1970 తరువాత చంద్రుడి నమూనాలను తిరిగి తీసుకువస్తున్న చాంగ్స్ 5

|

ప్రపంచంలోని అన్ని దేశాలు చంద్రుని మీద మానవాళి నివాసానికి అవకాశం ఉందొ లేదో అని తెలుసుకోవడానికి అంతరిక్ష నౌకలను పంపుతూనే ఉన్నారు. అయితే అక్కడి నుండి రాళ్ళు మరియు మట్టి నమూనాలను మొదటి సారిగా 1970 లో తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు చైనా యొక్క అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇటీవల పంపిన సాటిలైట్ చంద్రుడి మీద గల నమూనాలను భూమికి తిరిగి తీసుకురావడానికి తన ప్రయాణాన్ని ప్రారంభించిందని అధికారిక జిన్హువా న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది.

చాంగ్స్ 5 ప్రోబ్‌ తిరుగు ప్రయాణం

చాంగ్స్ 5 ప్రోబ్‌ తిరుగు ప్రయాణం

బీజింగ్ యొక్క కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం తెల్లవారుజామున చాంగ్స్ 5 ప్రోబ్‌లోని ఇంజన్లు చంద్రుడి ఉపరితలం నుండి 143 మైళ్ళు అంటే సుమారుగా 230 కిలోమీటర్ల దూరం నుంచి తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. అయితే 22 నిమిషాల తరువాత భూమి యొక్క కక్షలోని పథంలోకి ఈ క్రాఫ్ట్‌ ప్రవేశించినట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

 

Also Read: Jio - Realme పార్టనర్ షిప్!!! అతి తక్కువ ధరలో 4G హ్యాండ్‌సెట్‌ల తయారీకి వ్యూహం...Also Read: Jio - Realme పార్టనర్ షిప్!!! అతి తక్కువ ధరలో 4G హ్యాండ్‌సెట్‌ల తయారీకి వ్యూహం...

చంద్రుడి ఉపరితలం నుండి సేకరించిన నమూనాల వివరాలు

చంద్రుడి ఉపరితలం నుండి సేకరించిన నమూనాల వివరాలు

ఇన్నర్ మంగోలియాలో విజయవంతంగా ల్యాండింగ్ అయితే కనుక యునైటెడ్ స్టేట్స్ మరియు సోవియట్ యూనియన్ తరువాత చంద్రుడి మీద నమూనాలను భూమి మీదకు తిరిగి తీసుకువచ్చిన మూడవ దేశంగా చైనా నిలుస్తుంది. వాస్తవానికి ఈ నమూనాలు ఎంత వరకు సేకరించిందో చైనా యొక్క అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించనప్పటికీ 4.4 పౌండ్ల (2 కిలోగ్రాముల) నమూనాలను సేకరించాలని సాటిలైట్ లాంచ్ అప్పుడు ప్రకటించారు.

చాంగ్ 5 మెషిన్ లాంచ్ వివరాలు

చాంగ్ 5 మెషిన్ లాంచ్ వివరాలు

చాంగ్ 5 మెషిన్ ను చైనా అంతరిక్ష పరిశోధనా సంస్థ నవంబర్ 24 న లాంచ్ చేసింది. అయితే డిసెంబర్ 1 ల్యాండర్ వాహనం చంద్రుని మీద విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ మిషన్ మొత్తం 23 రోజులపాటు ప్రయోగాలు చేయాలని మొదట ప్లాన్ చేసారు. చైనీయుల పౌరాణిక మూన్ దేవత పేరు మీద లాంచ్ చేసిన చాంగ్ 5 అంతరిక్ష నౌక గురువారం 15:10 GMT (గురువారం రాత్రి 8:40 గంటలకు IST) చంద్రుని నుండి బయలుదేరిందని చైనా అంతరిక్ష సంస్థ తెలిపింది.

చంద్రుడి మీదకు చాంగ్ 5 మెషిన్ ప్రయోజనం

చంద్రుడి మీదకు చాంగ్ 5 మెషిన్ ప్రయోజనం

చాంగ్ 5 మెషిన్ శక్తివంతమైన థ్రస్ట్ ఇంజిన్ ను కలిగిన రాకెట్ సాయంతో చంద్రుడి మీద గల శిలలు మరియు మట్టిని సేకరించే ల్యాండర్ ను మాడ్యూల్ కక్ష్యలోకి ప్రవేశపెట్టబడింది. అధికారులు మంగళవారం చంద్రునిపైకి వచ్చిన మిషన్ గురించి వివరాలను మొదటి సారి విడుదల చేసారు. చైనా స్టేట్ బ్రాడ్‌కాస్టర్ సిసిటివి విడుదల చేసిన వీడియో ఫుటేజ్ ఆధారంగా చంద్రుడి ఉపరితలం నుండి ప్రకాశవంతమైన కాంతిలో పేలినట్లు చూపించింది. అంతరిక్ష సంస్థ "లిఫ్ట్-ఆఫ్ చేయడానికి ముందు చైనా జెండాను చంద్రుడి ఉపరితలంపై ఎగురవేశారు అని తెలిపారు.

Best Mobiles in India

English summary
Chang’e 5 Lunar Machine Carrying Moon Samples After 1970

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X