సరసమైన ధరలో సూపర్ గ్రాఫిక్స్ కార్డులు
ఎన్విడియా తన జిఫోర్స్ ఆర్టిఎక్స్ సూపర్ సిరీస్ జిపియులను మరియు వాటి ఆధారంగా దాని స్వంత గ్రాఫిక్స్ కార్డులను కొత్తగా ప్రారంభించినప్పటికి కంపెనీ షేర్ బ్రాండ్లు కొన్ని సందర్భాల్లో కస్టమ్ కూలర్లు మరియు ఫ్యాక్టరీ ఓవర్‌క్లాకింగ్‌తో తమ సొంత వెర్షన్లను ప్రకటించడం ప్రారంభించాయి. జిఫోర్స్ ఆర్టిఎక్స్ 2060 సూపర్ మరియు జిఫోర్స్ ఆర్టిఎక్స్ 2070 సూపర్ వంటి కొత్త గ్రాఫిక్స్ కార్డులు ఆన్‌లైన్‌లో కనిపించడం ప్రారంభించాయి.

కంపెనీ తమ ఉత్పత్తులను జూలై 9 నుండి అమ్మకానికి ఉంచాయి. జోటాక్, ఆసుస్ మరియు గిగాబైట్ ఒక్కొక్కటి చాలా రకాల మోడళ్లను ప్రకటించాయి. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇన్నో 3 డి, గెలాక్స్, ఎంఎస్ఐ మరియు మరిన్ని చూడవచ్చు.

జోటాక్ జిఫోర్స్ ఆర్టిఎక్స్ 2060 సూపర్ మినీ:
జోటాక్ కంపెనీ రెండు GPUల ఆధారంగా మూడు కొత్త మోడళ్లను ప్రకటించింది. ఎంట్రీ లెవల్ జోటాక్ జిఫోర్స్ ఆర్టిఎక్స్ 2060 సూపర్ మినీ కాంపాక్ట్ గా రూపొందించబడింది.ఇది దాదాపు అన్ని సాధారణ PC క్యాబినెట్లకు సరిపోతుంది. ఫీచర్స్ విషయంలో ఇది రెండు ఫ్యాన్లు, ఒక మెటల్ బ్యాక్ ప్లేట్ మరియు ఎల్లప్పుడూ ఆన్లో ఉండే ఎల్ఈడి అక్సిన్ట్ను కలిగి ఉంటుంది. దీని ధర 35,590రూపాయలు.

జోటాక్ జిఫోర్స్ RTX 2060 సూపర్ Amp :
తరువాత జోటాక్ జిఫోర్స్ RTX 2060 సూపర్ Amp మరియు జోటాక్ జిఫోర్స్ RTX 2060 సూపర్ Amp ఎక్స్‌ట్రీమ్ వరుసగా రెండు మరియు మూడు ఫ్యాన్లను కలిగి ఉంటాయి. అంతేకాకుండా అనుకూలీకరించదగిన RGB LED లు.1680MHz మరియు 1710MHz వేగంతో 1650MHz స్టాక్‌తో పోలి రెండూ ఫ్యాక్టరీ ఓవర్‌లాక్ చేయబడి ఉంటాయి. వీటి ధర వరుసగా రూ.37,990 మరియు రూ.39,190.

జోటాక్ జిఫోర్స్ గ్రాఫిక్ కార్డ్స్:
జోటాక్ జిఫోర్స్ RTX 2070 సూపర్ ట్విన్ ఫ్యాన్, జోటాక్ జిఫోర్స్ RTX 2070 సూపర్ ఆంప్, మరియు జోటాక్ జిఫోర్స్ RTX 2070 సూపర్ ఆంప్ ఎక్స్‌ట్రీమ్ ఇదే పద్ధతిని అనుసరిస్తాయి. వీటి ధర వరుసగా రూ.43,790, రూ.45,890, మరియు రూ.47,290లు. మొదటి రెండు డ్యూయల్-ఫ్యాన్ కూలర్లను కలిగి ఉండగా, చివరిది మూడు ఫ్యాన్లను కలిగి ఉంటుంది. మరియు మూడింటినీ RGB LED అక్సిన్ట్ను లతో రూపొందించారు. బూస్ట్ వేగం వరుసగా 1770MHz, 1800MHz మరియు 1830MHz.

జోటాక్ మోడల్స్:
జోటాక్ జిఫోర్స్ RTX 2080 సూపర్ ట్విన్ ఫ్యాన్, జోటాక్ జిఫోర్స్ RTX 2080 సూపర్ ఆంప్, మరియు జోటాక్ జిఫోర్స్ RTX 2080 సూపర్ ఆంప్ ఎక్స్‌ట్రీమ్‌లు ఇండియాలో జూలై 23 నుండి లభిస్తాయని కంపెనీ ప్రకటించింది.మొదటిది మూడు ఫ్యాన్లను కలిగి ఉండగా మిగతా రెండు మోడళ్లలో డ్యూయల్ ఫ్యాన్ కూలర్లు ఉన్నాయి. ఈ మోడళ్ల ధరలు ఇంకా విడుదల కాలేదు.

ఆసుస్ గ్రాఫిక్ కార్డ్స్:
ఏడు జిఫోర్స్ RTX 2060 సూపర్ మోడల్స్, ఏడు జిఫోర్స్ RTX 2070 సూపర్ మోడల్స్ మరియు ఐదు జిఫోర్స్ RTX 2080 సూపర్ మోడల్స్ విస్తరించి ఉన్న భారీ లైనప్‌ను ఆసుస్ ఆవిష్కరించింది. ఈ గ్రాఫిక్స్ కార్డులు అన్నీ ఆసుస్ యొక్క ROG స్ట్రిక్స్, డ్యూయల్ Evo మరియు టర్బో Evo ఉత్పత్తి శ్రేణుల పరిధిలోకి వస్తాయి. టర్బో Evo మోడళ్లలో బ్లోవర్-స్టైల్ కూలర్లు ఉన్నాయి. డ్యూయల్ ఎవో మోడల్స్ స్టాండర్డ్ డ్యూయల్-ఫ్యాన్ కూలర్లతో అమర్చబడి ఉన్నాయి. ROG స్ట్రిక్స్ వెర్షన్లు ఆసుస్ యొక్క టాప్-ఎండ్ ప్రీమియం కన్స్యూమర్ సమర్పణలు మరియు సంస్థ యొక్క ఆక్సిల్ ఫ్యాన్ డిజైన్ మరియు అదనపు శక్తి మరియు శీతలీకరణను కలిగి ఉంటాయి.

ఆసుస్ మోడల్స్ ధరలు:
ఆసుస్ ఇప్పటివరకు ప్రతి GPU కి ROG స్ట్రిక్స్ సమర్పణ ధరలను మాత్రమే ప్రకటించింది. ఆసుస్ ROG స్ట్రిక్స్ RTX 2060S 8G గేమింగ్ ధర 36,500రూపాయలు మరియు టాక్స్ కూడా, ఆసుస్ ROG స్ట్రిక్స్ RTX 2070S 8G గేమింగ్ ధర 48,500రూపాయలు.

గిగాబైట్ గ్రాఫిక్స్ కార్డులు:
గేమింగ్, అరస్, మరియు విండ్‌ఫోర్స్ సిరీస్‌లలో గిగాబైట్ తన సొంత గ్రాఫిక్స్ కార్డులను ప్రకటించింది. అరోస్ జిఫోర్స్ RTX 2080 సూపర్ 8G, అరస్ జిఫోర్స్ RTX 2070 సూపర్ 8G మరియు అరస్ జిఫోర్స్ RTX 2060 సూపర్ 8G అన్నీ RGB LED రింగులతో ట్రిపుల్-ఫ్యాన్ కూలర్లను కలిగి ఉన్నాయి మరియు ఫ్యాక్టరీ ఓవర్లాక్ చేయబడ్డాయి. మూడు హెచ్‌డిఎమ్‌ఐ పోర్ట్‌లు, మూడు డిస్ప్లేపోర్ట్‌లు మరియు ఒక వర్చువల్ లింక్ టైప్-సి పోర్ట్ అన్ని కలిపి ఒక్కొక్క దానికి ఏడు డిస్ప్లే అవుట్‌పుట్‌లను కలిగి ఉంటాయి. దీని యొక్క ఇతర మోడల్స్ మరియు ధరల వివరాలు ఇంకా వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








