ఫేస్‌బుక్ యాక్సెస్ చిన్నపిల్లలకు కూడా: ఫేస్‌బుక్ సిఈవో జూకర్ బర్గ్

Posted By: Super

ఫేస్‌బుక్ యాక్సెస్ చిన్నపిల్లలకు కూడా: ఫేస్‌బుక్ సిఈవో జూకర్ బర్గ్

ఫేస్‌బుక్ పౌండర్, సిఈవో మార్క్ జూకర్స్ బర్గ్ మరోసారి తన వీక్‌నెస్‌ని బయట పెట్టారు. ఆ వీక్‌నెస్ ఏమిటంటే ఫేస్‌బుక్‌లో కొత్త టెక్నిక్స్‌ని ప్రవేశపెట్టడం ఏమో, లేక తన గర్ల్ ప్రెండ్ గురించి అని అనుకునేరూ.... ఇవేమి కాదండీ చిన్న పిల్లల మీద అతనికున్నటువంటి నిబద్దతే అతని కొత్త వీక్‌నెస్. కాలిఫోర్నియాలో న్యూస్కూల్స్ సమ్మిట్‌కి హాజరైనటువంటి మార్క్ జూకర్స్ బర్గ్ 600మిలియన్ యాక్టివ్ యాజర్స్ ఉన్నటువంటి తన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లో 13సంవత్సరాలు వయసు లోపు ఉన్నటువంటి పిల్లలకు కూడా ఫేస్‌బుక్‌ని వాడే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

సెనేట్ ప్యానల్ రికమెండేషన్ ప్రకారం యంగ్ చిల్డ్రన్స్‌కు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ అయిన ఫేస్‌బుక్ ప్లాట్ ఫామ్‌ని ఉపయోగించే అవకాశం కల్పిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా రాబోయే కాలంలో ప్రక్కన ఉన్నటువంటి విద్యార్దుల నుండి చాలా నేర్చుకునే విధంగా సాప్ట్‌వేర్, టెక్నాలజీని తయారుచేయనున్నట్లు తెలిపారు. మనదేశ ఎకానమీ అనేది బాగా ఎదగాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా కీలకం అని అన్నారు.

ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో ఎకౌంట్ ఓపెన్ చెయ్యాలంటే కనీసం 13సంవత్సరాలుగా వయసు నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల ఫేస్‌బుక్ కంపెనీ ఆఫీసియల్ చెప్పినదేమిటంటే వయసు తక్కువగా ఉండి ఎవరైతే ఫేస్‌బుక్‌ని వాడుతున్నారో అలాంటి వారిని రోజుకి దాదాపు 20,000మంది పిల్లల ఎకౌంట్స్‌ని తొలగించడం జరిగిందన్నారు. కానీ ఫేస్‌బుక్ సిఈవో మాత్రం ఫేస్‌బుక్ సేవలను స్కూల్ పిల్లలకు కూడా విస్తరించాలని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot