మరో విజయం దిశగా ఇస్రో, ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు !

Written By:

వరుస సక్సెస్‌లతో సత్తా చాటుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమౌతుంది. పీఎస్‌ఎల్‌వీ సీ-39 రాకెట్‌ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1 హెచ్‌ (రీప్లేస్‌మెంట్‌) ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు సిద్ధమైంది.

మామ్ ఏడాది పయనంలో మరచిపోలేని చిత్రాలెన్నో..

మరో విజయం దిశగా ఇస్రో, ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు !

సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుండి గురువారం రాత్రి 7 గంటలకు ఈ కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం అయింది. పీఎస్‌ఎల్‌వీ సీ-39 ద్వారా 1,425 కిలోల బరువు కలిగిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1 హెచ్‌ (రీప్లేస్‌మెంట్‌) ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపించనున్నారు.

మహాభారత యుధ్దంలో ఆటంబాంబు పేలిందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1969లో సరిగ్గా ఇండిపెండెన్స్ డే రోజున

1969లో సరిగ్గా ఇండిపెండెన్స్ డే రోజున ఇస్రో పురుడుపోసుకుంది. దీనికి పురుడుపోసిన వారు విక్రం సారాభాయి.

SLV-3

SLV-3 మొట్టమొదటి ఇండియా స్వదేశీ ఉపగ్రహ ప్రయోగం. దీన్ని దివంగత మాజీ రాష్ర్టపతి ఎపిజె అబ్దుల్ కలాం సారధ్యంలో ప్రయోగించారు. కలాం ప్రాజెక్ట్ డైరక్టర్ గా ఉన్నారు.

నలభై సంవత్సరాల్లో ఇస్రో పెట్టిన ఖర్చు

గత నలభై సంవత్సరాల్లో ఇస్రో పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా.. అది కేవలం నాసా ఒక్క సంవత్సరంలో ఖర్చుపెట్టిన దాంట్లో సగానికి సమానం.

ఇస్రో బడ్జెట్ కేవలం 0.34 శాతం

కేంద్ర ప్రభుత్వ వ్యయంలో ఇస్రో బడ్జెట్ కేవలం 0.34 శాతం మాత్రమే. ఇది స్థూల జాతీయోత్పత్తి లో (జిడిపి) శాతం 0.08 ఉంది.

భువన్

భువన్ ను ఇస్రో డెవలప్ చేస్తోంది. ఇది వెబ్ బేస్ డ్ 3డీ శాటిలైట్ పరికరం. ఇది ఇండియా ఇన్ కార్నియేషన్ ను గూగుల్ ఎర్త్ లో చూపిస్తుంది.

 

 

13 చోట్ల కేంద్రాలు

ఇస్రోకి ఇండియాలో మొత్తం 13 చోట్ల కేంద్రాలు ఉన్నాయి. ఇస్రోకి ఇండియాలో మొత్తం 13 చోట్ల కేంద్రాలు ఉన్నాయి.

అత్యంత తక్కువ ఖర్చుతో

ఇస్రో మార్ష్ మిషన్ అత్యంత తక్కువ ఖర్చుతో నింగిలోకి దూసుకెళ్లింది. దీనికయిన ఖర్చు కేవలం రూ. 450 కోట్లు. అంటే ప్రతి కిలోమీటరకు 12 రూపాయలు

తొలి ప్రయత్నంలోనే

తొలి ప్రయత్నంలోనే మార్స్ మీదకు విజయవంతంగా చేరగలిగిన దేశాల్లో ఇండియానే ప్రధమస్థానం ఆక్రమించింది.

అత్యధిక మంది బ్యాచ్‌లర్స్

అత్యధిక మంది బ్యాచ్‌లర్స్ ఉన్న సైంటిస్ట్ కేంద్రాలలో ఇస్రోనే ముందుంది.

మొత్తం 59 ప్రయోగాలు

ఇస్రో మొత్తం 59 ప్రయోగాలు చేపట్టింది... మన దేశానికి చెందిన 84 ఉపగ్రహాలు, 79 విదేశీ ఉపగ్రహాలనూ విజయవంతంగా నింగిలోకి పంపింది.

తుంబ రాకెట్‌

1962లో కేరళలోని తుంబ రాకెట్‌ ప్రయోగ కేంద్రంతో అంతరిక్ష పరిశోధనలో తొలి అడుగు పడింది. ముందుగా, వాతావరణ పరిస్థితుల అధ్యయనానికి ఉపకరించే మూడు అడుగుల చిన్న సౌండ్‌ రాకెట్లను- ఆర్‌హెచ్‌-75ను అంతరిక్షానికి పంపింది.

భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్ట

భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్ట. 1975లో ఆర్యభట్టను రష్యా సాయంతో భారత్‌ నింగిలోకి చేరవేసింది. ఆ తర్వాత 1979లో శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ విఫలమైంది. 1980లో ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ రోహిణిని ఇస్రో విజయవంతంగా గగనానికి చేర్చింది.

శాటిలైట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ టెలివిజన్‌ ఎక్స్‌పరిమెంట్‌

1975..76లో 'శాటిలైట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ టెలివిజన్‌ ఎక్స్‌పరిమెంట్‌' ను ప్రయోగించింది. సమాచార ఉపగ్రహాన్ని విద్యా బోధన సాధనంగా ఎలా ఉపయోగించుకోవచ్చో ఇది నిరూపించింది.

1979లో ఆపిల్‌ సమాచార ఉపగ్రహం

ఇస్రో 1979లో ఆపిల్‌ సమాచార ఉపగ్రహాన్ని నింగికి పంపింది. 1982-90 మధ్య విదేశీ రాకెట్ల సాయంతో ఇన్సాట్‌-1ను అంతరిక్షానికి పంపింది. ఈ ఉపగ్రహం ఆకాశవాణి, దూరదర్శన్‌ ద్వారా వినోదం, విజ్ఞానాలతో పాటు విద్యావ్యాప్తికి దోహదపడింది.

2013లో అంతరిక్షంలోకి మంగళ్‌యాన్‌

చంద్రయాన్‌, మంగళ్‌యాన్‌ తదితర ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకూ ఇస్రో శ్రీకారం చుట్టింది. 2013లో ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన మంగళ్‌యాన్‌ను అంతరిక్షంలోకి పంపింది. అంగారకగ్రహంపై లోతైన అధ్యయనం చేయడానికి మంగళ్‌యాన్‌ టూను 2021...22లో ప్రారంభించనుంది. అందులో భాగంగా అరుణ గ్రహ ఉపరితలంపైకి ఒక రోవర్‌ను దించే వీలుంది. రెండో యాత్రలో మాత్రం ఫ్రాన్స్‌ కూడా భాగమవుతోంది.

శుక్రగ్రహంపై యాత్రకు దృష్టి

మంగళ్‌యాన్‌ యాత్ర సఫలం కావడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శుక్రగ్రహంపై యాత్రకు దృష్టి సారించింది.

చంద్రయాన్‌-2

చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చేఏడాది మొదట్లో గానీ చేపట్టే ఆలోచన ఉంది.

వాతావరణ్‌-1 పేరుతో

పర్యావరణంలో వచ్చే మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌, సముద్ర నీటి మట్టాల్లో తేడాలు, గ్రీన్‌హౌస్‌ వాయువులు... తదితర అంశాల అధ్యయనానికి వాతావరణ్‌-1 పేరుతో త్వరలోనే ఓ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది.

జిఎస్‌ఎల్‌వి మార్క్‌ 3

4 టన్నులు అంతకన్నా ఎక్కువ బరువైన ఉపగ్రహాలను పంపేందుకు జిఎస్‌ఎల్‌వి మార్క్‌ 3 ని శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. ఇందులో, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను వినియోగించనున్నారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే హైత్రోపుట్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపేందుకు ఇస్రో ప్లాన్‌ చేస్తోంది. దీని బరువు 10 టన్నులు.

75 విదేశీ ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి

ఇస్రో ప్రయోగాలకే పరిమితం కాలేదు. ఆర్థికంగా భారత్‌కు కోట్లాది రూపాయల విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతోంది. ఇప్పటి వరకూ 75 విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశ పెట్టింది.

మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాలు.. వ్యోమోగాముల ఎంపిక ప్రక్రియ

ఇప్పటివరకు మానవ రహిత ఉపగ్రహాలను పంపిన ఇస్రో...ఇకపై మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాల కోసం వ్యోమోగాముల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టింది. ఇస్రో-ఎయిర్‌ఫోర్స్‌ సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం సక్సెస్‌ అయితే అమెరికా, రష్యా, చైనా సరసన భారత్‌ కూడా చేరనుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
India to launch eighth desi navigation satellite system IRNSS-1H Read More At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot