Home
News

Ai ఫీచర్ల తో Nubia కొత్త ఫోన్లు! లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు   

ZTE కార్పొరేషన్ తన తదుపరి తరం స్మార్ట్‌ఫోన్‌లు AI సామర్థ్యాల తో వస్తాయని ఆ విధంగా సంస్థ దృష్టి పెడుతుందని టీజ్ చేసింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ముందడుగు అని కంపెనీ విశ్వసిస్తోంది మరియు ఇప్పుడు, ఈ కొత్త AI టెక్నాలజీ తో నుబియా ఫోన్‌ల ను లాంచ్ చేయనున్నట్లు అధికారిక తేదీని ప్రకటన ద్వారా విడుదల చేసింది.

Nubia AI స్మార్ట్‌ఫోన్‌లు ఏప్రిల్ 9 న లాంచ్ చేయబడతాయి
ఈ చైనీస్ టెక్ దిగ్గజం ఏప్రిల్ 1, 2024 న ఈ కొత్త ప్రకటన విడుదల చేసింది. ప్రకటన లోని సమాచారం ప్రకారం ఏప్రిల్ 9న "కొత్త యుగానికి తెరతీస్తుంది" అని వెల్లడించింది. ఈ లాంచ్ ఈవెంట్ సందర్భంగా, బ్రాండ్ రాబోయే నుబియాతో సహా AI ఆధారిత ఉత్పత్తులను,AI ఫోన్ల ను లాంచ్ చేస్తుందని తెలుస్తోంది.

ZTE Expected To Launch Nubia Ai Smartphones Soon

అధికారిక Nubia Weibo ఖాతా కూడా ఈ వార్తకు సంబందించిన ఒక టీజర్‌ను షేర్ చేసింది. ఇది AI లను సమాజంలోకి చేర్చడాన్ని మరియు ఈ టెక్నాలజీ ని వెలుగులోకి తీసుకువచ్చే సమయం ఎలా ఉందని సూచిస్తుంది.

ZTE గతంలో AI వేవ్‌ను కొనసాగిస్తుందని మరియు ఈ సాంకేతికతను దాని రాబోయే స్మార్ట్‌ఫోన్‌లకు కూడా తీసుకువస్తుందని ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు, ఈ కొత్త Nubia AI స్మార్ట్‌ఫోన్‌ల సిరీస్ వచ్చే వారం లాంచ్ చేయబడుతుంది. ఈ లైనప్ లో సంస్థ యొక్క మొట్టమొదటి AI ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కూడా కలిగి ఉంది. ఇది ఈ సంవత్సరం మధ్యలో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు.

ZTE నెబ్యులా OS ఏకీకృత AI ప్లాట్‌ఫారమ్‌తో పాటు పెద్ద మోడల్ ఇంటిగ్రేషన్, బిగ్ డేటా, 3D టెక్నాలజీ మరియు మరిన్నింటిని కేవలం పనితీరును మాత్రమే కాకుండా ఇమేజింగ్ మరియు భద్రతను కూడా మెరుగుపరచడానికి AIని సమీకృతం చేయాలని కంపెనీ యోచిస్తోంది.

దురదృష్టవశాత్తూ, ఈ పరికరాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవు. లాంచ్ త్వరలోనే ఉన్నందున మరిన్ని వివరాల కోసం వేచి ఉండండి.

నుబియా నుంచి గతంలో తన రెడ్ మ్యాజిక్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. ప్రత్యేకించి ఈ కొత్త ఫోన్ ప్రత్యేకమైన డిజైన్ మరియు నాణ్యత ఫీచర్లతో వచ్చింది.రెడ్ మ్యాజిక్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.8-అంగుళాల OLED డిస్‌ప్లేతో పరిచయం చేయబడింది. ఈ ఫోన్‌లో 2480 × 1116 పిక్సెల్‌లు, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 960 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1600 నిట్స్ బ్రైట్‌నెస్ వంటి డిస్‌ప్లే ఫీచర్లు ఉన్నాయి.

రెడ్ మ్యాజిక్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది అడ్రెనో 750 GPU గ్రాఫిక్స్ కార్డ్‌తో కూడా వస్తుంది. కాబట్టి ఈ ఫోన్ రెడ్ మ్యాజిక్ OS 9.0 ఆధారంగా ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది.రెడ్ మ్యాజిక్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది - 12GB RAM + 256GB స్టోరేజీ మరియు 16GB RAM + 512GB స్టోరేజీ.ఈ ఫోన్ IR బ్లాస్టర్ మరియు X-యాక్సిస్ మోటార్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

Best Mobiles in India

English summary
ZTE Expected To Launch Nubia Ai Smartphones Soon. Expected Specifications Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X