Home
Scitech

విశ్వంలో ఎవరికీ తెలియని వింతైన నిజాలు !

విశ్వం.. ఓ రహస్యాల పుట్టుక. అందులో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయన్న సంగతి ఎంతమందికి తెలుసు

విశ్వం.. ఓ రహస్యాల పుట్టుక. అందులో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయన్న సంగతి ఎంతమందికి తెలుసు, ఆకాశంలో చందమామ. మినుమినుకుమనే తారలతో విశ్వం ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే అవేకాదు..ఈ విశ్వంలో కొన్ని వింతైన నిజాలు కూడా ఉన్నాయండోయ్. అవేంటో చూద్దాం.

న్యూట్రాన్ తారలు సెకనుకు 600 సార్లు తిరుగుతాయ్..!

న్యూట్రాన్ తారలు సెకనుకు 600 సార్లు తిరుగుతాయ్..!

నక్షత్రాలు పేలిపోయిన తర్వాత ఆ పేలుడు కేంద్రంలో ఏర్పడే నక్షత్ర స్థితినే ‘న్యూట్రాన్ నక్షత్రం'గా పిలుస్తారు. ఈ నక్షత్రం జస్ట్ 10 కి.మీ. విస్తీర్ణంలో ఉన్నా కూడా.. మన సూర్యుడి కన్నా అనేక రెట్ల ద్రవ్యరాశితో ఉంటుందట.

సెకనుకు 60 సార్లు

సెకనుకు 60 సార్లు

సాధారణంగా ఇవి సెకనుకు 60 సార్లు తమచుట్టూ తాము గిర్రున తిరుగుతుంటాయి. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో వీటి భౌతిక లక్షణాలు మారిపోయి ఏకంగా సెకనుకు 600 సార్లు కూడా ఇవి తిరుగుతాయట.

 రోదసీలో నో సౌండ్!

రోదసీలో నో సౌండ్!

అంతరిక్షంలో మనం అరిచి కేకలేసినా.. పక్కన ఉన్నవారికి కాదుకదా.. మన శబ్దం మనకే వినిపించదు. ఎందుకంటే యానకం లేనిదే ధ్వనితరంగాలు ప్రయాణించలేవు మరి.

రేడియో కమ్యూనికేషన్

రేడియో కమ్యూనికేషన్

రోదసీలో వాతావరణం ఉండదు కాబట్టి.. ధ్వని ప్రయాణానికి అవకాశం లేక అంతా సెలైంట్‌గా ఉంటుందన్నమాట. మరి వ్యోమగాములు ఎలా మాట్లాడుకుంటారో తెలుసా? రేడియో కమ్యూనికేషన్ ద్వారా.

విశ్వంలో చుక్కలెన్ని?

విశ్వంలో చుక్కలెన్ని?

ఈ విశ్వంలో మొత్తం ఎన్ని నక్షత్రాలున్నాయంటే లెక్కించడం దాదాపు అసాధ్యమే. అయితే మన పాలపుంతలోని తారల సంఖ్యతో విశ్వంలోని అన్ని గెలాక్సీల సంఖ్యను గుణిస్తే.. కచ్చితంగా కాకపోయినా.. ఎంతోకొంత అంచనా వేయొచ్చు.

70,000 మిలియన్ మిలియన్ మిలియన్ల తారలు

70,000 మిలియన్ మిలియన్ మిలియన్ల తారలు

విశ్వంలో 70 సెక్స్‌ట్రిలియన్‌లు అంటే.. 70,000 మిలియన్ మిలియన్ మిలియన్ల తారలు ఉండవచ్చని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అంచనా.

చంద్రుడిపై మనిషి అడుగుజాడలు

చంద్రుడిపై మనిషి అడుగుజాడలు

చందమామపై మనిషి పాదం మోపినప్పుడు ఏర్పడిన ముద్రలు చెరిగిపోవాలంటే 10 కోట్ల ఏళ్లు పడుతుందట.

కోట్ల ఏళ్లపాటు అలాగే

కోట్ల ఏళ్లపాటు అలాగే

ముద్రలు చెరిగిపోవాలంటే మట్టి కదలాలి. మట్టి కదలాలంటే గాలి లేదా నీరు కావాలి. చంద్రుడిపై ఇవి రెండూ ఉండవు కాబట్టే.. పాదముద్రలు, రోవర్ చక్రాల జాడలు కోట్ల ఏళ్లపాటు అలాగే ఉండిపోతాయన్నమాట.

సౌర కుటుంబంలో 99% ద్రవ్యరాశి సూర్యుడిదే!

సౌర కుటుంబంలో 99% ద్రవ్యరాశి సూర్యుడిదే!

సౌరకుటుంబం మొత్తం ద్రవ్యరాశిలో 99% ద్రవ్యరాశి ఒక్క సూర్యుడిదేనట. అందుకే కోట్ల కి.మీ. దూరంలోని గ్రహాలను సైతం సూర్యుడు అలా గురుత్వాకర్షణతో చుట్టూ తిప్పుకుంటున్నాడు.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazing Facts About the Universe You Won't Believe Read more At Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X