క్లిక్ చేయకుండానే కంప్యూటర్‌లోకి వచ్చేస్తోన్న వైరస్

Zusy అనే మాల్వేర్ ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతోంది.

|

ఏదైనా ఒక Malware కంప్యూటర్‌లోకి చొరబడాలంటే ప్రమాదకర లింక్ లేదా ప్రమాదకర ప్రోగ్రామ్ పై క్లిక్ చేసినపుడు, వాటి ద్వారా మాల్వేర్ అనేది పీసీలోకి వచ్చే వీలంటుంది. అయితే, ఏవిధమైన లింక్స్ పై క్లిక్ చేయకుండానే ఓ మాల్వేర్ కంప్యూటర్‌లలోకి వ్యాపిస్తోంది.

Zusy మాల్వేర్..

Zusy మాల్వేర్..

నిష్ణాతులైన హ్యాకర్లచే మరింత ట్రిక్కీగా డిజైన్ కాబడిన Zusy అనే మాల్వేర్ ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతోంది. పవర్‌పాయింట్ ప్రెజంటేషన్‌లలో నక్కి ఉంటోన్న ఈ హానికర మాల్వేర్ వాడి గుండా కంప్యూటర్‌లలోకి వచ్చేసింది.

ఈమెయిల్స్ ద్వారా..?

ఈమెయిల్స్ ద్వారా..?

Zusy మాల్వేర్‌ను క్యారీ చేస్తోన్న పీపీటీ ఫైల్స్ ఈమెయిల్స్ లేదా ఇతర ఆన్‌లైన్ మార్గాల ద్వారా కంప్యూటర్‌లలో డౌన్‌లోడ్ అవుతున్నాయి.

"Loading...Please wait," అంటూ మెసేజ్

Zusy మాల్వేర్‌ను కలిగి ఉన్న పీపీటీ ఫైల్‌ను ఓపెన్ చేసిన వెంటనే , "Loading...Please wait," అంటూ ఓ మెసేజ్ blue hyperlinkతో స్లైడర్ లో కనిపిస్తుంది. ఆ లింక్ పై మౌస్‌ను ఉంచగానే ఆ పీపీటీ ఫైల్ PowerShell స్క్రిప్ట్‌ను ఎగ్జిక్యూట్ చేసి మనం ప్రమేయం లేకుండానే ఓ హానికర డొమైన్ ద్వారా మాల్వేర్ ఫైల్‌ను కంప్యూటర్‌లోకి డౌన్‌‌లోడ్ చేస్తోంది.

ఫైల్ డౌన్‌లోడ్ అయిన వెంటనే..

ఫైల్ డౌన్‌లోడ్ అయిన వెంటనే..

మాల్వేర్ ఫైల్ డౌన్‌లోడ్ అయిన వెంటనే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ సెక్యూరిటీ నోటీస్ పేరుతో ఓ మెనూ ఓపెన్ అవుతుంది. అందులో Enable, Disable, Enable All (not recommended) పేరుతో మూడు ఆప్షన్‌లు కనిపిస్తాయి.

 Enable లేదా Enable All  ఆప్షన్‌ల పై క్లిక్ చేయకండి

Enable లేదా Enable All ఆప్షన్‌ల పై క్లిక్ చేయకండి

వాటిలో Enable లేదా Enable All (not recommended) ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మీ కంప్యూటర్ పూర్తిగా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపో్తుంది. Disable ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా మాల్వేర్ నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది.

రకరకాల పేర్లతో సర్క్యులేట్ అవుతోంది...

రకరకాల పేర్లతో సర్క్యులేట్ అవుతోంది...

"Purchase Order #130527", "Confirmation." పేర్లతో ఈ Zusy మాల్వేర్ సర్క్యేలేట్ అవుతున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. "order.ppsx", "invoice.ppsx" or "order&prsn.ppsx." పేర్లతో కనిపించే పీపీటీ ఫైల్స్‌కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Zusy Malware Spreading via PPTs, No Clicking Required. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X