చంద్రుని పై శాశ్వతంగా బేస్ ని ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతున్న చైనా !

By Maheswara
|

సూటిగా క్లుప్తంగా చెప్పాలంటే, గత కొన్ని నెలలుగా.. చైనా కు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం దొరుకుతోంది. ఇంతకీ ఏమి సాధించింది అని మీకు అనుమానం రావొచ్చు? దీనికి సమాధానం అడిగితే.. చాలా సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే "అంతరిక్షంలో!" సాధించిన విజయమే దానికి సమాధానంగా చెప్పవచ్చు.

చైనా

చైనా "మాస్టర్ ప్లాన్" ఏమిటి?

అంతరిక్షంలో చైనా ఎలాంటి విజయాలు సాధించింది? చైనా "మాస్టర్ ప్లాన్" ఏమిటి? అనే విషయాలు పరిశీలిస్తే. సాదాసీదాగా సమాధానం చెప్పలేం! ఎందుకంటే.. చైనాది కేవలం 'మాస్టర్ ప్లాన్' మాత్రమే కాదు.. శాశ్వత ప్రణాళిక కూడా! సంక్షిప్తంగా, చైనా చంద్రునిపై శాశ్వత చంద్ర స్థావరాలను నిర్మిస్తోంది! వివరించడానికి - మేము చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA) యొక్క తాజాగా చేసిన పనిని వివరించాలి .

మరో మూడు మిషన్‌లను

మరో మూడు మిషన్‌లను

ఇటీవలి నివేదిక ప్రకారం, చైనా ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ రాబోయే దశాబ్దంలో (అంటే 10 సంవత్సరాలు) మరో మూడు మిషన్‌లను చంద్రుని పైకి నిర్వహించడానికి చైనా ప్రభుత్వం నుండి అనుమతి పొందింది.గతం లో 2004లో ప్రారంభమైన చాంగ్ మూన్ మిషన్ 4వ దశ ఆమోదం పొందింది.

ప్రస్తుతం చైనా యొక్క మూన్ మిషన్లు - Chang'e 6, Chang'e 7 మరియు Chang'e 8 - వచ్చే పదేళ్లలో లాంచ్ చేయబడతాయి! ఈ మూడు మిషన్లు వేర్వేరు లక్ష్యాలను కలిగి ఉండవచ్చు, కానీ మూడింటికి ఒక ముఖ్యమైన ఉమ్మడి లక్ష్యం ఉంది. ఇది మరేమీ కాదు - వేర్వేరు అంతరిక్ష నౌకలను ప్రయోగించడం మరియు చంద్రునిపై శాశ్వత చంద్ర స్థావరాలను నిర్మించడానికి పునాది వేయడం!

రష్యాతో భాగస్వామ్యం

రష్యాతో భాగస్వామ్యం

ఈ సమయంలో, చైనా అంతర్జాతీయ చంద్ర పరిశోధన కేంద్రం (ILRS) నిర్మించడానికి రష్యాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2030లో నిర్మాణం ప్రారంభం కానుంది! చంద్రుని యొక్క ఫార్ సైడ్ నుండి నమూనాలను సేకరించడానికి చైనా యొక్క Chang'e-6 మూన్ మిషన్ ఉపయోగించబడుతుంది. Chang'e-6 అప్పుడు చంద్రుని దక్షిణ ధ్రువానికి పంపబడుతుంది. ఇది ఒక ఆర్బిటర్, ఒక ల్యాండర్, ఒక రోవర్, ఒక రిలే ఉపగ్రహం మరియు క్రేటర్లలో నీటిని గుర్తించడానికి ఒక చిన్న డిటెక్టర్ కలిగి ఉంటుంది!

 చివరగా Chang'e-8 3D ప్రింటింగ్ మరియు చంద్ర వనరులను ఉపయోగించడం కోసం సాంకేతిక ప్రదర్శనలపై దృష్టి పెడుతుంది!భూమి నుండి (చంద్రుని వెనుక భాగం) చూడలేని చంద్రునికి అవతలి వైపు అడుగుపెట్టిన మొదటి దేశంగా ఘనత సాధించిన చైనా గత కొన్ని నెలలుగా అంతరిక్ష పరిశోధనలో కొన్ని ముఖ్యమైన మైలురాళ్లను సాధించింది.

కొత్త ఖనిజాన్ని కనుగొన్నట్లు చైనా ఇటీవల ప్రకటించింది

కొత్త ఖనిజాన్ని కనుగొన్నట్లు చైనా ఇటీవల ప్రకటించింది

చంద్రుని నుండి భూమికి తిరిగి తీసుకువచ్చిన నమూనాలను పరిశీలించిన చాంగ్-5 మిషన్ ద్వారా పూర్తిగా కొత్త ఖనిజాన్ని కనుగొన్నట్లు చైనా ఇటీవల ప్రకటించింది. ఈ ఘనత సాధించిన మూడో దేశం చైనా! ఒకవైపు - విజయాలు కూడగట్టుకుంటున్నా చైనా మాత్రం అప్పుడప్పుడూ తన సత్తా ప్రదర్శిస్తూనే ఉంది.

చైనా మాదిరిగానే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా తన చంద్రుని మిషన్లను ప్లాన్ చేస్తోంది. దాని కోసం, ఇది చంద్రునిపై ల్యాండింగ్ సాధ్యమయ్యే కొన్ని ప్రదేశాలను కూడా ఇప్పటికే అంచనా వేసింది.

NASA vs China

NASA vs China

అవును! చంద్రునిపై ల్యాండ్ చేయడానికి చైనా మొత్తం 10 సైట్లను ఎంపిక చేసింది మరియు ఆ 10 సైట్లలో 3 NASA చేత ఇప్పటికే ఎంపిక చేయబడింది. NASA ,చైనా యొక్క ఈ చర్యను విమర్శించింది మరియు "మనలాగే పారదర్శకంగా ఉండండి!" సలహా ఇచ్చింది.

అవును నాసా మిషన్లలో ఆర్టెమిస్ 1 కూడా ఒకటి.  ఆర్టెమిస్ 1 అనేది వ్యోమగాములు లేకుండా చంద్రుని చుట్టూ తిరిగే ఒక అమెరికన్ చంద్ర మిషన్. దీని గురించి మీలో కొందరికి ఇప్పటికే  తెలిసి ఉండవచ్చు. చంద్రునిపైకి పంపాలన్న ఈ NASA యొక్క మిషన్ మొత్తం 2 సార్లు అంతరాయం కలిగింది (వివిధ కారణాల వల్ల) మరియు ఇప్పుడు సెప్టెంబర్ 27న ప్రయోగించాల్సి ఉంది. మరియు అది "ఒకవేళ" ఆర్టెమిస్ 1 అక్టోబర్ 2న ప్రారంభించబడుతుంది!

Best Mobiles in India

Read more about:
English summary
China Planning To Send Three Moon Missions In Near Future To Setup Permanent Base On Lunar Surface.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X