాకర్లకు చెల్లించింది . జొమాటోలో బగ్స్ ఫిక్స్ చేసినందుకు కంపెనీ దాదాపు 435 మంది హ్యాకర్లు లక్ష డాలర్లను ఇప్పటివరకు చెల్లించినట్లుగా కంపెనీ తెలిపింది. గత మూడు నెలల్లో దాదాపు రూ. 8.7 లక్షలను బౌంట్రీ కింద బగ్ బౌంట్రీ ఫ్లాట్ ఫాం ద్వారా చెల్లించినట్లుగా హ్యాకర్స్ వన్ తెలిపింది.HackerOne's bug bounty programme జూలై 2017లో ప్రారంభం అయింది. దీని ద్వారా జొమాటో దాదాపు 775 రకాల సమస్యలను విజయవంతంగా పరిష్కరించుకుందని హ్యాకర్స్ వన్ ఇయాన్స్ కు రిపోర్ట్ చేసింది. కాగా జొమాటో సెక్యూరిటీ టీం దాదాపు 55 మిల్లియన్ల మంది యూజర్లు సమాచారాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారని ఈ సంధర్భంగా తెలిపింది. జొమాటోలో నెలకు 55 మిల్లియన్ల మంది యాక్టివ్ గా ఉంటున్నారకని కూడా తెలిపింది.

జొమాటో చెల్లింపులు

జొమాటో చెల్లింపులు

సెక్యూరిటీ రీసెర్చర్లకు 2000 డాలర్లను, బగ్స్ ద్వారా ఎక్కువ మొత్తంలో ఇంపాక్ట్ అయితే దాన్ని పరిష్కరించిన వారికి 700 డాలర్లను, మీడియంలో బగ్స్ ఫిక్స్ చేస్తే 300 డాలర్లను, అంతకన్నా తక్కువ సమస్య అయితే 150 డాలర్లను జొమాటో చెల్లిస్తూ వస్తోంది.

17 మిల్లియన్ల మంది

17 మిల్లియన్ల మంది

మే2017లో హ్యకర్లు జొమాటో మీద విరుచుకుపడ్డారు. దాదాపు 17 మిల్లియన్ల మంది పాస్ వర్డ్ లను ఈమెయిల్ అడ్రస్ లను కొల్లగొట్టారు. జొమాట్ ఒక్కసారిగా అలర్ట్ అయి బౌంట్రీ పోగ్రాంను ప్రారంభించింది. జొమాటో యూజర్ల క్రెడిట్ కార్డుల డేటా లీకయిందని వెంటనే పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవాలని యూజర్లను కోరింది. వెబ్ సైట్ లో వెంటనే యూజర్లు లాగౌట్ కావాలని తెలిపింది.

24 దేశాల్లో జోమాటో 

24 దేశాల్లో జోమాటో 

జొమాటో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లో సేవలందిస్తోంది. US, Australia, the UK, Canada, Turkey, UAE, Qatar, Portugal, South Africa, New Zealand,India, ఇంకా ఇతర దేశాల్లో తన సేవలను అందిస్తోంది. 

మూడు రెట్లు వృద్ధి

మూడు రెట్లు వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తోలి ఆరు నెలల కాలానికి (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) తన ఆదాయంలో ఏకంగా మూడు రెట్లు వృద్ధి రేటును నమోదు చేసింది. ఏప్రిల్-సెప్టెంబర్ 2019 అర్ధ సంవత్సర కాలంలో కంపెనీ రూ 1,458 కోట్ల( 205 మిలియన్ డాలర్ల) ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది సరిగ్గా ఇదే సమయంలో జొమాటో ఆదాయం కేవలం రూ 448 కోట్లు మాత్రమే. ఈలెక్కల్ని జొమాటో వ్యవస్థాపక సీఈఓ దీపిందర్ గోయెల్ తన బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. 

జొమాటో గోల్డ్‌ పథకానికి మంచి ఆదరణ

జొమాటో గోల్డ్‌ పథకానికి మంచి ఆదరణ

అలాగే కంపెనీ నెలవారీ బర్నింగ్ రేటు (నష్టాలు) కూడా 60శాతం మేరకు తగ్గినట్లు గోయెల్ తెలిపారు. ఖర్చులను తగ్గించుకోవడంతో అద్భుతమైన ఫలితాలను సాధించామని పేర్కొన్నారు. ప్రధానంగా నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) లాగ్అవుట్ ప్రచారం ఉన్నప్పటికీ డైన్-అవుట్ రెస్టారెంట్లు తమ జొమాటో గోల్డ్‌ పథకానికి మంచి ఆదరణ లభించిందని వెల్లడించారు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో జరిగిన నష్టాల గురించి కంపెనీ ఎటువంటి వివరాలు ఇవ్వలేదు.

Best Mobiles in India

English summary
Zomato paid ₹70 lakh to hackers for fixing bugs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X