అప్పుడు రూ. 3 లక్షల కోట్లు..ఇప్పుడు రూ. 20 వేల కోట్లు దానం

Written By:

ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ అలాగే అతని భార్య ప్రిస్కిల్లా చాన్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కూతరు పుట్టిన ఆనందంలో అప్పుడు రూ. 3 లక్షల కోట్లు దానం చేసి జుకర్ బర్గ్ దాతృత్వాన్ని చాటుకుంటే ఇప్పుడు అతని భార్య రూ. 20 వేల కోట్లను దానం చేసి మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. చిన్నపిల్లల్లో వ్యాధుల నివారణకు ఉద్దేశించిన ప్రణాళికకు ఈ మొత్తాన్ని కేటాయిస్తారు.

రూ. 3 లక్షల కోట్లు దానం చేసిన ఫేస్‌బుక్ సీఈఓ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఘటనలు గుర్తు చేసుకుంటూ కంటతడి

క్యాన్సర్, గుండెజబ్బులు, అంటు వ్యాధుల బారిన పడ్డ చిన్నారులను చూసి వారి తల్లిదండ్రులు పడే నరకయాతనను ఎన్నో మార్లు ప్రత్యక్షంగా చూసిన ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ సతీమణి ప్రిస్కిల్లా చాన్, ఆ ఘటనలు గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు.

రూ. 20,054 కోట్లను

స్వతహాగా డాక్టర్ అయిన ప్రిస్కిల్లా, శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, చిన్నారుల్లో వ్యాధుల నివారణ నిమిత్తం రూ. 20,054 కోట్లను (3 బి. డాలర్లు) విరాళంగా ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

600 మిలియన్ డాలర్లను

ఇదే సమయంలో 'బయోహబ్' అనే సంస్థ వ్యాధుల నివారణకు చేస్తున్న కృషిని అభినందిస్తూ, 600 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. హెచ్ఐవీ, జికా, ఎబోలా వంటి ప్రాణాంతక వైరస్ లను అడ్డుకునే ఔషధాలను తయారు చేసే కంపెనీలకు సాయం చేయడానికి తాము సిద్ధమని అన్నారు.

బిల్ గేట్స్ అభినందనలు

ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన 10 నుంచి 15 పరిశోధనా సంస్థలతో కలసి పనిచేస్తామని వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బిల్ గేట్స్, ప్రిస్కిల్లా తీసుకున్న దాతృత్వ నిర్ణయాన్ని అభినందించారు.

శాన్ ఫ్రాన్సిస్కో లో రెండు ప్రాజెక్టులను

ఈ నేపథ్యంలోనే బే ఏరియాలోని పరిశోధకులు, కాలిఫోర్నియా, బెర్క్ లీ, స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్తల అనుసంధానంతో శాన్ ఫ్రాన్సిస్కో లో రెండు ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు చెప్పారు.

ప్రాణాంతక వ్యాధుల నివారణ మందులు

ముఖ్యంగా హెచ్ ఐవీ, ఎబోలా, జికా లాంటి ప్రాణాంతక వ్యాధుల నివారణ మందులు, వ్యాక్సీన్ల తయారీకి కృషి జరుగుతుందన్నారు. ఇలా వచ్చిన ఫలితాలను ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ, ప్రతి శాస్త్రవేత్తకు అందుబాటులో ఉంచుతామన్నారు.

10, 15 లాబరేటరీస్ తో కలిసి

అలాగే ప్రపంచ వ్యాప్తంగా 10, 15 లాబరేటరీస్ తో కలిసి పనిచేయనున్నట్టు తెలిపారు. 

నాలుగు రకాల వ్యాధుల కారణంగా

మరోవైపు నాలుగు రకాల వ్యాధుల కారణంగా పిల్లలో మరణాలు సంభవిస్తున్నాయని జకర్ బర్గ్ తన ఫేస్బుక్ పేజీ పోస్ట్ లో పేర్కొన్నారు. క్యాన్సర్, గుండె జబ్బు, అంటు వ్యాధులు, నరాల వ్యాధులు బాలలను వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సాంకేతికత నైపుణ్యంతో

సరియైన సాంకేతికత నైపుణ్యంతో వీటిని నిరోధించవచ్చన్నారు. ఈ నేపథ్యంలోనే బయోసైన్స్ పరిశోధన కేంద్రం బయోహబ్, వ్యాధుల నిర్ధారణకు చిప్ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook founder Mark Zuckerberg and wife Priscilla Chan to donate billions for medical research read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot