భూమికి ముంచుకొస్తున్న పెనుముప్పు ..

భూమికి ముప్పు ముంచుకొస్తుందా? అపార నష్టం వాటిల్లనుందా? అంటే అవుననే అంటున్నారు ఐర్లాండ్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త అలాన్ ఫిట్జ్ సిమ్మన్స్.

By Hazarath
|

భూమికి ముప్పు ముంచుకొస్తుందా? అపార నష్టం వాటిల్లనుందా? అంటే అవుననే అంటున్నారు ఐర్లాండ్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త అలాన్ ఫిట్జ్ సిమ్మన్స్. భూమిని ఉల్క ఢీకొట్టడం ఖాయమని అందుకోసం ప్రపంచం సిద్ధంగా ఉండాలని సిమ్మన్స్ హెచ్చరించారు.అంతే కాదు ఢీకొట్టడానికి ముందే అది ముక్కలుగా విడిపోవచ్చని సిమ్మన్స్ పేర్కొన్నారు.

జియోకి చావు దెబ్బ, ఫ్రీగా ఎయిర్‌టెల్ 4జీ ఫీచర్ ఫోన్ !జియోకి చావు దెబ్బ, ఫ్రీగా ఎయిర్‌టెల్ 4జీ ఫీచర్ ఫోన్ !

భూమివైపు వెయ్యి ఉల్కలు

భూమివైపు వెయ్యి ఉల్కలు

భూమివైపు వెయ్యి ఉల్కలు (ఆస్ట్రాయిడ్స్) వేగంగా దూసుకొస్తున్నాయని, వీటివల్ల ప్రపంచం అంతరించి పోతుందని ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

 

నిజానికి 2012లో

నిజానికి 2012లో

నిజానికి 2012లో ప్రపంచం అంతరించిపోతుందని చాలా ప్రచారం జరిగింది. అలా జరగకపోవడంతో ఇలాంటి వాటిని ప్రజలు నమ్మడం లేదు.

ఇపుడు నిజంగానే భూమికి పెను ముప్పు

ఇపుడు నిజంగానే భూమికి పెను ముప్పు

అయితే ఇపుడు నిజంగానే భూమికి పెను ముప్పు పొంచి ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు వెయ్యి ఉల్కలు భూమి వైపు అతి వేగంగా దూసుకొస్తున్నట్లు గుర్తించారు.

గంటకు 60 వేల మైళ్ళ వేగంతో
 

గంటకు 60 వేల మైళ్ళ వేగంతో

గంటకు 60 వేల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తున్న ఈ ఆస్ట్రాయిడ్లతో ప్రపంచ వినాశనం తప్పదని అంచనా వేస్తున్నారు.

2009 ఈఎస్ అనే పేరు గల ఉల్క

2009 ఈఎస్ అనే పేరు గల ఉల్క

2009 ఈఎస్ అనే పేరు గల ఉల్క అతి త్వరలోనే భూమిని ఢీకొట్టవచ్చని చైనాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త హెచ్చరిస్తున్నారు.

మూడు బిలియన్ అణు బాంబులతో సమానమైన విధ్వంసం

మూడు బిలియన్ అణు బాంబులతో సమానమైన విధ్వంసం

10 మైళ్ళ వెడల్పు ఉన్న ఈ అతి పెద్ద ఆస్ట్రాయిడ్ మూడు బిలియన్ అణు బాంబులతో సమానమైన విధ్వంసం సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో భూమిపైనున్న మూడో వంతు జీవరాశి నాశనమవుతుందని భావిస్తున్నారు.

1908లో ఒక చిన్న ఉల్క

1908లో ఒక చిన్న ఉల్క

ఈ సందర్భంగా 1908లో ఒక చిన్న ఉల్క సైబీరియాలోని తుంగుస్కా ప్రాంతాన్ని ఢీకొనడంతో 800 చదరపు మైళ్ల భూభాగం సర్వనాశనం అయిందనే విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.

ఆస్ట్రాయిడ్ డే

ఆస్ట్రాయిడ్ డే

గ్రహశకలం విధ్వంసం కారణంగానే ఆ రోజును ప్రపంచ ఆస్ట్రాయిడ్ డేగా నిర్ణయించారని ఫిట్జ్‌సిమ్మన్స్ తెలియజేశారు.

ప్రస్తుత తరుణంలో

ప్రస్తుత తరుణంలో

ప్రస్తుత తరుణంలో ఆ స్థాయి గ్రహశకలం ఢీకొంటే ఒక పెద్ద నగరం భస్మం అవుతుందని అన్నారు.

Best Mobiles in India

English summary
Asteroid hitting Earth very much possible, warns scientist Read more At Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X