41 ఏళ్ల తరువాత ఆకాశంలో అద్భుతం

దాదాపు 41 ఏళ్ల తరువాత అంతరిక్షంలో మరో అద్భుతం చోటు చేసుకుంది.

|

దాదాపు 41 ఏళ్ల తరువాత అంతరిక్షంలో మరో అద్భుతం చోటు చేసుకుంది. మానవ నిర్మిత వాయేజర్ 2 అంతరిక్ష నౌక 41 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత సౌరకుటుంబ అంచులు దాటి నక్షత్రాంతర రోదసి ప్రాంతం (Interstellar Space)లోకి ప్రవేశించింది. కాగా వాయేజర్ 1 తర్వాత ఈ ఘనత సాధించిన చేరిన రెండో మానవ నిర్మిత అంతరిక్ష నౌక ఇదేనని నాసా వెల్లడించింది. Interstellar Space అనగా భూమి, చంద్రుడు, సూర్యుడు తదితర గ్రహాలను కలిపి సౌరకుటుంబంగా పిలుస్తారు.

ఇండియన్ జర్నలిస్టులను టార్గెట్ చేసిన ఫేస్‌బుక్‌, అకౌంట్లు మాయంఇండియన్ జర్నలిస్టులను టార్గెట్ చేసిన ఫేస్‌బుక్‌, అకౌంట్లు మాయం

సౌర వ్యవస్థకు, నక్షత రోదసి ప్రాంతానికి..

సౌర వ్యవస్థకు, నక్షత రోదసి ప్రాంతానికి..

సౌరకుటుంబం అంచులు దాటిన వెంటనే ఇంటర్స్టెల్లార్ స్పేస్ వస్తుంది. అంటే సౌర వ్యవస్థకు, నక్షత రోదసి ప్రాంతానికి మధ్య ఉండే ప్రాంతమని అర్థం.ఈ సౌరకుటుంబానికి అవతల కూడా కొన్ని వేల గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

సంకేతాల ప్రకారం

సంకేతాల ప్రకారం

వాయేజర్ అందించే సంకేతాల ప్రకారం సౌర కుటుంబం ఆవల ఉండే నక్షత్రాంతర రోదసిలో ఉండే కాస్మిక్ రేస్ లేదా ప్లాస్మా తరంగాలు లేదా అయోనైజ్డ్ వాయువుల గుండా ప్రయాణిస్తున్నట్లు అంచనా వేసినట్లు వాయేజర్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్త ఎడ్ స్టోన్ తెలిపారు.

వాయేజర్-1

వాయేజర్-1

వాయేజర్-1 కూడా నక్షత్ర రోదసిలోకి ప్రవేశించగానే కాస్మిక్ తరంగాల ప్రభావానికి గురైందని, ఇప్పుడు వాయేజర్-2పై కూడా ఐదు శాతం కాస్మిక్ తరంగాల ప్రభావాన్ని గుర్తించామని వివరించారు.

మూడు నెలల కిందటే..

మూడు నెలల కిందటే..

వాయేజర్-1 మూడు నెలల కిందటే సౌర వ్యవస్థకు నక్షత్ర రోదసికి మధ్యలో ఉండే ఇంటర్స్టెల్లార్ స్పేస్‌ను పూర్తిగా దాటి నక్షత్ర రోదసిలోకి చేరుకుందని, వాయేజర్-2 కూడా త్వరలోనే దాన్ని అనుసరించనుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

విశ్వరహస్యాలు, గ్రహాంతరవాసుల ఉనికి..

విశ్వరహస్యాలు, గ్రహాంతరవాసుల ఉనికి..

సౌరవ్యవస్థకు ఆవల ఉండే విశ్వరహస్యాలు, గ్రహాంతరవాసుల ఉనికి తెలుసుకునే ఉద్దేశంతో జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ సంస్థ ‘ప్లానెటరీ గ్రాండ్ టూర్' అనే కార్యక్రమానికి 1964లో శ్రీకారం చుట్టారు.

 

గురు, శని, ఫ్లూటో గ్రహాల అధ్యయనానికి..

గురు, శని, ఫ్లూటో గ్రహాల అధ్యయనానికి..

ఇందులో భాగంగా నాలుగు అంతరిక్ష నౌకలు రూపొందించాలని భావించారు. గురు, శని, ఫ్లూటో గ్రహాల అధ్యయనానికి రెండు నౌకలు, యురేనస్, నెప్యూన్ గ్రహాల అధ్యయనానికి 1979లో మరో రెండు అంతరిక్ష నౌకలను ప్రయోగించాలని భావించినా 1972లో ఆర్థిక సమస్యల వద్ద ప్రయోగాలు ముందుకు సాగలేదు.

1977లో..

1977లో..

అయితే, ఇవే లక్ష్యాలతో నాసా 1977లో వాయేజర్ 1, 2లను ప్రయోగించింది. 1977, ఆగస్టు 20న వాయేజర్-2ను, సెప్టెంబరు 5న వాయేజర్-1ను ప్రయోగించారు. 

వాయేజర్-1

వాయేజర్-1

అయితే, వెనుక ప్రయోగించిన వాయేజర్-1.. రెండో వాయేజర్ కంటే ముందే 36 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత సౌర వ్యవస్థను దాటడం గమనార్హం.

భూమికి 17.7 బిలియన్ కిమీల దూరంలో ..

భూమికి 17.7 బిలియన్ కిమీల దూరంలో ..

ప్రస్తుతం వాయేజర్-2 భూమికి 17.7 బిలియన్ కిమీల దూరంలో ఉంది. అంటే, భూమి నుంచి సూర్యుడికి ఉండే దూరానికి 118 రెట్లు అధికం.

బరువు సుమారు 700 కిలోలు..

బరువు సుమారు 700 కిలోలు..

ఈ వాయేజర్ నుంచి వచ్చిన ఎన్నో ఫొటోలు గ్రహాల ఉనికిని తెలుసుకునేందుకు దోహదం చేశాయి. ఈ వాయేజర్ అంతరక్షి నౌకల బరువు సుమారు 700 కిలోలు.

Best Mobiles in India

English summary
After 41 Years, NASA's Voyager 2 May Be Near Interstellar Space more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X