Home
Scitech

ఎలాన్ మస్క్‌ బోరింగ్ కంపెనీ మరో సంచలనం..

ఎలాన్ మస్క్‌కు చెందిన ‘ద బోరింగ్ కంపెనీ’ (The Boring Company) సరికొత్త ఇన్నోవేషన్‌కు తెరలేపింది.

By Bommu Sivanjaneyulu

ఎలాన్ మస్క్‌కు చెందిన 'ద బోరింగ్ కంపెనీ’ (The Boring Company) సరికొత్త ఇన్నోవేషన్‌కు తెరలేపింది. తన కాంప్లెక్స్ మెచీన్లను ఎక్స్‌బాక్స్ గేమింగ్ కంట్రోలర్‌తో కంట్రోల్ చేస్తూ ప్రపంచాన్ని షాక్ అయ్యేలా చేసింది. గేమింగ్ జాయ్‌స్టిక్‌తో తన భారీ మెచీన్లను కంట్రోల్ చేస్తున్న దృశ్యాలను కంపెనీ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బోరింగ్ కంపెనీని 2016లో ప్రారంభించారు..

బోరింగ్ కంపెనీని 2016లో ప్రారంభించారు..

‘ద బోరింగ్ కంపెనీ'ని ఎలాన్ మస్క్ 2016లో ప్రారంభించారు. ట్రాఫిక్ సమస్యలను నియత్రించే క్రమంలో తక్కువ ఖర్చుతో కూడిన టన్నెల్స్‌ను నిర్మించాలన్నది ఈ కంపెనీ ప్రధాన లక్ష్యం. తన ప్రాజెక్టులో భాగంగా న్యూయార్క్, వాషింగ్‌టన్ డీసీల మధ్య ఫాస్ట్ లేన్ టన్నెల్‌ను బోరింగ్ కంపెనీ నిర్మిస్తోంది. ఈ టన్నెల్ పనులు పూర్తయినట్లయితే కేవలం 30 నిమిషాల్లో ఈ రెండు నగరాలు ప్రజలు రాకపోకలు సాగించే వీలుంటుందని కంపెనీ తెలిపింది.

తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు..

తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు..

తన విప్లవాత్మక ఆలోచనలతో ఆకాశమే హద్దుగా ఎలాన్ మస్క్ (Elon Musk) దూసుకుపోతున్నారు. ఈ రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దక్షిణాఫ్రికాలో జన్మించిన ఈ కెనడియన్-అమెరికన్ వ్యాపార దిగ్గజం టెస్లా మోటార్స్, సోలార్ సిటీ, స్పేస్ ఎక్స్, పేపాల్ వంటి సంస్థలను స్థాపించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.

మొట్టమొదటి కమర్షియల్ రాకెట్‌..

మొట్టమొదటి కమర్షియల్ రాకెట్‌..

ఇంటర్నెషనల్ స్పేస్ స్టేషన్‌కు మొట్టమొదటి కమర్షియల్ రాకెట్‌ను అందించిన ఘనత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని SpaceX కంపెనీకే దక్కుతుంది. మానవ అంతిరక్ష ప్రయాణాన్ని మరింత విప్లవాత్మకం చేసే క్రమంలో ఇలాన్ మస్క్ స్పేస్ఎక్స్ కార్పొరేషన్ తీవ్రంగా శ్రమిస్తోంది. తిరిగి ఉపయోగించుకోదగిన (రీయూజబుల్) రాకెట్‌ను దిగ్విజయంగా పరీక్షించి ఓ సరికొత్త ఆవిష్కరణను SpaceX కార్పొరేషన్ విజయవంతం చేయగలిగింది.

 

 

ఎలాన్ మస్క్ 2019లో భారత్‌కు రాబోతున్నారా..?

ఎలాన్ మస్క్ 2019లో భారత్‌కు రాబోతున్నారా..?

టెస్లా కంపనీ సీఈఓ ఇంకా స్పేక్స్ ఎక్స్ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ త్వరలో భారత్ లో పర్యటించే ఆవకాశం ఉంది. అంతా ఓకే అయితే 2019 ఆరంభంలో ఈ పర్యటన ఉంటుంది. ఇటీవలే చైనా పర్యటనను పూర్తిచేసుకున్న ఆయన భారత్‌లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేసారు. ఓ ట్విట్టర్ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా భారత పర్యటనకు సంబంధించి తన అభిప్రాయాన్ని ఎలాన్ మస్క్ వ్యక్తం చేసారు.

 

 

భారత్‌కు టెస్లా ఎలక్ట్రిక్ కార్లు..

భారత్‌కు టెస్లా ఎలక్ట్రిక్ కార్లు..

మార్కెట్ విస్తరణలో భాగంగా ఎలాన్ మస్క్ తన టెస్లా ఎలక్ట్రిక్ కార్లను 2017లోనే భారత్‌లో ప్రవేశపెట్టాలనుకున్నారు. అయితే, ఇక్కడి చట్టాలు మరింత కఠినతరంగా ఉండటంతో ప్రాజెక్టుకు ఆదిలోనే బ్రేకులు పడ్డాయి. మేము భారత్‌లో విస్తరించాలనుకుంటున్నాం, అయితే ఊహించని రీతిలో ఇక్కడ నెలకున్న పరిస్థితులు మాకు ఛాలేంజింగ్‌గా ఉన్నాయంటూ ఎలాన్ మస్క్ గడచిన మేలో ఓ ట్వీట్‌ చేసారు.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Elon Musk’s Boring Company uses Xbox controller to operate its machine.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X