విశ్వం గురించి మనిషి తెలుసుకున్న రహస్యాలు

|

విశ్వ రహస్యాలను చేధించే క్రమంలో మనిషి ప్రయోగాల పరంపర కొనసాగుతూనే ఉంది. విశ్వం ఆవిర్భావానికి సంబంధించి కీలక వివరాలను రాబట్టేందుకు ఎంతో ఓర్పుతో సాగించిన పరిశోధనల్లో కొన్ని సఫలీకృతమైనప్పటికి, కొన్ని మాత్రం నిరాశనే మిగిల్చాయి.

విశ్వం గురించి మనిషి తెలుసుకున్న రహస్యాలు

అయినప్పటికి పట్టువదలని విక్రమార్కుడిలో భవిష్యత్ తరాల మనుగడ కోసం మనిషి తన ప్రయత్నాలను సాగిస్తూనే ఉన్నాడు. విశ్వం గురించి మనిషి తెలుసుకున్న 10 ఆసక్తిర విషయాలు మీతో షేర్ చేసుుంటున్నాం...

Read More : 8 నిమిషాల్లో 90,000 ఫోన్‌లు, దుమ్ము రేపిన Redmi 3s Prime

సూర్యుడు గురించి...

సూర్యుడు గురించి...

సూర్యుడు పాలపుంత అనే గెలాక్సీకి చెందిన నక్షత్రం. సూర్యుడు, గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, స్టరాయిడ్స్‌ను కలిపి సూర్యకుటుంబం అంటారు.

మిలియన్ల కొద్ది  నక్షత్రాలు

మిలియన్ల కొద్ది నక్షత్రాలు

విశ్వంలో వేలాది గెలాక్సీలు ఉన్నాయి. ప్రతి గెలాక్సీలో మిలియన్ల కొద్ది  నక్షత్రాలున్నాయి.

ఆ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి

ఆ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి

హేలీ అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు ఒక తోకచుక్కను కనుగొని దానికి హేలీ అని పేరుపెట్టాడు. ఈ తోకచుక్క 76ఏళ్లకు ఒకసారి కనిపిస్తుంది. 1986లో హేలీ తోకచుక్క కనిపించింది. ఇది తిరిగి 2062లో కనిపిస్తుంది.

ఆకాశం నుంచి జారిపడుతున్న వస్తువులు

ఆకాశం నుంచి జారిపడుతున్న వస్తువులు

రాత్రుళ్లు ఒక్కోసారి ఆకాశంలో ప్రకాశిస్తున్న వస్తువులు వేగంగా కిందకు పడిపోవటాన్ని మనం చూస్తాం. అవి అంతరిక్షం నుంచి పడిపోతున్న రాళ్లు, ఖనిజాలు. వాటినే ఉల్కలు అని కూడా పిలుస్తారు.

హనీ ఫంగస్

హనీ ఫంగస్

విశ్వంలోని అతిపెద్ద జైవిక అవయవంగా ‘హనీ ఫంగస్'ను శాస్త్రవేత్తలు గుర్తించారు.

పురాతన నక్షత్ర మండలం

పురాతన నక్షత్ర మండలం

విశ్వంలోని అతి పురాతన నక్షత్ర మండలమైన z8 GND 5296ను 2013లో కొనుగోన్నారు. ఇడి భూమి నుంచి సుమారు 30 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

అతిపెద్ద గెలాక్సీ

అతిపెద్ద గెలాక్సీ

విశ్వంలోని అతిపెద్ద గెలాక్సీ ఐసీ-1101. ఈ గెలాక్సీని బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడరిక్ విలియం హెర్షెల్ 1790లో కనుగొన్నారు.

అతిపెద్ద కృష్ణబిలం

అతిపెద్ద కృష్ణబిలం

ఎన్‌జీసీ డిస్క్ గెలాక్సీ విశ్వంలోనే అతిపెద్ద కృష్ణబిలంగా గుర్తింపు పొందింది. ఈ కృష్ణబిలాన్ని జర్మన్ దేశానికి చెందిన ప్రముఖ ఖగోళవేత్త రెమ్మో వాన్ డెన్ జోష్ 2012లో కనుగొన్నారు.

అతిబల్లపరుపు గెలాక్సీ

అతిబల్లపరుపు గెలాక్సీ

‘ఐసీ-2233' వెండి సూదిలా కనిపించే ఈ గెలాక్సీ విశ్వంలోని అతిబల్లపరుపు గెలాక్సీల్లో ఒకటి.

Best Mobiles in India

English summary
9 Interesting Facts About Our Universe. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X