చైనా సంచలనం, ఒకరి తల మరొకరి శరీరానికి!

వైద్య శాస్త్రంలో మరో అద్భుతాని చైనా తెరలేపిందా..? అవుననే అంటోంది ఇంటర్నెట్ ప్రపంచం. ప్రపంచపు మొట్టమొదటి బాడీ ట్రాన్స్‌ప్లాంట్ (శరీర మార్పిడి) ఆపరేషన్‌కు చైనా సిద్ధమవుతోంది. బాడీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ అనేది పూర్తిగా అసాధ్యమని, వెన్నుపూసలోని నరాలను కలపడం ఎవరికి సాధ్యమయ్యే పని కాదని వైద్యులు అంటున్నారు. ఈ కథనానికి సంబంధించిన మరిన్ని వివారాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : మీ ఫోన్ కోసం సింపుల్ రిపేరింగ్ టిప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త ప్రయోగం, ఒకరి తల మరొకరి శరీరానికి

ఎవరెన్ని హెచ్చరికలు చేసినప్పటికి తాను ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి తీరుతానని చైనాలోని హార్బిన్‌ మెడికల్‌ యూనివర్శిటీకి చెందిన డాక్టర్‌ రెని జియావోపింగ్‌ అంటున్నారు.

కొత్త ప్రయోగం, ఒకరి తల మరొకరి శరీరానికి

ఆపరేషన్‌కు అవసరమైన నిపుణుల బృందాన్ని తాను ఏర్పాటు చేసుకుంటున్నానని, అన్నీ సిద్ధమయ్యాక ఆపరేషన్‌ జరిగి తీరుతుందని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

కొత్త ప్రయోగం, ఒకరి తల మరొకరి శరీరానికి

అమెరికాలో వైద్యునిగా పని చేసిన రెన్ 1999లో అమెరికాలో జరిగిన ప్రపంచ తొలి చేతి మార్పిడి ఆపరేషన్‌లో అసిస్టెంట్‌గా వ్యవహరించారు.

కొత్త ప్రయోగం, ఒకరి తల మరొకరి శరీరానికి

రెండు శరీరాల తలలను వేరుచేసి ఒకదానికొకటి మెడ వద్ద కలిపి ఆపరేషన్‌ చేస్తానని, తల నిలబడేందుకు ఓ ఐరన్‌ ప్లేట్‌ను అమరుస్తానని డాక్టర్‌ రెన్‌ చెబుతున్నారు.

కొత్త ప్రయోగం, ఒకరి తల మరొకరి శరీరానికి

ఈ ఆపరేషన్ పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికి డాక్టర్ రెన్ మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు. యన ఇప్పటికే ఎలుకలపై ఈ ప్రయోగం నిర్వహించారు. అవి ఒక్కరోజు మాత్రమే బతికాయిని తెలుస్తోంది.

కొత్త ప్రయోగం, ఒకరి తల మరొకరి శరీరానికి

డాక్టర్ రెన్ చేస్తున్న ప్రాణాంతక శస్త్ర చికిత్స కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వ్యక్తులో వాంగ్‌ ఒకరు. హార్బిన్‌ ఆస్పత్రిలో ఈ అద్భుత ఆపరేషన్‌ కోసం వాంగ్‌ వేయి కన్నులతో వాంగ్ ఎదురు చూస్తున్నారు.

కొత్త ప్రయోగం, ఒకరి తల మరొకరి శరీరానికి

మల్లయుద్ధం చేస్తూ తీవ్రంగా గాయపడని వాంగ్ కు పక్షవాతం వచ్చి మెడ నుంచి కాలి బొటన వేలి వరకు శరీరమంతా చచ్చుపడిపోయింది.

కొత్త ప్రయోగం, ఒకరి తల మరొకరి శరీరానికి

ఈ ఆపరేషన్ విజయవంతగా పూర్తి అయితే తాను తిరిగి ఎప్పటిలాగే లేచి నడవగలనని వాంగ్ ఆశిస్తున్నాడు.

కొత్త ప్రయోగం, ఒకరి తల మరొకరి శరీరానికి

చైనా చేపడుతోన్న ఈ బాడీ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ మాట వినగానే ఇదేమిటంటూ యావత్‌ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇలాంటి ఆపరేషన్‌కు సిద్ధ పడడం ఎంతో ప్రమాదకరమని అమెరికాలోని ప్రముఖ వైద్యులు వ్యాఖ్యానిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
A Chinese Surgeon Plans to Perform the worlds First Full Body Transplant. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot