ఈ రాళ్లు తెల్లారేసరికి మరో చోటకు వెళతాయి, మిస్టరీగా మారిన మృత్యు లోయ

|

అదొక ఎడారి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎవరూ మనుషులు ఉండరు. అక్కడ కుప్పలు కుప్పలుగా రాళ్లు మాత్రం ఉంటాయి. మరి రాళ్లు అక్కడ ఉండటం ఏం వింతని ఆశ్చర్యపోతున్నారా..అక్కడే మిస్టరీ దాగి ఉంది. అవన్నీ కదిలే రాళ్లు. ఈ రోజు ఇక్కడ ఉన్న రాయి తెల్లారేసరికి వేరోచోట ఉంటుంది. మరి మనుషులే లేని చోట ఆ రాళ్లు ఎలా కదిలాయి. అంత నిర్మానుష్య ఎడారిలో ఆ రాళ్లు ఎలా కదులుతున్నాయి. కదిలే రాళ్ల మిస్టరీపై స్పెషల్ స్టోరీ.

Read more: ఆ వేదభూమిలో దాగిన వేల ఏళ్ల రహస్యాలను బయటపెట్టిన నాసా

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

అమెరికాలోని మిడిల్‌ కాలిఫోర్నియాలోని పానామింట్‌ పర్వతాలకు సమీపంలో మృత్యులోయ అనే ప్రదేశం ఉంది. అక్కడ జనసంచారం ఉండదు కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. అది ఓ ఎడారి లాంటి ప్రదేశం.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

అక్కడ రాళ్లు జీవం ఉన్న ప్రాణుల్లా వాటంతట అవే కదులుతాయి. ఈ రాళ్లనే సెయిలింగ్‌ స్టోన్స్‌ అనీ, స్లైడింగ్‌ రాక్స్‌ అనీ, మూవింగ్‌ రాక్స్‌ అనీ ఇలా ఎవరికి తోచిన పేర్లు వారు పెడుతూ వచ్చారు.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు
 
మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

అక్కడ ఎడారిలో ఎండిన సరస్సులో బరువైన రాతిశిలలు కదులుతూ ఉంటాయి. ఒక్కో రాతిశిల బరువు 700 పౌండ్లు ఉంటుంది.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మరి అంత బరువున్న రాయి ఉన్న ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి ఎలా కదులుతుందనేది తెలియక సైంటిస్టులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

ఈ రాళ్లు కదిలినట్లుగా మనకు అక్కడ ఈజీగా తెలుస్తుంది. అవి ఎంత దూరం ప్రయాణించాయో ఆ ప్రయాణించిన మేరకు చారలు స్పష్టంగా కనిపిస్తాయి అక్కడ.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

చార చివరలో రాయి ఆగి ఉంటుంది. ఆ చారల ద్వారా ఆ రాయి ఎక్కడ నుంచి ఎక్కడికి దొర్లుకుంటూ వచ్చిందనే విషయం తెలుసుకోవచ్చు. ప్రదేశాన్ని అందరూ రేస్‌ ట్రాక్‌ ప్లే అంటూ వ్యవహరిస్తారు.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

అయితే రాళ్లు రోజూ కదులుతూ ఉంటాయి అనుకుంటే పొరబాటే. రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ రాళ్లు కదలడం లేదా దొర్లడం జరుగుతూ ఉంటుంది.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

అదీ సమాంతరంగా ఒక రాయి కదలడం మొదలుపెడితే ఆ రాతితో పాటే మరో రాయి తన దిశను మార్చుకుంటుంది. దిశ మార్చుకున్న రాయి, సమాంతర రాయి రెండూ ఒకే బరువుతో ఉండడం ఇంకో విశేషం.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

దాదాపు తొంభై సంవత్సరాల క్రితం పరిశోధకులు ఈ రాళ్ల కదలికలను మొదటిసారి గుర్తించారు. ఇప్పటికి డెబ్బై ఏళ్లుగా వీటి కదలికలపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.ఈ పరిశోధనలు చాలా వరకు సఫలీకృతం కాలేదు.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

పరిశోధనలు జరుగుతున్నంతసేపూ ఒక్క అంగుళం కూడా కదలని రాళ్లు ఆ పరిశోధనలు అయిపోయి వారంతా తిరిగి వెళ్లిపోతున్నప్పుడు కదిలాయి. కానీ వీటిని వీడియోలో బంధించలేక పోయారు. ఫోటోలు మాత్రం తీయగలిగారు.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

1955లో, 1972లో బాండ్‌ షార్ప్‌, డ్విట్‌ కేరే అనే శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. ఆయా ప్రాంతాల్లో అప్పటికే 30 రాతిశిలల్లో కదలిక ఉందని గ్రహించారు. ఏడేళ్ల సుదీర్ఘ కాలంలో పరిశోధనల్లో కొంత పురోగతి కనిపించినప్పటికీ సంగతులేవీ సరిగ్గా తెలియలేదు.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

1972లో బాబ్ షార్ప్ అనే పరిశోధకుడు డెత్ వేలీలోని ముప్పై రాళ్లకి పేర్లుపెట్టి వాటి బరువు, చుట్టుకొలతలని తీసుకున్నాడు. వాటి స్థానాలని కూడా మార్చాడు.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

కొన్ని మాసాల తర్వాత వెళ్లి చూస్తే వాటిలోని ఇరవై ఐదు రాళ్లు రెండు వందలనుంచి రెండు వందల పన్నెండు అడుగుల దూరం కదిలినట్టు తెలిసింది.మేరీ ఏన్ అనే పేరుపెట్టిన రాయి ఎక్కువ దూరం, అంటే రెండు వందల పన్నండు అడుగుల దూరం వెళ్లింది. అవన్నీ కేవలం వేసవిలోనే కదిలాయి.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

1993లో జరిగిన మరో పరిశోధనలో కరెన్ అనే రాయి అరమైలు వరకు ప్రయాణించిందని కనుగొన్నారు. ఆ రాళ్లల్లో వాటిని కదిలించే శక్తి కానీ జీవి కాని పరిశోధకులకి కనపడలేదు.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

ఇక పరిశోధనలో తేల్చింది ఏంటంటే... ఆ ప్రాంతం కొండల మధ్యలో ఉంటుంది. వర్షాకాలంలో అక్కడ భారీగా వర్షాలు కురుస్తాయి. కొండల వాలు వెంబడి వర్షం నీరు జారి మైదానాన్ని ముంచెత్తుతుంది. ఆ ప్రాంతం చిన్నపాటి సరస్సులా మారుతుంది.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

ఎండాకాలంలో నీరు పూర్తిగా ఇంకిపోతుంది. ఎండిన నేలలో బీటలు పడతాయి. అప్పుడు ఆ నేల మీద పూర్తిగా తడి ఆరని పరిస్థితుల్లో నేల చిత్తడిగా ఉంటుంది. ఈ స్థితిలో రాళ్లకి నేలకి మద్య రాపిడి కాస్త తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో గాలి ప్రభావం వల్ల రాళ్లు మరికొంచెం వేగంగా కదిలే అవకాశం ఉందని తేల్చారు.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

ఆ ప్రాంతంలో గమనించదగిన విషయం ఏంటంటే అక్కడ బలమైన ఈదురు గాలులు వీస్తాయి. అక్కడి గాలులు సామాన్యంగా నైరుతి దిశ నుంచి ఈశాన్యదిశ వైపు వీస్తుంటాయి. విచిత్రమేమిటంటే, కదిలే రాళ్ల దిశ కూడా ఈ క్రమంలోనే ఉంటుంది. ఈ విషయమై ఓ వైజ్ఞానిక బృందం పరిశోధించింది.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మంచు, గాలి రాళ్ల కదలికకు కారణమనీ, వేసవి కాలంలో వీటిలో కదలికలు లేవనీ, శీతాకాలంలో మాత్రమే కదులుతున్నాయని తేల్చారు. ఆయా కాలాల్లో వీచే గాలులు,శీతోష్ణ స్థితిగతులు ఇవన్నీ రాతి కదలికలపై ప్రభావాన్ని చూపుతున్నాయని కనుగొన్నారు.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మరొక శాస్త్రవేత్త పీ మెస్సినా ఇంకో రకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఆమె రేస్ట్రాక్ ప్లాయా వాతావరణ పరిస్థితుల ప్రభావం ద్వారా రాళ్లు కదిలే అవకాశం ఉందని తెలిపింది.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

ఆమె ప్రయోగంలో భాగంగా ఓ చదునైన ఐసు గడ్డ తీసుకుని దాని మీద ఇందాక తయారుచేసిన ఎండిన మట్టి పలకని పెట్టారు. ఐసు ప్రభావం వల్ల ఆ పలక తడి అయ్యింది. అంతేకాక దాని మీద కూడా పలచని మంచు పొర ఏర్పడింది. ఈ సారి ఈ సరంజామాని వాయుసొరంగంలో పెట్టి వాయువేగాన్ని క్రమంగా పెంచారు.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

70-90 mph వేగం వరకు రాగానే రాళ్లు నెమ్మదిగా, హుందాగా కింద మెత్తని బురదలో జాడ వేసుకుంటూ ముందుకి సాగాయి. నడక నేర్చిన రాళ్ల గుట్టు ఆ విధంగా రట్టయ్యింది.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

ఇంకా ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే - పరిశోధనల్లో భాగంగా ఆయా రాతి శిలలపై మానవ బలాన్ని ప్రయోగించినప్పటికీ అవి కదలకపోవటం.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

ఈ రాళ్లు సంవత్సరంలో నాలుగుసార్లు అయినా కదులుతాయి. ప్రాణం లేని ఈ రాళ్లు ఎందుకు కదులుతున్నాయో తెలుసుకునే పరిశోధనలు 1948 నుంచి కొనసాగుతున్నాయి.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

అయితే ఈ రాళ్లు కదులుతుండగా ఇంతవరకూ ఎవరూ చూడలేదు. ఇకపైన జరిగే పరిశోధనల్లో అయినా ఈ కదిలే రాళ్ల వెనక రహస్యం తెలుస్తుందేమో..చూడాలి.

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

మృత్యు ఎడారిలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Did we solve the mystery of the sailing stones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X