మన శాస్త్రవేత్తలు, వారి సంచలనాలు

భారతదేశాన్ని సైన్స్ రంగంలో ప్రపంచ పటాన నిలిపిన శాస్ర్తవేత్తలు ఎందరో ఉన్నారు. వారంతా తమ పరిశోధనలతో దేశానికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టారు. తమ పరిశోధనలతో కొత్త ప్రపంచాననికి నాంది పలికారు. వారిలో దేశానికి చేసిన సేవలు మరువలేనివి. వారందరినీ మనం మరొకసారి గుర్తుకు చేసుకుందాం.

Read More : ఆగష్టు 24 నుంచి జియోఫోన్ బుకింగ్స్, మీకూ రిమైండర్ కావాలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అబ్దుల్ కలాం

సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఇండియాను ప్రపంచ పటంలో సగర్వంగా తలెత్తుకునేలా చేసిన అణుశాస్ర్తవేత్త అబ్దుల్ కలాం. అగ్ని ,క్షిపణి, పృధ్వి క్షిపణి మిసైళ్ల అభివృద్ధి, ప్రయోగాలకు కలాం చిరునామా కావడంతో ఆయనకు మిస్సైల్ మాన్ అనే పేరు సార్థకమయింది. అబ్దుల్ కలాం పూర్తి పేరు డాక్టర్ అబుల్ ఫాకిర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలామ్ . తమిళనాడు రాష్ట్రంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో అక్టోబరు 15 1931 న జన్మించాడు. భారతదేశపై మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III)ని అభివృద్ధి చేయడంలో అబ్దుల్ కలాం సేవలు మరువలేనివి.ఆయన తోనే 1998లో ఫోఖ్రాన్ అణు పరీక్షలు విజయవంతం అయ్యాయి. దేశంలోనే అత్యున్నత పురస్కారాలు ఆయన సొంతమయ్యాయి. 2002 జూలై 18 న కలామ్ 90% పైగా ఓట్లతో భారత రాష్ట్రపతిగా ఎన్నికై... జూలై 25న పదవీ స్వీకారం చేశారు.

సర్ సివి రామన్

ఆధునిక భారత విజ్ఞాన శాస్ర్తవేత్త పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో వెల్లడించి, నోబెల్‌ హుమతి అందుకున్న మొట్టమొదటి భారతీయ శాస్ర్తవేత్త శ్రీ సివి రామన్‌. పూర్తి పేరు చంద్రశేఖర్‌ వెంకటరామన్‌. 1888 నవంబరు 7న తమిళ నాడులోని తిరుచురాపల్లిలో జన్మించారు. తన ఇంటినే పరిశోధన శాలగా మార్చిన ఘనుడు. భారత దేశంలో ఉన్న అరకొర సదుపాయాలతోనే విజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కించారు. కాంతి వర్ణాల మీద ఆయన చేసన ప్రయోగాలు కొత్త ఒరవడికి నాంది పలికాయి.

విక్రమ్ సారాబాయ్

భారతదేశ అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆధ్యుడు. గుజరాత్ రాష్ర్టంలో అహమ్మదా బాద్ లో 1919 ఆగష్టు 12న జన్మించారు. గ్రామీణ ప్రజల కోసం ఉపగ్రహాలను రూపొందించిన మేధావి.శాస్ర్త సాంకేతిక రంగాలు సామాన్యులకు అందుబాటులోకి రావాలని చెప్పిన శాస్ర్త వేత్త. అప్పటి ప్రధాని నెహ్రోకి శాటిలైట్ యెక్క ఆవశ్యకతను తెలిపి హోమి బాబా పర్యవేక్షణలో ఇస్రోని స్థాపించారు. 1971 డిసెంబర్ 31న తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు.

హోమి బాబా

హోమి బాబా 1909 అక్టోబర్ 30న ముంబైలో జన్మించారు. అణు భౌతిక రంగంలో సంచలనాలు సృష్టించిన విజ్ఞాన శాస్ర్తవేత్త. టాటా ఇనిస్టిట్యూట్ రీసెర్చి సెంటర్ ని స్థాపించి ఆటమిక్ ఎనర్జీ పరిశోధనలకు మార్గదర్శకుడిగా నిలిచారు. అణు భౌతిక పరిశోధనల మధ్యనే జీవితాన్ని గడిపారు.తొలిసారి సైంటిఫిక్ పేపర్ ని నడిపారు. అణు భౌతిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. చివరకు విమాన ప్రమాదంలో 1966న మరణించారు.

సీఎన్ రావు

సీఎన్ రావు పూర్తి పేరు చింతామణి నాగేశ రామచంద్రరావు. 1934 జూన్ 30న బెంగుళూరులో జన్మంచారు. రసాయన శాస్ర్తంలో ఎన్నో పరిశోధనలను వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి పరిచయం చేశారు. 60 విశ్వ విద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్న విజ్ఞాన శాస్ర్తవేత్త. నానో పదార్థాల రంగాలపై అనేక రకాల పరిశోధనలు చేయడమే కాకుండా 1400 పరిశోధన పత్రాలు ముద్రించారు. 45 పుస్తకాలు రచించారు.

విశ్వేశ్వరయ్య

బెంగుళూరు‌లోని పేద కుటుంబలో 1860న జన్మించిన విశ్వేశ్వరయ్య అపర భగీరధుడిగా నవ భారత నిర్మాతగా పేరుగాంచారు. డబ్బులు సొంతానికి కాదు దేశానికి ఖర్చు పెట్టండి అని చెప్పిన నిజాయితీపరుడు. అందుకే బారతరత్న ఆయన మెడలోకి వచ్చి చేరింది. విశ్వ విఖ్యాత ఇంజనీర్‌గా,పాలనాదక్షునిగా ఆయన ధేభక్తినిగా కీర్తిని ఆర్జించిన యోధుడు విశ్వేశ్వరయ్య.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Indian scientists whose work shaped modern life. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot