చందమామ 'మేడ్ ఇన్ చైనా'

విద్యుత్ ఆదా కోసం 2022 నాటికి కృతిమ చందమామలను తయారు చేసేందుకు చైనా ప్లాన్ చేస్తుంది . రాత్రి సమయాల్లో వీధి లైట్లకు బదులు ఈ కృతిమ చందమామలనే వాడాలని యోచిస్తోంది .

|

విద్యుత్ ఆదా కోసం 2022 నాటికి కృతిమ చందమామలను తయారు చేసేందుకు చైనా ప్లాన్ చేస్తుంది . రాత్రి సమయాల్లో వీధి లైట్లకు బదులు ఈ కృతిమ చందమామలనే వాడాలని యోచిస్తోంది . ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. చంద్రుని కన్నా ఈ కృత్రిమ చందమామలు ఎనిమిది రెట్లు ఎక్కువగా వెలుతురును ప్రసరింపజేస్తాయి. అంతేగాక కృత్రిమ చంద్రులు నిజమైన చందమామలాగే ఉంటాయి. 2020 నాటికి కృత్రిమ చందమామల ప్రాజెక్టు పూర్తవుతుంది. వీటిని 2022నాటికి అంతరిక్షంలోకి పంపుతారు.

 

శాంసంగ్ దీపావ‌ళి సేల్ :గెలాక్సీ నోట్ 8, గెలాక్సీ S8 మరియు TVల ఫై భారీ తగ్గింపుశాంసంగ్ దీపావ‌ళి సేల్ :గెలాక్సీ నోట్ 8, గెలాక్సీ S8 మరియు TVల ఫై భారీ తగ్గింపు

సిచువాన్ రాష్ట్రంలోని జిచాంగ్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి....

సిచువాన్ రాష్ట్రంలోని జిచాంగ్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి....

ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న అధికారులు మాట్లాడుతూ సిచువాన్ రాష్ట్రంలోని జిచాంగ్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నామని చెప్పారు. సూర్యుడి నుంచి వెలువడే వెలుతురు కృత్రిమ చంద్రులపై పడుతుందని, ఆ వెలుతురు పరావర్తనం చెంది భూమికి చేరుతుందని పేర్కొన్నారు. తద్వారా వీధి లైట్లను ఉపయోగించడం తగ్గతుందని, ప్రభుత్వానికి భారీగా ఆదాయం మిగులుతుందని వివరించారు.

ఒక్కో కృత్రిమ చంద్రుడి వెలుతురు .....

ఒక్కో కృత్రిమ చంద్రుడి వెలుతురు .....

ఒక్కో కృత్రిమ చంద్రుడి వెలుతురు భూమిపై 3,600 కిలోమీటర్ల నుంచి 6,400 కిలోమీటర్ల పరిధిలో పడుతుందని చెప్పారు. కేవలం 50 కిలోమీటర్ల పరిధిలో పడే వెలుతురుతో రూ.1241 కోట్ల మేరకు విద్యుత్ ఖర్చులు ఆదా అవుతాయని, ఈ లెక్కన వేల కిలోమీటర్ల పరిధిలో అయితే భారీగానే ఆదాయం మిగులుతుందని తెలిపారు.

సాధారణ చంద్రుడు భూమి నుంచి.....
 

సాధారణ చంద్రుడు భూమి నుంచి.....

సాధారణ చంద్రుడు భూమి నుంచి 3,80,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడని, తాము ప్రయోగించే కృత్రిమ చంద్రుడిని భూమి ఉపరితలం నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో కక్షలోకి ప్రవేశపెడుతామని చెప్పారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎక్కడైనా విద్యుత్ సరఫరా లేకపోయినా ఈ కృత్రిమ చందమామలు ఆ ప్రాంతంలో వెలుగులు నింపుతాయని పేర్కొన్నారు.

ఈ కృత్రిమ చంద్రుల ప్రయోగాన్ని పలువురు విమర్శిస్తున్నారు.....

ఈ కృత్రిమ చంద్రుల ప్రయోగాన్ని పలువురు విమర్శిస్తున్నారు.....

మరోవైపు ఈ కృత్రిమ చంద్రుల ప్రయోగాన్ని పలువురు విమర్శిస్తున్నారు. కృత్రిమ చంద్రుడు నుంచి వచ్చే కాంతి వల్ల రాత్రి, పగలు కాల చక్రానికి విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక మొక్కలు, జంతువులు తమ రోజువారీ క్రియలను జరుపలేవని తెలిపారు.

Best Mobiles in India

English summary
China Plans to Launch an 'Artificial Moon' to Light Up the Night Skies.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X