Just In
- 4 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 9 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 11 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- News
student: న్యూడ్ వీడియోతో షాక్ అయిన కాలేజ్ విద్యార్థి, బ్లాక్ మెయిల్ చేసిన శాడిస్టు లేడీ, క్లైమాక్స్ లో?
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Movies
Kranti Day 5 Collections దర్శన్ మూవీ స్ట్రాంగ్‌గా.. తొలివారంలోనే లాభాల్లోకి.. ఎంత ప్రాఫిట్ అంటే?
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
భూమికి మహా ప్రమాదాన్ని తెచ్చిపెట్టిన చైనా, శ్మశానపు దిబ్బగా మారనున్న 5 నగరాలు !
స్పేస్ రంగంలో ప్రపంచానికి సవాల్ విసరాలని కలలు కంటున్న చైనా ఇప్పుడు దునియాకి కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. మొత్తం అయిదు నగరాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అంతరిక్ష పరిశోధనల కోసం చైనా పంపిన తియాంగాంగ్-1 ఇపుడు మానవాళికి శత్రువుగా మారింది. ఎనిమిదిన్నర టన్నుల బరువుగల తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ పూర్తిగా నియంత్రణ కోల్పోయింది. సైంటిస్టుల నియంత్రణ కోల్పోయిన ఆ స్పేస్ స్టేషన్ మరికొద్ది నెలల్లోనే భూమిని ఢీకొట్టనుంది. ఇదే విషయాన్ని ఐరోపా శాస్త్రవేత్తలు సైతం ధృవీకరించారు. తియాంగాంగ్-1 స్పేస్ స్టేషన్ వచ్చే జనవరి-మార్చి మధ్యన ఉత్తర, దక్షిణ గోళాల మధ్యలో పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆ స్పేస్ స్టేషన్ తో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయిందని చెప్తున్నారు.దీని వల్ల 5 నగరాలు పెనుప్రమాదంలో ఉన్నాయని చెబుతున్నారు.

మరికొన్ని వారాల్లోనే..
2011లో ఈ తియాంగాంగ్-1ను చైనా లాంచ్ చేసింది. అయితే కొన్నేళ్ల తర్వాత అది నియంత్రణ కోల్పోయింది. 8.5 టన్నుల బరువున్న ఈ స్పేస్ స్టేషన్.. మరికొన్ని వారాల్లోనే భూమిని ఢీకొనే అవకాశం ఉంది.2016 మార్చిలోనే శాస్త్రవేత్తల నియంత్రణ కోల్పోయింది. అప్పటినుంచి ఆకాశంలో పరిభ్రమిస్తూ నెమ్మదిగా భూమివైపు ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది భూ కక్ష్యలోకి ప్రవేశించిందని సైంటిస్టులు చెబుతున్నారు.

ఏప్రిల్ తొలి వారంలో..
అమెరికాకు చెందిన ఏరోస్పేస్ కార్పొరేషన్ ప్రకారం.. ఈ స్పేస్ స్టేషన్ ఏప్రిల్ తొలి వారంలో భూవాతావరణంలోకి ప్రవేశించనుంది. యురోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకారం ఇది మార్చి 24 నుంచి ఏప్రిల్ 19 మధ్య భూమిని ఢీకొట్టబోతున్నది. సౌరశక్తితో నడిచే ఈ స్పేస్ స్టేషన్ సుమారు 11 మీటర్ల పొడుగు ఉంటుంది. ఆస్ట్రోనాట్లకు స్లీప్ స్టేషన్లు కూడా ఉన్నాయి.

భూవాతావరణంలోకి వచ్చిన తర్వాత..
అయితే అది భూవాతావరణంలోకి వచ్చిన తర్వాత స్పేస్‌స్టేషన్ చాలా వరకు మండిపోతుందని, చాలా కొద్ది మొత్తంలో శకలాలు భూమిని ఢీకొంటాయని ఏరోస్పేస్ వెల్లడించింది. అయితే అది ఎక్కడ కూలుతుందన్నదానిపై మాత్రం స్పష్టత రాలేదు.

ఎక్కడ పడొచ్చు
ప్రపంచ ఆర్థిక, వాణిజ్య, దేశ రాజధానులుగా పేరున్న ప్రధాన నగరాలపై పడే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, బీజింగ్, రోమ్, ఇస్తాంబుల్, టోక్యో నగరాలున్నాయి.

స్పేస్‌స్టేషన్‌కు సంబంధించిన శకలాలన్నీ..
కొన్ని వందల కిలోమీటర్ల పరిధిలోనే స్పేస్‌స్టేషన్‌కు సంబంధించిన శకలాలన్నీ కూలుతాయని ఏరోస్పేస్ చెప్పింది. అయితే ఈ స్పేస్‌స్టేషన్‌లో ఎంతో ప్రమాదకరమైన, మండే గుణమున్న హైడ్రజీన్ అనే ఇంధనాన్ని మోసుకొస్తున్నదని ఏరోస్పేస్ హెచ్చరించింది.

43 డిగ్రీ ఉత్తర, 43 డిగ్రీ దక్షిణ అక్షాంశాల మధ్య
ఈ స్పేస్ స్టేషన్ 43 డిగ్రీ ఉత్తర, 43 డిగ్రీ దక్షిణ అక్షాంశాల మధ్య కూలే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఈ లెక్కన ఉత్తర చైనా, మిడిల్ ఈస్ట్, మధ్య ఇటలీ, ఉత్తర స్పెయిన్, అమెరికాలోని ఉత్తర రాష్ర్టాలు, న్యూజిలాండ్‌లలో కూలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పేస్ స్టేషన్‌కు చెందిన శకలాలు అక్కడ నివసిస్తున్న వారిని ఢీకొనే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఏరోస్పేస్ చెప్పింది.

స్వర్గంలోని ప్యాలెస్
చైనా ఈ స్పేస్‌స్టేషన్‌ను లాంచ్ చేసే సమయంలో దీనిని స్వర్గంలోని ప్యాలెస్‌గా అభివర్ణించింది. ఈ స్పేస్‌స్టేషన్‌కు 2012లో చైనా తొలి మహిళా ఆస్ట్రోనాట్ లూ యాంగ్ వెళ్లొచ్చారు. గతంలోనూ ఇలా స్పేస్‌స్టేషన్లు కూలిన ఘటనలు ఉన్నాయి. ఈ ఘటనల్లో కొందరికి గాయాలు కూడా అయ్యాయి.

1991లో..
1991లో సోవియట్ యూనియన్‌కు చెందిన 20 టన్నుల సల్యూట్ 7 స్పేస్ స్టేషన్ భూమిపై కూలింది. అర్జెంటీనాలోని కాపిటాన్ బెర్ముడెజ్ టౌన్‌లో ఈ స్పేస్ స్టేషన్ శకలాలు పడ్డాయి. నాసాకు చెందిన 77 టన్నుల స్కైలాబ్ శకలాలు 1979లో పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ సమీపంలో కూలాయి.

ప్రమాద స్థాయి
తియాంగాంగ్-1 నేల కూలితే.. మన రాజధాని ఢిల్లీ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. జీవరాశి మొత్తం అంతరించిపోగా, భారీ భవనాలు సైతం నేల మట్టమవుతాయి. అయితే తియాంగాంగ్-1 నుంచి భారత్, బ్రిటన్‌లకు పెద్దగా ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు.

చైనా వాదన
తియాంగాంగ్ - 1 కూలిపోవడం వల్ల భూమికి వచ్చే నష్టం పెద్దగా ఏం ఉండదని చైనా చెబుతోంది. ఈ స్పేస్ స్టేషన్ నాలుగున్నర సంవత్సరాలు పనిచేసింది. మరో రెండున్నర ఏళ్లు అదనంగా విధులు నిర్వహించింది. రెండు సార్లు ఆస్ట్రోనాట్లు ఆ స్పేస్ ల్యాబ్‌కు వెళ్లి వచ్చారు.

స్పేస్ స్టేషన్‌లోని కీలక భాగాలన్ని..
ఇప్పటికే స్పేస్ స్టేషన్‌లోని కీలక భాగాలన్ని అగ్నికి ఆహుతి అయ్యాయని.. స్పేస్ ఇంజినీరింగ్ డిప్యూటీ డైరెక్టర్ వూ పింగ్ అంటున్నారు. భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలోనే.. స్పేస్ స్టేషన్ మండిపోతుందని.. ఆయన చెబుతున్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470