కాల గర్భంలో అంతు చిక్కని సైన్స్

నానో టెక్నాలజీ సహాయంతో ఇప్పుడు మనం అభివృద్థి చేసుకుంటోన్న డమాస్కస్ స్టీల్, రోమన్ చక్రవర్తుల కాలంలోనే తన హవాను కొనసాగించిందట.

|

చరిత్రకు అందని పూర్వపు రోజుల్లోనే అద్భుతైన ఆవిష్కరణలతో కూడిన నాగరికత ప్రాచీన ప్రపంచాన్ని శాసించి ఉండొచ్చని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. పూర్వీకులు తమ అపారమైన మేధోశక్తితో ఊహకందని రీతిలో సృష్టించిన పలు ఆవిష్కరణలకు సంబంధించిన మూలాలను ఇప్పటికి మనం కనుగొనలేక పోతున్నాం. 6 అధునాతన ప్రాచీన ఆవిష్కరణలకు సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం...

గ్రీక్ ఫైర్

గ్రీక్ ఫైర్

ఇదో మిస్టీరియస్ కెమికల్ వెపన్ 7వ శతాబ్థం నుంచి 12వ శతాబ్థం వరకు మనుగడ సాగించిన బైజాంటైన్లు తమ శత్రువుల పై నౌకా యుద్ధాల్లో భాగంగా ఓ రహస్యమైన పదార్థాన్ని వాడే వారట. ఈ ప్రమాదకర లిక్విడ్‌ను ట్యూబ్స్ ద్వారా అవతలి పడవల పై జిమ్మే వారట. దీంతో ఆ పడవ అగ్నికి ఆహుతై పోయేదట. ఈ కెమికల్ వెపన్‌కు సంబంధించిన ఫార్ములా బైజాంటైన్లతోనే అంతరించి పోయిందని ఓ కథనం.

ఫ్లెక్సిబుల్ గ్లాస్

ఫ్లెక్సిబుల్ గ్లాస్

14-37 A.D మధ్య ఓ ఫ్లెక్సిబుల్ గ్లాస్ ఆవిష్కరణ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిందట. ఈ గ్లాస్ ప్రత్యేకత ఎంటంటే క్రిందపడినప్పటికి చెక్కు చెదరదట. అంతుచిక్కని విలువైన లోహాలతో ఈ గ్లాసును అభివృద్థి చేసి ఉండచ్చని చరిత్రకాలు అభిప్రాయపడుతున్నారు.

అన్ని విషాలకు ఒకే విరుగుడు

అన్ని విషాలకు ఒకే విరుగుడు

ప్రపంచం అవాక్కయ్యేలా అన్ని విషాలకు ఒకే విరుగుడును 120-63 B.C మధ్య కాలంలోనే కనుగొన్నారట. దీని పేరు మిత్రీడేటియమ్. అప్పటి రాజైన Mithridates VI దీన్ని విజయవంతంగా పరీక్షించి చూసారట. అయితే ఈ విరుగుడు సంబంధించిన ఫార్ములా కాల గర్భంలో కలిసిపోయింది.

హీట్ రే వెపన్

హీట్ రే వెపన్

గ్రీక్ గణిత మేధావి Archimedes (d. 212 B.C.)లో ఓ హీట్ రే వెపన్ ను అభివృద్థి చేసారట. సూర్యుని కిరణాల సహాయంతో ఈ వెపన్ విడుదల చేసే ప్రమాదకర మైక్రోతరంగాలు శరీరాలను దహించివేయగలవట.

రోమన్ కాంక్రీట్

రోమన్ కాంక్రీట్

రోమన్ కట్టడాలు వేల సంవత్సరాల నుంచి చెక్కచెదరకుండా ఉన్నాయి. వీటి నిర్మాణంలో ఏఏ పదర్థాలు ఉపయోగించారన్నది నిన్న మొన్నటి వరకు అంతుచిక్కని రహస్యంలానే నిలిచింది. ఈ చారిత్రాత్మక కట్టడాల నిర్మాణంలో భాగంగా అగ్నిపర్వత బూడిదని ఉపయోగించినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.

డమాస్కస్ స్టీల్

డమాస్కస్ స్టీల్

నానో టెక్నాలజీ సహాయంతో ఇప్పుడు మనం అభివృద్థి చేసుకుంటోన్న డమాస్కస్ స్టీల్, రోమన్ చక్రవర్తుల కాలంలోనే తన హవాను కొనసాగించిందట. ఈ శక్తివంతమైన స్టీల్‌తో వారు కత్తులను తయారు చేయించుకునే వారట.

Best Mobiles in India

English summary
Advanced Ancient Technology that is Beyond Modern Understanding. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X