జొమాటోలో "డెలివరీ ఉమెన్స్" 10% పెరగనున్నారు!! యాప్ లో # గర్ల్‌పవర్ ట్యాగ్
టెక్నాలజీ పెరిగే కొద్దీ దానిని వినియోగించే వారి శాతం కూడా రోజు రోజుకి పెరుగుతున్నది. ఆన్ లైన్ ఆర్డర్లు కూడా ఎక్కువ అయ్యాయి. ఈ ఆన్ లైన్ ఆర్డర్లలో ఫుడ్ డెలివరీ కూడా ఉన్నాయి. ప్రతి రోజు స్విగీ మరియు జొమాటో సంస్థలలో డెలివరీలు అధికంగా ఉన్నాయి. ఇప్పటి వరకు "డెలివరీ బాయ్స్" మాత్రమే చూసాము. కానీ జోమాటో సంస్థ ఇప్పుడు "మహిళల డెలివరీ" లను ప్రోత్సహించడానికి దాదాపు 10 శాతం పెంచాలని యోచిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఘనతను సాధించాలని ఫుడ్ డెలివరీ దిగ్గజం భావిస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల ప్రకారం డెలివరీ భాగస్వాములలో 0.5 శాతం మాత్రమే మహిళలు ఉన్నారని జోమాటో తెలిపింది. బెంగుళూరు, హైదరాబాద్, పూణే వంటి ఇతర నగరాల్లో 2021 చివరి నాటికి డెలివరీలలో మహిళలు పాల్గొనే లక్ష్యాన్ని 10 శాతం పెంచాలని చూస్తున్నట్లు కంపెనీ యోచిస్తోంది.

ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం మహిళా డెలివరీ భాగస్వామ్యాన్ని పెంచే దిశగా మొదటి అడుగు వేస్తున్నట్లు ప్రకటించింది. బెంగుళూరు, హైదరాబాద్ మరియు పూణేలలో ఈ విధానాన్ని ప్రారంభించి 2021 చివరి నాటికి 10% వరకు పాల్గొనే వారి సంఖ్యను పెంచే విధంగా లక్ష్యంగా పెట్టుకున్నాట్లు సంస్థ తెలిపింది. మా డెలివరీ విభాగంలో ఎక్కువ మంది మహిళలను చేర్చడం కోసం మరియు ఉద్యోగం కోసం ఎక్కువ మంది మహిళలను లక్ష్యంగా చేసుకోవడం అంత సులభం కాదు. ఎక్కువ మంది మహిళా డెలివరీ భాగస్వాములను ఆకర్షించడానికి మరియు వారిని నిలుపుకోవటానికి మా విధానాలు కూడా మారవలసిన అవసరం ఎంతగానో ఉంది అని జోమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ బ్లాగులో తెలిపారు.

మహిళల డెలివరీ భాగస్వాముల భద్రత కోసం జోమాటో కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఆహార ప్యాకేజీల పంపిణీ కోసం సంస్థ చేత నియమించబడే మహిళలకు ఆత్మరక్షణ కోసం శిక్షణను అందిస్తారు. ఇందులో మహిళా డెలివరీ భాగస్వాములు హాజరు కావడం తప్పనిసరి అవుతుంది. సంస్థ తన ఆన్‌బోర్డింగ్ ప్రక్రియకు శిక్షణను ఇస్తుంది. మహిళా భాగస్వాములందరికీ చక్కని పరిశుభ్రత మరియు భద్రతా వస్తు సామగ్రిని అందిస్తుంది.

మహిళల డెలివరీ భాగస్వాముల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి జోమాటో డిఫాల్ట్‌గా సాయంత్రం డెలివరీలను కాంటాక్ట్‌లెస్‌గా చేస్తుంది. అత్యవసర విధానాల కోసం 24 × 7 హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. డెలివరీ భాగస్వామికి యాప్ లో SOS బటన్ లభిస్తుంది. ఇది నొక్కబడితే కనుక ఆన్-గ్రౌండ్ టీమ్స్, సెంట్రల్ రైడర్ సపోర్ట్ మరియు సమీపంలోని ఇతర డెలివరీ భాగస్వాములు కూడా మీ యొక్క లైవ్ లొకేషన్ ను పంచుకుంటారు.

జోమాటో యొక్క రెస్టారెంట్ భాగస్వాములు కూడా సంస్థ యొక్క కొత్త చొరవకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అనేక రెస్టారెంట్లు మహిళా భాగస్వాములకు ప్రత్యేక వాష్‌రూమ్‌ల వంటి ప్రాథమిక సౌకర్యాలను అందిస్తాయి. సమానమైన సమాజం పట్ల తమ మద్దతును ప్రదర్శించడానికి జోమాటో ఈ రెస్టారెంట్లను యాప్ లో # గర్ల్‌పవర్ ట్యాగ్‌తో హైలైట్ చేస్తుంది. దీనికి తోడు మహిళా డెలివరీ భాగస్వాములకు రెస్టారెంట్ల "సౌలభ్యం మరియు భద్రత" పై రేట్ చేసే అధికారం కూడా ఉంటుంది. మా డెలివరీ భాగస్వాములందరికీ పని పరిస్థితులను మెరుగుపరచడానికి ఈ రేటింగ్‌లు ఉపయోగించబడతాయి.


Click it and Unblock the Notifications