చైనాలో ఫేస్‌బుక్‌ని ప్రవేశపెట్టడంపై జూకర్స్ బర్గ్ సందిగ్ధత

Posted By: Staff

చైనాలో ఫేస్‌బుక్‌ని ప్రవేశపెట్టడంపై జూకర్స్ బర్గ్ సందిగ్ధత

ఫేస్‌బుక్ స్దాపకుడు మార్క్ జూకర్స్ బర్గ్ సోమవారం సాయంత్రం అమెరికా పిబిఎస్ ఛానెల్‌లో ఛార్లీ రోజ్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ చైనాలో ఫేస్‌బుక్‌ని విడుదల చేసే విషయం గురించి స్పష్టతను తెలియజేశారు. ఈ సందర్బంలో చైనాలో ఫేస్‌బుక్‌ని వెంటనే ప్రవేశపెట్టాలని మేము అనుకొవడం లేదని అన్నారు. చైనాలో ప్రస్తుతానికి ప్రపంచంలో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌ని నిషేదించిన సంగతి తెలిసిందే.

చైనాలో ఫేస్‌బుక్‌ని ప్రవేశపెట్టడం వెనకు ఉన్న సాధ్యాసాధ్యాలను ప్రస్తుతానికి పరిశీలిస్తున్నామని అన్నారు. ఫేస్‌బుక్ కంపెనీ ప్రతినిధులు ఇటీవలే చైనాని కలవడం జరిగింది. కానీ చైనా ప్రభుత్వ ప్రతినిధులు మాత్రం వారిని పట్టించుకొవడం లేదని సమాచారం. కేవలం ఫేస్‌బుక్ మాత్రమే కాదు ట్విట్టర్ పరిస్దితి కూడా చైనాలో అలానే ఉంది. ఈ విషయాన్ని ట్విట్టర్ సహా వ్యవస్దాపకుడు జాక్ డోర్సే ఇటీవల ఆసియాడి ఈవెంట్‌లో బహిరంగంగానే ప్రస్తావించాడు.

ఇది మాత్రమే కాకుండా చైనా ప్రభుత్వం సోషల్ మీడియాలపై సెన్సార్ షిప్ ప్రాబ్లమ్స్‌ని కూడా కలగజేస్తుందని వాపోయారు. ఇందుకు కారణం స్వదేశంలో ఉన్న సోషల్ మీడియా వెబ్ సైట్స్‌ని ప్రొత్సహించేందుకేనని వినికిడి. చైనాలో లోకల్ సోషల్ మీడియా వెబ్ సైట్స్ అయిన సినా విబియో, టెన్సెంట్ విబియోలకు చైనా మొత్తం మీద సుమారుగా 500మిలియన్ యూజర్ డేటా బేస్ ఉండడం విశేషం. ేచివరగా సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్‌బుక్ ఆన్ సైట్ కంటెంట్‌ని ప్రొత్సిహంచే దిశగా కొనసాగుతుందని తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot