రష్యా పంజా విప్పితే, భయంతో విలవిలలాడిపోతున్న బ్రిటన్ !

By Hazarath
|

అగ్రదేశం అమెరికాను వణికిస్తున్న కమ్యూనిస్ట్ దేశం రష్యా ప్రపంచ దేశాలను కూడా వణికించే దిశగా అడుగులు వేస్తోందని సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఈ కమ్యూనిస్ట్ దేశాన్ని చూసి బ్రిటన్ భయపడుతోంది. ఎప్పుడు ఎక్కడ తమ కొంపలు కొల్లేరు చేసి తమ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందోనని అణుక్షణం భయం గుప్పెట్లో చిక్కుకుని విలవిలలాడుతోందనే కథనాలు ఇప్పుడు కొంచెం కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

 

సముద్రం లోపల నుంచి అమెరికాని టార్గెట్ చేసిన రష్యా !సముద్రం లోపల నుంచి అమెరికాని టార్గెట్ చేసిన రష్యా !

ముద్రజలాల్లో ఉన్న కేబుల్స్‌కు..

ముద్రజలాల్లో ఉన్న కేబుల్స్‌కు..

అట్లాంటిక్ సముద్రజలాల్లో ఉన్న కేబుల్స్‌కు రష్యా ఎక్కడ సమస్యలు తీసుకువస్తుందన్న భయంలో బ్రిటన్‌ ఆర్మీ ఉంది. రష్యా నేవి ఇప్పుడు పూర్తిస్థాయిలో ఆధునీకరించడం కూడా ఈ భయానికి ప్రధాన కారణంగా మారింది.

కేబుల్స్‌ రష్యా తెంచేస్తే..

కేబుల్స్‌ రష్యా తెంచేస్తే..

సముద్ర జలాల్లోని కేబుల్స్‌ రష్యా తెంచేస్తే.. బ్రిటన్‌ అత్యంత తీవ్రమైన ప్రమాదంలో పడుతుందని బ్రిటన్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ సర్‌ స్టువర్ట్‌ పీచ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు.

సమాచార యుద్ధానికి దిగే అవకాశం..

సమాచార యుద్ధానికి దిగే అవకాశం..

రష్యా ప్రపంచంపై సమాచార యుద్ధానికి దిగే అవకాశం ఉందని.. దాని ప్రభావం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

 న్యూక్లియర్‌, సంప్రదాయ యుద్ధనౌకలు..
 

న్యూక్లియర్‌, సంప్రదాయ యుద్ధనౌకలు..

ప్రధానంగా న్యూక్లియర్‌, సంప్రదాయ యుద్ధనౌకలు, సబ్‌మెరైన్స్‌ అట్లాంటిక్‌ సముద్రంలో ప్రయాణిస్తున్నాయని, భవిష్యత్‌లో సమాచార వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేయడం కూడా యుద్ధంలో భాగమవుతుందని ఆయన చెప్పారు.

సమాచారాన్ని సరఫరాచేసే వ్యవస్థ

సమాచారాన్ని సరఫరాచేసే వ్యవస్థ

కాగా ప్రపంచ దేశాలకు సమాచారాన్ని సరఫరాచేసే వ్యవస్థ మొత్తం అట్లాంటిక్ మహా సముద్రంలో నిక్షిప్తమై ఉంది. 

99 శాతం..

99 శాతం..

ఈ సముద్రంలోని కేబుల్స్ ద్వారా ప్రపంచములోని దేశాలు అన్నీ 99 శాతం అంతర్జాతీయ ఇంటర్ నెట్, టెలిఫోన్ మరియూ ప్రైవేట్ డాటా ట్రాఫిక్ ను అందుకుంటున్నాయని అంచనా.

 శాటన్‌-2

శాటన్‌-2

ఇదిలా ఉంటే దేశ చరిత్రలోనే అతి పెద్ద ఖండాతర అణు క్షిపణి(ఐసీబీఎమ్‌) ప్రయోగానికి రష్యా సిద్ధమైన విషయం తెలిసిందే. దానిపేరే శాటన్‌-2. ఈ ప్రమాదకర క్షిపణి సింగిల్‌ స్ట్రైక్‌తో అమెరికా రక్షణ వ్యవస్థను బద్దలు కొట్టగలదని రష్యా చెబుతోంది.

ఆటం బాంబు కంటే..

ఆటం బాంబు కంటే..

40 మెగా టన్నులు బరువు గల డజను న్యూక్లియర్‌ వార్‌ హెడ్‌లను మోసుకెళ్లగల సామర్ధ్యం దీని సొంతమని చెప్పింది. అంతే కాకుండా 1945లో అమెరికా హిరోషిమా, నాగసాకిలపై విసిరిన ఆటం బాంబు కంటే శాటన్‌-2 దాదాపు 2 వేల రెట్లు శక్తిమంతమైనది పేర్కొంది.

తాజా సమాచారం ప్రకారం..

తాజా సమాచారం ప్రకారం..

అయితే శాటన్‌- 2 పరీక్ష ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఇందుకు కారణం తరచూ మిస్సైల్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడమే. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాది చివర్లో రష్యా ఈ ప్రయోగం చేపట్టనుంది. 2019 కల్లా ఈ ప్రయోగాలను పూర్తి చేసి సర్వీసులోకి తీసుకుంటామని రష్యా అధికారులు చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
Russia has ability to 'disrupt' Britain's internet access, head of Armed Forces warns More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X