Home
Scitech

చంద్రుని మీద మొలకెత్తిన పత్తి విత్తనం, షాక్‌లో శాస్త్రవేత్తలు

అంతర్జాతీయంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న చైనా ఇప్పుడు మరో సంచలనపు వార్తతో పతాక శీర్షికలకు ఎక్కింది. ఈ దేశం స్పేస్ రంగంలో అన్ని దేశాలకు సవాల్ విసురుతూ విస్తృత పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

అంతర్జాతీయంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న చైనా ఇప్పుడు మరో సంచలనపు వార్తతో పతాక శీర్షికలకు ఎక్కింది. ఈ దేశం స్పేస్ రంగంలో అన్ని దేశాలకు సవాల్ విసురుతూ విస్తృత పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అంతరిక్షపై పరిశోధనల్లో ఓ అడుగు ముందుకేసింది. చంద్రునిపై ఏకంగా పత్తి విత్తనాన్ని మొలిపించింది. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకెళితే..

చాంగీ-4

చాంగీ-4

చంద్రుడి ఆవలి వైపున, భూమిని ఎన్నడూ చూడని 'అంధకార' ప్రదేశంలో ఈ నెల 3న జయవంతంగా దిగిందని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అది ప్రయాణ సమయంలో ఆ ప్రాంతంలోని పరిస్థితులను విశ్లేషించేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను చాంగీ-4 వాహనం తీసుకుని వెళ్లింది.

జీవసంబంధమైన పరిశోధనలు

జీవసంబంధమైన పరిశోధనలు

అంతరిక్షంలో మరింత విస్తృతమైన పరిశోధనలు జరిపేందుకు జీవసంబంధమైన ఉత్పత్తులైన పత్తి విత్తనాలను, 3 కిలోల బరువున్న బంగాళాదుంపలు, అరబిడాప్పిస్ అనే పూల విత్తనాలు, యీస్ట్, పట్టుపురుగు గుడ్లను కూడా ఆ వాహనంలో చైనా శాస్త్రవేత్తలు పంపించారు.

పత్తి విత్తనం మొలకెత్తింది

పత్తి విత్తనం మొలకెత్తింది

అయితే ఇక్కడి నుంచి చంద్రుని మీదకు తీసుకెళ్లిన విత్తనాల్లో పత్తి విత్తనం మొలకెత్తింది.పత్తి విత్తనం మొలకెత్తిన చిత్రాన్ని చైనా అధికార కమ్యూనిస్టు పార్టీకి చెందిన 'పీపుల్స్ డైలీ' పత్రిక ట్వీట్ చేసింది. చంద్రుని మీద మానవుడు చేపట్టిన మొట్టమొదటి జీవ సంబంధమైన ప్రయోగం విజయవంతమైందని పేర్కొంది.

ఇదొక వండర్

ఇదొక వండర్

వ్యోమగాములు భూమి మీద నుంచి ఆహార పదార్థాలు తీసుకెళ్లాల్సిన పనిలేకుండా, అంతరిక్షంలోనే పండించుకునే దిశగా ఓ అడుగు పడిందని ఇదొక వండర్ అని శాస్త్రవేత్తలు అంటున్నారు.ఈ తాజా పరిశోధన మున్ముందు అంగాకర గ్రహం మీద కూడా ఇలాంటి ప్రయోగాలు చేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇదే తొలిసారి.

ఇదే తొలిసారి.

కాగా చంద్రుని మీద ఇలాంటి జీవ సంబంధమైన పరిణామం చూడటం ఇదే తొలిసారి. దీంతో అంతరిక్షంలో మరింత విస్తృతమైన పరిశోధనలు జరిపేందుకు కీలక అడుగు పడినట్లేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

 

 

చంద్రుని మీద విత్తనాలు మొలకెత్తడం

చంద్రుని మీద విత్తనాలు మొలకెత్తడం

గతంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మొక్కలు పెరిగాయి. ఆ చిత్రాలు బయటకు వచ్చిన సంగతి అందరికీ విదితమే. కానీ, చంద్రుని మీద విత్తనాలు మొలకెత్తడం మాత్రం ఇదే తొలిసారి.చంద్రుని మీద వ్యోమగాములు తమకు కావాల్సిన పంటలు పండించుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్న విషయం ఈ పత్తి విత్తనం మొలకెత్తడం ద్వారా రుజువయిందని వారు చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
One giant leaf for mankind! China has started growing COTTON on the far side of the moon (and potatoes are next!): Pioneering mission to the lunar surface successfully germinates seeds for the FIRST TIME More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X