Home
News

కష్టాల్లోరెస్టారెంట్లు, కొంపలు ముంచుతున్న జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్

By Gizbot Bureau

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్ వల్ల రెస్టారెంట్లకు కష్టాలు మొదలయ్యాయి.ఈ ఆఫర్ ద్వారా తమకు ఎంతో నష్టం వస్తుందని రెస్టారెంట్ల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అనేక రెస్టారెంట్లు ఇప్పటికే జొమాటో నుంచి తప్పుకున్నాయి. దీంతో దిగొచ్చిన జొమాటో మాత్రం ప్లీజ్ వెళ్లొద్దని, తమ గోల్డ్ లిస్ట్‌లోనే ఉండాలని రెస్టారెంట్లను బతిమాలుకుంటోంది.

Zomato revises Gold scheme, but eateries to stay logged out

జొమాటోలో ఉన్న గోల్డ్ మెంబర్‌షిప్‌ను పొందిన వారు రెస్టారెంట్లలో ఉచితంగా డ్రింక్స్, మెయిన్ కోర్స్ డిషెస్, డిజర్ట్స్‌ను పొందవచ్చనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విధానం వల్ల రెస్టారెంట్లు నష్టపోతున్నాయి.

 #Logout పేరిట సోషల్ మీడియా క్యాంపెయిన్

#Logout పేరిట సోషల్ మీడియా క్యాంపెయిన్

చాలా మంది ఒక రెస్టారెంట్‌లో 1+1 పద్ధతిలో డ్రింక్స్ తాగి, మరొక రెస్టారెంట్‌లో అదే పద్ధతిలో మెయిన్‌కోర్స్ ఆరగిస్తున్నారు. ఇక భోజనం అయ్యాక ఇంకో రెస్టారెంట్‌లో తిరిగి అదేవిధంగా 1+1 పద్ధతిలో డిజర్ట్‌లను ఆరగిస్తున్నారు. దీంతో తమకు భారీగా నష్టం వస్తున్నదని రెస్టారెంట్ యాజమాన్యాలు వాపోతున్నాయి. అందులో భాగంగానే నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా #Logout పేరిట ఓ సోషల్ మీడియా క్యాంపెయిన్ నడుస్తోంది.

2వేల రెస్టారెంట్లు అవుట్

2వేల రెస్టారెంట్లు అవుట్

దీంతో ఎన్‌ఆర్‌ఏఐలో సభ్యులుగా ఉన్న అనేక రెస్టారెంట్‌లు ఇప్పటికే జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్ డైనర్స్ లిస్ట్ నుంచి తప్పుకున్నాయి. దేశవ్యాప్తంగా ఈ జాబితాలో మొత్తం 6500కు పైగా రెస్టారెంట్లు ఉండగా, వాటిలో 2వేల రెస్టారెంట్లు జొమాటో లిస్ట్ నుంచి తప్పుకున్నాయి. దీంతో జొమాటో ఒక్కసారిగా అలర్ట్ అయింది. దేశ వ్యాప్తంగా ఉన్న అనేక రెస్టారెంట్లు జొమాటో గోల్డ్ నుంచి తప్పుకోవడంతో ఆ కంపెనీ గోల్డ్ మెంబర్‌షిప్‌కు పలు మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇద్దరు జొమాటో గోల్డ్ యూజర్లకు మాత్రమే

ఇద్దరు జొమాటో గోల్డ్ యూజర్లకు మాత్రమే

కొత్త మెంబర్‌షిప్ రూల్స్ ప్రకారం.. ఇకపై ఈ సభ్యత్వం ఉన్న యూజర్లు రోజుకు ఒక్కసారే కాంప్లిమెంటరీ ఆఫర్‌ను ఏదైనా ఒక్క రెస్టారెంట్‌లోనే వాడుకోవాల్సి ఉంటుంది. ఇతర రెస్టారెంట్లకు వెళ్లినా ఆ ఆఫర్‌ను వాడుకోలేరు. అలాగే ఒక రెస్టారెంట్‌లో రోజుకు ఒక టేబుల్‌కు గాను కేవలం రెండు సార్లు మాత్రం జొమాటో గోల్డ్ బెనిఫిట్స్ అన్‌లాక్ అవుతాయి. ఏదైనా రెస్టారెంట్‌లో ఒక రోజులో ఒక టేబుల్‌కు కేవలం ఇద్దరు జొమాటో గోల్డ్ యూజర్లకు మాత్రమే కాంప్లిమెంటరీ బెనిఫిట్స్ అన్‌లాక్ అవుతాయి.

జొమాటో నియంత్రణ

జొమాటో నియంత్రణ

అలాగే జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్ వాడకంపై కూడా జొమాటో నియంత్రణ విధించనుంది. దీని వల్ల జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్ ఉన్నవారు దాన్ని ఇతరులతో షేర్ చేసుకునేందుకు వీలుండదు. ఒక మెంబర్‌షిప్‌ను ఒక ఫోన్‌లో మాత్రమే వాడుకునేలా కొత్త నిబంధనను తెచ్చారు. దీని వల్ల ఆ మెంబర్‌షిప్ ఉన్న యూజర్లు తమ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇతరులకు షేర్ చేయడం ఇకపై కుదదరు. కేవలం తమ ఫోన్‌లోనే ఆ మెంబర్‌షిప్‌ను వాడుకోవాల్సి ఉంటుంది. వేరే ఫోన్‌లో ఆ సభ్యత్వం అందుబాటులో ఉండదు.

సెప్టెంబర్ 15 నుంచి అమలు

సెప్టెంబర్ 15 నుంచి అమలు

కొత్త నిబంధనలను సెప్టెంబర్ 15 నుంచి అమలు చేస్తామని, కనుక ఆ లోపు తమ గోల్డ్ మెంబర్‌షిప్ జాబితా నుంచి వైదొలగిన రెస్టారెంట్లు ఎలాంటి అదనపు ఫీజు లేకుండా ఉచితంగా మళ్లీ జాబితాలో చేరవచ్చని జొమాటో ఆ రెస్టారెంట్లకు తెలిపింది. అయితే జొమాటో త్వరలో అమలు చేస్తామని ప్రతిపాదించిన కొత్త నియమాలు కూడా తాము ఆశించిన విధంగా లేవని ఎన్‌ఆర్‌ఏఐ పేర్కొంది.

Best Mobiles in India

English summary
Zomato revises Gold scheme, but eateries to stay logged out
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X