మార్స్ మీద ఏలియన్స్ టెంపుల్, షాకిచ్చిన నాసా..
మార్స్ మీద ఏలియన్స్ నివసించారా, వందల సంవత్సరాల పాటు వారి నాగరికత మార్స్ మీద వర్థిల్లిందా..అంటే అవుననే సమాధానం వస్తోంది.
మార్స్ మీద ఏలియన్స్ నివసించారా, వందల సంవత్సరాల పాటు వారి నాగరికత మార్స్ మీద వర్థిల్లిందా..అంటే అవుననే సమాధానం వస్తోంది. మార్స్ ని జల్లెడ పడుతున్న నాసా క్యూరియా సిటీ రోవర్ ఈ మధ్య భూమి మీదకు ఓ చిత్రాన్ని పంపింది. అందులో మార్స్ మీద ఏలియన్స్ కు సంబంధించిన ఓ పురాతన టెంపుల్ కనిపిస్తోంది. దీని ప్రకారం మార్స్ మీద ఏలియన్స్ నాగరికత వర్థిల్లిందని యుఎప్ఓ హంటర్స్ చెబుతున్నారు. ఇందుకు సాక్ష్యంగా రోవర్ పంపించిన చిత్రాలను చూపిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు అలాంటివేమి లేవని కొట్టిపారేస్తున్నారు.

Conspiracy theoristలు
Conspiracy theoristలు మార్స్ మీద ఏలియన్స్ నాగరికత వర్థిల్లిందని దీనికి సాక్ష్యాలను సాధించామని చెబుతున్నారు. నాసా క్యూరియాసిటీ రోవర్ పంపిన చిత్రంతో వీరి దీన్ని రుజువు పరుస్తున్నారు. ఈ చిత్రం ప్రకారం అక్కడ కొండ మీద ఒకప్పుడు ఏలియన్స్ నాగరికత ఉండేదని చెబుతున్నారు.

మరికొందరి వాదన
మరికొందరు ఏలియన్స్ హంటర్స్ ఇది కేవలం మార్స్ మీదనే కాదని రెడ్ ప్లానెట్ మీద కూడా ఈ నాగరికత వర్ధిల్లిందని చెబుతున్నారు. వారికి అనేక రకాల శక్తులు ఉండేవని ఆ శక్తులతో వారు ఎక్కడికైనా వెళ్లగలరని వాదిస్తున్నారు.

నాసాకు వార్నింగ్
ప్రముఖ కుట్ర సిద్ధాంత కర్త స్కాట్ దీనిపై నాసాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. నాసా వెంటనే ఏలియన్స్ పరిశోధన ఆపేయాలని లేకుంటే దానికి పెను ప్రమాదం తప్పదని చెబుతున్నారు. ఏలియన్స్ ఉన్నాయని చెప్పడానికి బలమైన సాక్ష్యం దొరికింది కావున నాసా తన పనులు మానుకోవాలని వాదిస్తున్నారు.

ఏలియన్స్ నాగరికత
Mr Waring కూడా దీనిపై UFO Sightings Dailyలో ఓ కథనాన్ని రాశారు. హిల్ టాప పైన ఏలియన్స్ టెంపుల్ ఉందని అది చూసేందుకు చాలా పెద్దగ ఉందని ఈ విషయం క్యూరియాసిటీ రోవర పంపిన చిత్రంలో స్పష్టంగా కనిపించిందని రాశారు. దీనిని బట్టి అక్కడ ఏలియన్స్ నాగరికత బాగా వర్థిల్లినట్లు తెలుస్తోందన్నారు.

పిరమిడ్ ఆకారంలో
కాగా క్యూరియాసిటీ పంపిన చిత్రాన్ని చూస్తే అది పిరమిడ్ ఆకారంలో నిర్మితమై ఉంది. దానినిజూమ్ చేసి చూస్తే ఓ కొండ పైన టెంపుల్ ఆకారంలో ఏదో కనిపిస్తోంది. దీనిని ఏలియన్స్ ఆరాదించే దేవతల గుడిగా పలువురు చెబుతున్నారు.

అది రాయ అంటున్న మరికొందరు
మరి కొందరు మాత్రం కళ్లు మనల్ని మోసం చేస్తున్నాయని అది ఓ పెద్ద రాయి అని చెబుతున్నారు. మెదడుకు పదును చెబితే అదేంటో స్పష్టంగా తెలుస్తుందని అసలు ఏలియన్స్ జాడలే లేవని అవి అన్నీ పుకార్లేనని కొట్టిపారేస్తున్నారు.


Click it and Unblock the Notifications