దొంగ దెబ్బ కొట్టిన చైనా, టైం కోసం ఎదురుచూస్తున్న ఇండియా !

Written By:

పొరుగుదేశం చైనా అదను చూసి ఇండియాను దెబ్బ కొట్టింది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన భారత డ్రోన్ హెరాన్ ను చైనా భూభాగంలొ పేల్చి వేసింది. దీంతో పాటు ఈ హెరాన్ డ్రోన్ టెక్నాలజీ మొత్తాన్ని చైనా పసిగట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే భారత రక్షణ వ్యవస్థకు తీవ్ర ముప్పు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.

ఆధార్ లింకింగ్‌పై కేంద్రం తీపికబురు, 3 నెలలు గడువు పొడిగింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డ్రోన్‌ను నేలకూల్చినట్లుగా..

కొద్ది రోజుల క్రితం భారత్‌కు చెందిన మానవ రహిత డ్రోన్‌ డోక్లాం పీఠభూమి సరిహద్దులో ఎగురుతూ చైనా భూభాగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే ఆ డ్రోన్‌ను నేలకూల్చినట్లుగా చైనా కథనాన్ని వెలువరించింది.

రెండు వారాల తర్వాత ..

హెరాన్ డ్రోన్‌ భూభాగంలోకి ప్రవేశించిన రెండు వారాల తర్వాత చైనా దీనిపై ప్రకటన విడుదల చేసింది. అక్రమంగా తమ భూభాగంలోకి ప్రవేశించినందుకు భారత్‌ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్‌ చేసింది.

టెక్నాలజీని చైనా చోరి చేసిందనే రిపోర్టులు..

లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న డ్రోన్‌ హెరాన్‌ నుంచి టెక్నాలజీని చైనా చోరి చేసిందనే రిపోర్టులు వస్తున్నాయి.

అత్యాధునిక సాంకేతికత..

అత్యాధునిక సాంకేతికతతో తయారైన హెరాన్‌ డ్రోన్‌ను భారత్‌ ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసింది. దీన్ని ఇజ్రాయెలీ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌(ఐఏఐ) తయారు చేసింది.

హెరాన్‌ బరువులో 250 కిలోలు..

ఏ వాతావరణ పరిస్థితినైనా ఎదుర్కొనగల సామర్ధ్యం హెరాన్‌ సొంతం. హెరాన్‌ బరువులో 250 కిలోలు దాని సెన్సార్లే ఉంటాయి. ఆపరేట్‌ చేసే బేస్‌ నుంచి తప్పిపోయిన తిరిగి బేస్‌ను చేరుకునేలా దీన్ని ఐఏఐ రూపొందించింది.

డ్రోన్‌ చైనాలోకి తప్పిపోగానే

డ్రోన్‌ చైనాలోకి తప్పిపోగానే.. అదే తిరిగి బేస్‌కు వచ్చేస్తుందని భారత రక్షణ వర్గాలు భావించాయి. అయితే అలా జరగలేదు. దీంతో ఎంతో విలువైన టెక్నాలజీని చైనా తస్కరించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

చైనా బలగాలకు విలువైన సమాచారం..

కాగా డ్రోన్‌ ఉదంతంపై ఇజ్రాయెల్‌కు చెందిన ఓ ప్రముఖ భద్రతా సంస్థ.. ఓ చక్కని గూఢచారిని కోల్పోవడం భారత్‌కు దెబ్బలాంటిదని, అత్యాధునిక సాంకేతికతను చేజిక్కించుకున్న చైనా బలగాలకు విలువైన సమాచారం దొరికినట్లే అని పేర్కొంది.

కార్గిల్‌ యుద్ధం తర్వాత..

కార్గిల్‌ యుద్ధం తర్వాత వేసిన కార్గిల్‌ రివ్యూ కమిటీ సూచనతో భారత్‌ హెరాన్‌ మానవ రహిత డ్రోన్లను ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసిన విషయం విదితమే.

భారత ఆర్మీ వద్ద..

2000లో భారత ఆ‍ర్మీ, నేవీ, వాయుసేనలు ఈ డ్రోన్లను వినియోగించటం ప్రారంభించాయి. ప్రస్తుతం భారత ఆర్మీ వద్ద ఇలాంటి డ్రోన్లు 45 ఉన్నట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
China accessed drone tech from downed Indian UAV More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot