Home
Scitech

త్వరలో ప్రపంచమంతా ఫ్రీ వైఫై

మనలో చాలా మంది పబ్లిక్ వై-ఫై పట్ల ఆసక్తి చూపుతుంటారు. ఎందుకుంటే ఇక్కడ ఇంటర్నెట్ ఉచితం కాబట్టి.

మనలో చాలా మంది పబ్లిక్ వైఫై పట్ల ఆసక్తి చూపుతుంటారు. ఎందుకుంటే ఇక్కడ ఇంటర్నెట్ ఉచితం కాబట్టి. షాపింగ్ మాల్స్, కాఫీ షాప్స్, ఎయిర్ పోర్ట్స్, రైల్వే స్టేషన్స్ ఇలా అనేక ప్రాంతాల్లో ఉచిత వై-ఫై హాట్‌స్పాట్‌లు అందుబాటులో ఉన్నాయి.అయితే కేవలం అలాంటి చోట్లే కాకుండా ఎక్కడుంటే అక్కడ ఫ్రీ వైఫై దొరికే ఛాన్స్ ఉంటే ఎవరైనా ఎందుకు కాదంటారు. చైనాకు చెందిన లింక్‌స్యూర్ నెట్‌వర్క్ సంస్థ ఇప్పుడు ఇదే ప్రయోగం చేయబోతోంది. సుమారు రూ.3000 కోట్లు ఖర్చుపెట్టి ప్రపంచమంతా ఫ్రీ వైఫై ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుంది.ఇందుకోసం 2026 నాటికి 272 ఉపగ్రహాలను ప్రయోగించే దిశగా అడుగులేస్తోంది.

 లింక్‌స్యూర్ నెట్‌వర్క్ సంస్థ...

లింక్‌స్యూర్ నెట్‌వర్క్ సంస్థ...

2013లో షాంఘాయ్‌ లో ఏర్పాటైన లింక్‌స్యూర్ నెట్‌వర్క్ అనే సంస్థ ప్రపంచమంతా ఉచితంగా వై-ఫై అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసమై తొలి శాటిలైట్‌ను మంగళవారం ఆవిష్కరించింది.

ఈ ఉపగ్రహాన్ని....

ఈ ఉపగ్రహాన్ని....

ఈ ఉపగ్రహాన్ని చైనాలోని గన్సూ ప్రావిన్స్‌లో ఉన్న జియుక్వాన్ శాటిలైట్ లాంచింగ్ సెంటర్‌ నుంచి వచ్చే ఏడాది ప్రయోగించనున్నారు. 2020 నాటికి ఇలాంటివి పది ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తారు.

ఫోన్ సిగ్నల్ అందని మారుమూల ప్రాంతాల్లోనూ....

ఫోన్ సిగ్నల్ అందని మారుమూల ప్రాంతాల్లోనూ....

క్రమంగా ఈ ఉపగ్రహాల సంఖ్యను పెంచుకుంటూపోయి.2026 నాటికి 272 శాటిలైట్లను ప్రయోగిస్తారు. వీటి ద్వారా ఫోన్ సిగ్నల్ అందని మారుమూల ప్రాంతాల్లోనూ ప్రజలు ఇంటర్నెట్ సేవలను పొందొచ్చు.

 గూగుల్‌, స్పేస్‌-ఎక్స్‌ సంస్థలు....

గూగుల్‌, స్పేస్‌-ఎక్స్‌ సంస్థలు....

ఇప్పటికే గూగుల్‌, స్పేస్‌-ఎక్స్‌ సంస్థలు ఉపగ్రహాల ద్వారా ఉచిత వై-ఫై ఇచ్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి. లింక్‌ష్యూర్‌ వాటికి పోటీ ఇవ్వనుంది.

 

 

Best Mobiles in India

English summary
Chinese Company Unveils First Satellite for Free Global Wi-Fi Service.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X