కూలిపోతున్న చైనా స్వర్గం, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అంతా సస్పెన్స్ !

Written By:

చైనాకు తొలిసారిగా భారీ దెబ్బ తగలబోతోంది. ఆ దేశానికి చెందిన స్వర్గం ఏ క్షణమైనా కూలిపోతోంది. ఇంతకీ ఏమిటా ఆ స్వర్గం అనుకుంటున్నారా...అదేనండి చైనాకు చెందిన అంతరిక్ష లాబోరేటరి టియాంగోంగ్ 1.. భూమిని ఢీకొట్టేందుకు వాయువేగంతో ఇది దూసుకొస్తోందని ఎప్పుడు, ఎక్కడ, ఎలా పడిపోతుందో తెలియని అయోమయ స్థితిలో శూన్యంలో గిరగిరా తిరిగేస్తోందని, ఏ క్షణమైనా కూలిపోవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తర కొరియాపై నిప్పులు చెరిగిన అమెరికా, ఆ దాడి కిమ్ పనే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టియాంగోంగ్-1

టియాంగోంగ్-1 అంటే చైనా భాషలో స్వర్గ భవనం లేక ఇంద్రభవనం అని పిలుస్తారు. ఇది చైనాకు చెందిన ఓ ఉపగ్రహం. భవిష్యత్తులో చైనా సొంతంగా అంతరిక్షంలో పరిశోధన సంస్థను ఏర్పాటు చేసేందుకు ట్రయల్‌గా ఈ తాత్కాలిక స్పేస్‌ల్యాబ్‌ను పంపింది.

2011లో ..

2011లో చైనా ఈ టియాంగోంగ్-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. కాగా దీనితో చైనా అంతరిక్ష పరిశోధన సంస్థతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి

తాత్కాలిక స్పేస్ ల్యాబ్‌గా ..

12 మీటర్ల పొడవు, 3.3 మీటర్ల వెడల్పు, 8.5 టన్నుల భారీ బరువున్న టియాంగోంగ్-1ను తాత్కాలిక స్పేస్ ల్యాబ్‌గా అంతరిక్షంలోకి పంపింది.

2013 జూన్‌లో..

చైనా 2013 జూన్‌లో ఈ స్పేస్ ల్యాబ్‌కు లియూ యాంగ్ అనే మహిళా అంతరిక్ష శాస్త్రవేత్త సహా ముగ్గురిని పంపించింది. స్పేస్ ల్యాబ్‌ నుంచి వారు సురక్షితంగా భూమికి తిరిగివచ్చారు కూడా.

గత ఏడాది సెప్టెంబర్..

అయితే గత ఏడాది సెప్టెంబర్ నుంచి అది పనిచేయడం ఆగిపోయింది. తద్వారా భూమితో దానికి సంబంధాలు తెగిపోయాయి.

భూమిని ఢీకొట్టి కూలిపోయే ప్రమాదం ఉందని ..

ఈ ఏడాది మేలో 2017 అక్టోబరు-2018 ఏప్రిల్ మధ్యలో ఎప్పుడైనా అది భూమిని ఢీకొట్టి కూలిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌కు చైనా అధికారులు వివరించారు.

ఇప్పటికైతే ఆ ప్రమాదమేదీ..

వారు చెప్పినట్టు ఇప్పటికైతే ఆ ప్రమాదమేదీ కనిపించనప్పటికీ.. భూ కక్ష్యకు 305 కిలోమీటర్ల ఎత్తులోనే టియాంగోంగ్-1 చక్కర్లు కొడుతోంది.

వచ్చే ఏడాది మార్చిలోపు..

France's space agency పరిశోధకులు మాత్రం ఇది భూమిని ఖచ్చితంగా ఢీ కొట్టే అవకాశం ఉందని ఇది వచ్చే ఏడాది మార్చిలోపు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో ఈ ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

చైనా శాస్త్రవేత్తలు..

కాగా చైనా శాస్త్రవేత్తలు ఈ ఉపగ్రహంతో ఎటువంటి ముప్పేమి ఉండదని పుకార్లను నమ్మవద్దంటూ కొట్టిపారేస్తున్నారు. స్పేస్ ల్యాబ్ దాదాపుగా ‘పై' వాతావరణంలోనే కాలిపోతుందని, భూమిపైకి వచ్చేటప్పటికి దాని ప్రభావం తక్కువగానే ఉంటుందని చైనా హామీ ఇస్తోంది.

స్కైల్యాబ్‌తో పోలిస్తే చాలా చిన్నదని..

2012, 2015లో కూలిపోయిన వాటి శకలాల పరిమాణంలోనే చైనా స్పేస్ ల్యాబ్ శకలాలు ఉంటాయని, నాసా స్కైల్యాబ్‌తో పోలిస్తే చాలా చిన్నదని అన్నారు. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అలా అని దాని నియంత్రణను పట్టించుకోకుండా ఉండొద్దని చెబుతున్నారు.

ముందస్తు హెచ్చరికలు..

టియాంగోంగ్-1ను అనుక్షణం పర్యవేక్షిస్తూనే ఉన్నామని, అది భూమిపైకి వచ్చే సందర్భంలో సమయానుగుణంగా ‘ముందస్తు హెచ్చరికలు' జారీ చేస్తామని చైనా ప్రకటించింది.

స్కైల్యాబ్, మిర్

కాగా టియాంగోంగ్-1కు ముందు నాసా, రష్యాలు పంపిన స్పేస్ స్టేషన్లూ భూమిపై కూలిపోయాయి. 77 టన్నుల బరువుండే నాసా స్కైల్యాబ్ 1979లో కూలిపోయింది. జన సంచారం లేని పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతంలో అది కూలిపోవడంతో పెద్ద నష్టమేమీ సంభవించలేదు.

రష్యాకు చెందిన 130 టన్నుల మిర్ స్పేస్ స్టేషన్..

ఇక, రష్యాకు చెందిన 130 టన్నుల మిర్ స్పేస్ స్టేషన్ 2001లో సముద్రంలో కూలిపోయింది. పెద్ద ప్రమాదం తప్పిపోవడంతో జనాలు ఊపిరిపీల్చుకున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WHEN WILL CHINA'S ROGUE SPACE STATION TIANGONG-1 FINALLY CRASH TO EARTH? NEW ESTIMATE NARROWS WINDOW More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot