త్వరలో ZTE నుంచి 5బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు!

By: Madhavi Lagishetty

చైనా బహుళ జాతీయ టెలీ కమ్యూనికేషన్ దిగ్గజం ZTE..అమెరికా వంటి ప్రాంతాల్లో చాలా ప్రజాదరణ పొందింది. ఇది భారత్ లోని ఇతర బ్రాండ్ల కంటే వెనకబడి ఉంది. అయితే భారత్ లోనూ ఆకట్టుకునేందుకు కంపెనీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

త్వరలో ZTE నుంచి 5బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు!

ZTE సీఈవో సచిన్ బాత్రా గిజ్ బాట్ కు ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూ లో పలు విషయాలను వెల్లడించారు. భారత్ లో ఐదు కొత్త స్మార్ట్ ఫోన్లను కంపెనీ ప్రారంభించబోతుందని చెప్పారు. ఈ స్మార్ట్ ఫోన్లు సెప్టెంబర్ ముగింపులో లేదా అక్టోబర్ ప్రారంభంలో లాంచ్ కానున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం, సంస్థ యొక్క టాప్-మ్యాన్ స్మార్ట్ ఫోన్ల మోడల్ పేరును బహిర్గతం చేయలేదు. అయినప్పటికీ, ప్రైస్-పాయింట్ గురించి మాట్లాడుతూ..అన్నింటికీ ప్రవేశస్థాయి స్మార్ట్ ఫోన్లు, 6వేల నుంచి 15వేల మధ్య ధర పరిధిలో ఉంటాయని CMO పేర్కొంది.

ZTE ఫోన్లు ప్రత్యేకంగా ఇ-కామర్స్ రిటైలర్ వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి. ఈ విషయాన్ని సంస్థ అధికారింగా ప్రకటించలేదు. అయితే, స్మార్ట్ ఫోన్లు ఆఫ్ లైన్ చానెల్స్ ద్వారా లభిస్తాయని ZTE సీఈవో సచిన్ తెలిపారు.

Airtel సంచలనం, 5 రూపాయలకే 4జిబి 4జీ డేటా

ఈ స్మార్ట్ ఫోన్ల స్పెక్స్ మరియు ఫీచర్స్ గురించి ఎలాంటి సమాచారం లేదన్నారు. కానీ తప్పనిసరిగా టెక్-స్పెర్ లో పెరుగుతున్న రూమర్స్ తో ఎక్కువ కాలం ఉండకపోవచ్చన్నారు.

సచిన్ బాత్రా ప్రకారం...ZTE దాని వినియోగదారులకు సరైన ధరల వద్ద సరైన ఉత్పత్తులను అందిస్తుంది. భారతదేశంలో సూపర్ పోటీ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో తన స్థానబలాలను ఎలా బలపరుచుకోవాలనకుంటున్నారో అడిగినప్పుడు , ZTE ప్రధాన వినూత్న సాంకేతిక పరిజ్ఞానం పై ద్రుష్టి పెట్టిందని ఆయన చెప్పారు.

ఒక సంవత్సరం డౌన్ లైన్, ZTE ఫోన్లు భారత యూజర్ల మధ్య చాలా ప్రజాదరణ ఉంటుందని సచిన్ బాత్రా ఆశాభావం వ్యక్తం చేశారు. షియోమీ , ఒప్పో మరియు వివో వంటి ఇతర చైనీస్ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడాల్సి ఉంది. కానీ ZTE భారత్ లో సరసమైన స్మార్ట్ ఫోన్లలో ఒక ప్రఖ్యాత బ్రాండ్ గా ఉద్భవించింది.

Read more about:
English summary
The ZTE smartphones will fall in the price range between Rs. 6,000-15,000.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot