చంద్రుడి కక్షలోకి ప్రవేశించి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న Chandrayaan-2

|

అంతరిక్షంలోకి రాకెట్లను పంపడానికి ప్రస్తుతం ఇండియా ఇతర దేశాల మీద ఆధారపడకుండా సొంతంగా పంపుతున్నది. అందులో భాగంగా గత సంవత్సరం చంద్రుడి మీద ప్రయోగాలు చేయడం కోసం చంద్రయాన్ -2 మిషన్ ను పంపింది. ఈ చంద్రయాన్ -2 మిషన్ చంద్రుని చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశించి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయింది. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులోని అన్ని పరికరాలు ప్రస్తుతం బాగా పనిచేస్తుఉండడం గమనార్హం. అలాగే ఇందులో మరో ఏడు సంవత్సరాల కాలం పాటు పనిచేయడానికి తగినంత ఆన్బోర్డ్ ఇంధనం కూడా ఉందని అంతరిక్ష సంస్థ ఇస్రో తెలిపింది.

చంద్రయాన్ -2 మిషన్ విజయపరంపర

చంద్రయాన్ -2 మిషన్ విజయపరంపర

చంద్రయాన్ -2 మిషన్ యొక్క ప్రయోగం గత సంవత్సరం జూలై 22, 2019 న విజయవంతంగా ప్రారంభించారు. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం గురువారం ఆగస్టు 20 న చంద్రుడి యొక్క కక్ష్యలోకి చంద్రయాన్ -2 ప్రవేశించింది. చంద్రుడి యొక్క దక్షిణ దృవం మీద రోవర్ ను మోస్తున్న ల్యాండర్ యొక్క ల్యాండింగ్ ప్రయత్నం విజయవంతం కానప్పటికీ ఎనిమిది శాస్త్రీయ పరికరాలతో కూడిన ఆర్బిట్ ను విజయవంతంగా చంద్రుడి యొక్క కక్ష్యలో ఉంచారు. ఈ ఆర్బిట్ ఇప్పటికే చంద్రుని చుట్టూ 4,400 కన్నా ఎక్కువ కక్ష్యలను పూర్తి చేసింది అని ఇస్రో తెలిపింది.

చంద్రయాన్ -2 మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం

చంద్రయాన్ -2 మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం

చంద్రయాన్ -2 మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చంద్రుని ఉపరితలం యొక్క నిర్దేశించని దక్షిణ ధ్రువంపై రోవర్ యొక్క మృదువైన ల్యాండింగ్ చేయడానికి భారతదేశం చేసిన మొదటి ప్రయత్నం. అయితే ల్యాండర్ విక్రమ్ గత ఏడాది సెప్టెంబర్‌లో దక్షిణ ధ్రువం మీద దిగుతున్న చివరి నిమిషాలలో సంబంధాలు కట్ అయ్యి కూలిపోయింది. అధిక రిజల్యూషన్ కెమెరాతో సహా శాస్త్రీయ పేలోడ్‌లు చంద్ర ఉపరితలాన్ని మ్యాపింగ్ చేయడానికి మరియు చంద్రుని యొక్క ఎక్సోస్పియర్ (బాహ్య వాతావరణం) ను అధ్యయనం చేయడానికి ఆర్బిట్ ను తయారుచేసారు.

Also Read:రంగులతో మెరిసిపోతున్న భూమి!! అద్భుతమైన ఫోటోను విడుదల చేసిన నాసా...Also Read:రంగులతో మెరిసిపోతున్న భూమి!! అద్భుతమైన ఫోటోను విడుదల చేసిన నాసా...

ఇండియన్ స్పేస్ సైన్స్ డేటా సెంటర్ (ISSDC)

ఇండియన్ స్పేస్ సైన్స్ డేటా సెంటర్ (ISSDC)

బెంగళూరులోని ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఇండియన్ స్పేస్ సైన్స్ డేటా సెంటర్ (ISSDC) లో దీని యొక్క పూర్తి డేటాను డౌన్‌లోడ్ చేసినట్లు ఇస్రో తెలిపింది. అధికారిక పీర్ సమీక్ష ద్వారా ధ్రువీకరించబడిన తరువాత ఈ సంవత్సరం చివరి నాటికి పబ్లిక్ డేటా విడుదల ప్లాన్ చేయబడింది. ఇది చంద్రయాన్ -2 నుండి మొదటి సంవత్సరం పరిశీలనలను జోడించి పేలోడ్ల యొక్క కక్ష్య పనితీరును ప్రదర్శిస్తుంది. ఇది చంద్ర శాస్త్రానికి గణనీయంగా దోహదపడే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Best Mobiles in India

Read more about:
English summary
Chandrayaan-2 Mission Enter in Moon Orbit Last Year This Day

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X